పి.సుశీల

ప్రముఖ గాయని
(పి. సుశీల నుండి దారిమార్పు చెందింది)

పి.సుశీల (పులపాక సుశీల) గాయకురాలు. సుశీల విజయనగరంలో 1935 నవంబరు 13న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవాడు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. భాష ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్చారణకి సుశీల పెట్టింది పేరు. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడింది. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలదు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలదు.

పి.సుశీల
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుగాన సరస్వతి, కన్నడ కోగిలె
జననం (1935-11-13) 1935 నవంబరు 13 (వయసు 88)
మూలంవిజయనగరం, మద్రాస్ ప్రెసిడెన్సి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారత దేశము
సంగీత శైలిప్లేబ్యాక్ గానం, కర్ణాటక సంగీతం
వృత్తిగాయని
క్రియాశీల కాలం1952–ప్రస్తుతం వరకు
వెబ్‌సైటుpsusheela.org

వ్యక్తిగత జీవితం

మార్చు

సుశీలకు వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావుతో వివాహం జరిగింది. వీరికి జయకృష్ణ అనే కుమారుడు, జయశ్రీ, శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ ఇరువర్ అనే తమిళ చిత్రంలో ఎ.ఆర్. రహమాన్‌తో కలసి ఆరంగేట్రం చేసిన గాయని.

తమన్‌ బృందంలో శుభశ్రీ చేరి అల వైకుంఠపురం చిత్రంలోని ‘సామజవరగమన’, ‘రాములో రాములా...’ పాటలకు గిటార్‌ ప్లే చేసారు. తర్వాత వెంకీమామ, వకీల్‌ సాబ్‌, గని, భీమ్లా నాయక్‌, రాధేశ్యామ్‌ (నేపథ్య సంగీతం) సినిమాలకు పని చేసారు.[1]

చదువు

మార్చు

సుశీల పాఠశాల విద్య పూర్తైన తరువాత మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో చేరింది. అక్కడ ఫస్ట్ క్లాస్ లో "డిప్లొమా ఇన్ మ్యూజిక్"ను చాలా చిన్న వయస్సులోనే పూర్తి చేసేరు. అప్పటి ఆ కళాశాలకు ప్రిన్సిపాల్‌గాద్వారం వెంకటస్వామి నాయుడు గారు పని చేసేవారు.

జీవిత గమనం

మార్చు

తొలినాళ్ల జీవితం

మార్చు

సంగీతానికి ప్రియమైన కుటుంబంలో జన్మించిన సుశీల చాలా చిన్న వయస్సులోనే అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణతో పెరిగారు. ఆమె తన పాఠశాల, విజయనగరం పట్టణ కార్యక్రమాలలో అన్ని సంగీత పోటీలలో పాల్గొనేది. ఆ రోజుల్లో ఆమె విస్తృతమైన శిక్షణ ద్వారా తగిన వ్యక్తీకరణలు, స్వరమాధుర్యంతో పాటలు పాడడంలో కీలకమైన సూక్ష్మ నైపుణ్యాలను పెంపొందించుకున్నది. ఆల్ ఇండియా రేడియో కోసం కొన్ని పాటలు పాడింది.

1950 నుండి 1954 వరకు

మార్చు

1950 లో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు తన కొత్త చిత్రంలో పాటల స్వరకల్పన కోసం కొత్త గాయకులను వెతుకుతున్నాడు. రేడియో కోసం ప్రదర్శించిన అత్యుత్తమ గాయకుల జాబితా కుదింపుకు సహాయపడటానికి అతను ఆల్ ఇండియా రేడియోని సంప్రదించాడు. కొన్ని సమగ్ర ఎంపిక పరీక్షల తర్వాత ఎ.ఐ.ఆర్. సుశీలతో ఎంపికైన ఐదుగురు గాయకుల జాబితాను పంపింది. తమిళ చిత్రం "పెట్రా థాయ్" (1952) అనే తమిళ చిత్రం కోసం ఎ. ఎం. రాజాతో కలిసి "ఎడుకు అజైతై" అనే యుగళ గీతం కోసం ఆమె వెంటనే సంతకం చేసింది.[2] ఈ రకంగా ఆమె సినీరంగంలో గాయనిగా ఆరంగేట్రం జరిగింది."పెట్రా థాయ్" తమిళ చిత్రం తరువాత తెలుగులో "కన్న తల్లి"గా రూపొందించబడింది. దీని కోసం ఆమె ఘంటసాలతో కలిసి యుగళగీతం చేసింది.దీని ఫలితంగా ఎవిఎం స్టూడియోలో నెలవారీ జీతంతో ఒంటరిగా వారు నిర్మించే చిత్రాలలో పాడటం కోసం నియనించబడింది.దీనివలన ఆమె సినీరంగంలో నిలదొక్కుకొని దీర్ఘకాలిక ఉపాధి పొందింది.స్టూడియో యజమాని ఎ. వి. మీయప్పన్ తమిళ భాష ఉచ్చారణ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి సుశీల కోసం ఒక తమిళ శిక్షకుడిని నియమించాడు. ఆ విధంగా సుశీల సంగీతం,తమిళ భాషపై పట్టు సాధించి విస్తారమైన జ్ఞానాన్ని సంపాదించి, తన విశిష్టమైన వృత్తిని ప్రారంభించింది.ఆమె 1954 లోమాడిదున్నో మారాయ అనే కన్నడ చిత్రంతో కన్నడ భాషాచిత్రాలలోకి ప్రవేశించింది.[3]

1955 నుండి 1960 వరకు

మార్చు

సినీ సంగీత పరిశ్రమను శాసిస్తున్న పి. లీల, ఎం. ఎల్. వసంతకుమారి, జిక్కి వంటి ప్రముఖ మహిళా గాయకుల ఆధిపత్యంతో 1950 వ దశకంలో కొత్తగా సంగీత పరిశ్రమలోకి ఎవరైనా కొత్తవారు ప్రవేశించడం అంత సులభం కాదు. అయినప్పటికీ, సుశీల ఆమె ప్రత్యేకమైన వ్యక్తీకరణలు, సృష్టమైన స్వర మాధుర్యంతో సంగీతంపై తనదైన ముద్ర వేసుకుంది. 1955 సంవత్సరంలో సుశీల తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలలో బ్యాక్ టు బ్యాక్ హిట్ పాటలతో ప్రజాదరణ పొందింది.1955 లో విడుదలైన మిస్సమ్మలో బలమైన కర్ణాటక శాస్త్రీయ సంగాతంతో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు పాడింది.శ్రోతల విపరీతమైన సంకేతాలకు అనుగుణంగా అప్రయత్నంగా సుశీల పాటలు అందించడంతో భారీ ప్రభావం ప్రజలపై పడింది. అదే సంవత్సరం విడుదలైన తమిళ చిత్రం "కనవనే కాన్ కందా దేవం"లో పాడిన పాటలకు ఆమెకు తమిళనాడులో మంచి పేరు తెచ్చింది.[2]

ఈ విధంగా 1955 నుండి 1960, 1970 నుండి 1985 వరకు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలలో సుశీల పాడే పాటలకు సినీ సంగీత ప్రపంచంలో భారీ వారసత్వం ప్రారంభమైంది. పురాణ గాథలకు ప్రసిద్ధిపొందిన తమిళ సంగీతకారులు విశ్వనాథన్ - రామమూర్తి ద్వయం, తమిళ సినిమా చరిత్రలో నిత్యనూతన పాటలను సుశీల స్వరానికి అనుగుణంగా రాశారు. ప్రశంసలు పొందిన గాయకులు తెలుగులో ఘంటసాల, తమిళంలో టి. ఎం. సౌందరరాజన్, కన్నడలోని పి. బి. శ్రీనివాస్‌తో ఆమె యుగళగీతాలు దక్షిణ భారత సంగీత పరిశ్రమలో యుగళ గీతాల కొత్త శకాన్ని సూచిస్తున్నాయి. ఆమె టి. ఎం. సౌందరరాజన్‌తో కలిసి విశ్వనాథన్ - రామమూర్తి ద్వయంతో కలిసి వందల పాటలను పాడింది.[2] "ఎడకల్లు గుద్దాడ మేలే" అనే కన్నడ చిత్రానికి సుశీల బ్లాక్ బస్టర్ కన్నడ పాట "విరాహా నోవు నూరు తారాహా" భారతీయ సినిమాలోని టాప్ 10 నిత్యనూతన (ఎవర్ గ్రీన్ హిట్స్) పాటల జాబితాలో ఒకటిగా చోటుచేసుకుని సంచలనం సృష్టించింది. నటి జయంతితో తీసిన సినిమాలలో ఆమె పాడిన పాటల కలయిక కర్ణాటకలో బాగా ప్రాచుర్యం పొందింది.

విజయవంతమైన ఆధిపత్యం

మార్చు

1960 నుండి 1985 వరకు

మార్చు

1960 ల ప్రారంభంలో సుశీల అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో తిరుగులేని ప్రధాన మహిళా గాయకురాలిగా ఎదిగింది.పాత అనుభవజ్ఞులైన గాయకులందరినీ సంగీత నేపథ్యంలోకి తీసుకువచ్చారు.1960 వ సంవత్సరంలో సుశీల సీత చిత్రానికి వెంకటేశ్వరన్ దక్షిణామూర్తి స్వరకల్పనతో మలయాళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి జి. దేవరాజన్, ఎం. కె. అర్జునన్ వంటి మలయాళ స్వరకర్తలతో ఆమె అనేక విజయవంతమైన పాటలను రికార్డ్ చేసింది. కె. జె. యేసుదాస్‌తో కలిసి ఆమె అనేక మలయాళ యుగళగీతాలను రికార్డ్ చేసింది. 1965 లో ఎం.ఎస్.వి. రామమూర్తితో ఆమె అనుబంధం విడిపొయిన తరువాత కూడా, ఎం.ఎస్. విశ్వనాధన్ ఆమెతో అనుబంధం కొనసాగించాడు.ఎం.ఎస్.వి. రామమూర్తితో విడిపోయిన తరువాత ఎం.ఎస్. విశ్వనాధన్  కింద ఆమె యుగళగీతాలు టి.ఎం. సౌందర్రాజన్, ఇతర సంగీత స్వరకర్తలతో గాత్రం చేసిన సోలో సాంగ్స్ ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందాయి.1960 నుండి 1985 వరకు ప్రతి ఇతర సంగీత స్వరకర్త, చిత్ర నిర్మాతకు ఆమె మొదటి గాయనిగా ఎంపికలో నిలిచింది.

1968 నవంబరు 29 న విడుదలైన ఉయర్ధ మణితన్ తమిళ చిత్రం రంగస్థలనాటకంలాగా 125 రోజులకు పైగా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ చిత్రంలోఎం.ఎస్. విశ్వనాధన్ స్వరకల్పన చేసిన "పాల్ పోలేవ్" (naalai intha velai paarthu) పాటగాత్రం చేసిన సుశీలకు 16 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని 1069 లో గెలుచుకుని, ఆ వర్గానికి ఆమె ప్రారంభగ్రహీతగా నిలిచింది.[4] అదే పాటకు ఆమె తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా పొందింది.[5] దీని ద్వారా భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన జాతీయ అవార్డులను అందుకున్న వారిలో సుశీల ఒకరుగా గుర్తింపు పొందింది.ఆ సంవత్సరాల్లోనే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా భావించే లతా మంగేష్కర్ తో సుశీల బలమైన స్నేహాన్ని పెంచుకుంది.సుశీల చేసిన అన్ని పనులను తరచుగా లతా మంగేష్కర్ ప్రశంసించింది.సుశీల చండిప్రియా చిత్రంలో జయప్రద చేసిన నృత్యం కోసం "శ్రీ భాగ్య రేఖ - జననీ జననీ" అనే గానం చేసిన పాట ప్రేక్షకులలో అత్యంత గుర్తింపు పొందింది.సుశీల ఎం.ఎస్.విశ్వనాధన్ ను తన గురువుగా భావిస్తుంది.అతని సంగీత దర్శకత్వంలో 1955-1995 వరకు సుశీల పాడిన పాటలలో గరిష్ఠ ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి.

1970 వ దశకంలో సుశీల దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని ప్రధాన జాతీయ అవార్డులను గెలుచుకుంది. కె.వి.మహదేవన్, లక్షీకాంత్ ప్యారేలాల్, ఎల్. వైద్యనాథన్, లక్ష్మీ కిరణ్, ఎస్.ఎల్.మనోహర్, అజిత్ మర్చంట్, జి.దేవరాజన్, ఎస్. ఎన్. త్రిపాఠి వంటి సంగీత దర్శకులతో ఈ కాలంలో ఆమె హిందీ పాటలను కూడా రికార్డ్ చేసింది. మనోహర్, అజిత్, జి. దేవరాజన్, ఎస్.ఎన్. త్రిపాఠి, మరొక గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా కోసం కొన్ని ముఖ్యమైన పాటలు పాడింది.1980 నుండి యం.యస్.విశ్వనాధన్ ఇళయరాజాతో తన బలమైన అనుబంధంతో జానకి వారితో మంచి స్థానం సంపాదించినప్పటికీ, సుశీల 1985 వరకు అగ్రస్థానంలో కొనసాగింది.1985 తరువాత కూడా అనేక మంది సంగీత దర్శకులు సుశీలను పురాణ గాత్రానికి ఎంపికచేసుకున్నారు.1986 తరువాత కూడా ఆమె చలనచిత్ర హిట్ పాటల ఎంపిక చేసుకుని 2005 వరకు అలాగే పాటలను కొనసాగించింది.

చలనచిత్ర పాటలకు దూరం

మార్చు

1985 నుండి 2000 వరకు

మార్చు

ఎస్. జానకి, వాణీ జయరామ్ 1985 నుండి సదరన్ ఫిల్మ్ సాంగ్స్ సెంటర్ స్టేజిని ఏర్పరిచి,వీరికి తోడు కె. ఎస్. చిత్ర కూడా వారితో భాగస్వామ్యం కావడంతో, సుశీల నెమ్మదిగా తన దృష్టిని సినిమాల నుండి భక్తి, లలిత సంగీతానికి చెందిన పాటలు పాడటానికి మళ్లించింది. ఆమె 1984 నుండి1999 వరకు శ్రావ్యమైన తెలుగు చలనచిత్ర పాటలను పాడటం కొనసాగించింది, అయినప్పటికీ 1985 తరువాత ఆమె చిత్రాలలో పాడటానికి ఆఫర్లను తగ్గించింది. ఆమె తెలుగు చిత్రాలలో పాటలకు అవార్డులను కూడా గెలుచుకుంది.1987 లో విశ్వనాథ నాయకుడు, 1989 లో "గోదావరి పొంగింది" 1989 లో తమిళ చిత్రం "వరం" తేరే లియే మైనే జనమ్ హిందీచిత్రానికి అవార్డులు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేజ్ షోలపై కూడా ఆమె ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు వారి వ్యవస్థీకృత ప్రదర్శనల కోసం ఆమెను ఆహ్వానించాయి. ఆమె వివిధ ఆడియో కంపెనీల కోసం 1000 కి పైగా భక్తి పాటలను రికార్డ్ చేసింది.1988 లో ప్రశంసలు పొందిన సంగీత స్వరకర్త నౌషాద్ తన మలయాళ చిత్రం "ధ్వానీ" కోసం "జానకి జానే" పాటను పాడాలని పట్టుబట్టారు.1990 లో ఇళయరాజా, ఎ. ఆర్. రెహమాన్, ఇతరుల కోసం ఆమె తన కెరీర్లో కొన్ని ఉత్తమ పాటలను రికార్డ్ చేసింది. రెహ్మాన్ స్వరపరచిన పుడియా ముగం (1993) చిత్రం నుండి "కన్నుక్కు మాయి అఘగు" అనే పాటల లిరికల్ కంటెంట్ రెండిషన్ చాలా ప్రశంసలు అందుకుంది. ఆమె 2005 వరకు తమిళంలో పాటలు పాడింది.1986 నుండి 2005 వరకు అనేక భక్తి, జానపద పాటలను పాడింది.1990 నుండి 2005 వరకు అనేక లైవ్ షోలు చేసింది.

సుశీలపేరుతో ట్రస్టు

మార్చు

2008 లో ఏర్పడిన పి. సుశీల ట్రస్ట్‌లో నెలవారీ పెన్షన్ చెల్లింపు పథకం ఉంది. అవసరమైన కొంతమంది సంగీతకారులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.ప్రతి నవంబరు 13 న ఒక సంగీత కచేరీ ఉంటుంది. ఈ సమయంలో ఒక ప్యానెల్ ఎంపిక చేసిన సీనియర్ ఆర్టిస్ట్ (లు) జీవితకాల సాధన అవార్డులు, ఈ ట్రస్ట్ ద్వారా అవార్డులు ప్రదానం చేస్తారు.కచేరీ కార్యకలాపాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతాయి.ఇప్పటివరకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను టి. ఎం. సౌందరరాజన్, పి. బి. శ్రీనివాస్‌లకు ప్రదానం చేసారు. ఇప్పటివరకు ట్రస్ట్ అవార్డులను అందుకున్నవారు ఎస్.జానకి, వాణీ జయరామ్, ఎల్. ఆర్. ఈశ్వరి, పి. జయచంద్రన్, ఎస్. పి. బాలసుబ్రమణ్యం, కె. జె. యేసుదాస్ ఇంకా మరికొందరున్నారు.

పాటల గణాంకాలు

మార్చు

అన్ని భాషలలో

మార్చు

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సుశీల 12,300 పాటలు పాడినట్లు అంగీకరించింది. అన్ని భాషలందు సుశీల 40,000 పాటలను రికార్డ్ చేసింది.

తెలుగు

మార్చు

సుశీల తెలుగులో 12000 కి పైగా పాటలు పాడారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తెలుగులో మొదటి యుగళగీతం పి సుశీతో ఉంది. ఆమె కె.వి.మహదేవన్ సంగీతంలో 2000 కి పైగా పాటలను రికార్డ్ చేసింది. ఆమె కె. చక్రవర్తి సంగీతంలో సుమారు 2000 కి పైగా పాటలను రికార్డ్ చేసింది.

ఆమె భక్తిపాటలుతో తమిళంలో 6000 కి పైగా పాటలు పాడింది. ఆమె టి. ఎం. సౌందర రాజన్ తో కలిసి 1000 యుగళగీతాలు పాడింది. ఆమె ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతంలో 1500 కి పైగా పాటలను కూడా అందించింది.

కన్నడ

మార్చు

సుశీల కన్నడలో 5000 కి పైగా పాటలను రికార్డ్ చేసింది. ఆమె ఘంటసాల, పి. బి. శ్రీనివాస్‌తో కలిసి అనేక యుగళగీతాలు పాడింది.పురాణ పాత్రలలో నటించే నటుడు, గాయకుడు రాజ్‌కుమార్‌తో కొన్ని యుగళగీతాలు కూడా చేసింది. పి. బి. శ్రీనివాస్‌తో ఆమె యుగళగీతాలు కన్నడ చిత్ర పరిశ్రమలో కొన్ని సతత హరిత పాటలుగా భావిస్తారు. ఎస్. పి. బాలసుబ్రమణ్యం మొట్టమొదటి యుగళగీతం కన్నడ పాట నక్కారే అడే స్వర్గా నుండి కనసిడో నానాసిడో అనే పాటను సుశీలతోకలసి పాడాడు.[6][7]

మలయాళం

మార్చు

ఆమె మలయాళంలో 1200 కి పైగా పాటలు పాడింది. సంగీతకారుడు దేవరాజన్ ఆమె పాడిన అన్ని భాషలలోని 300 పాటలకు సంగీతం సమకూర్చాడు.[8]

ఇతర భాషలు

మార్చు

హిందీలో 100 చలనచిత్ర పాటలు, సంస్కృతంలో 120 భక్తి పాటలు, సింహళ భాషలో 9 చలనచిత్ర పాటలు సహా సుశీల ఇతర భాషలలో 300 కి పైగా పాటలు పాడారు. ఆమె బెంగాలీలో కూడా పాడింది. పంజాబీ, తులు, బడుగా ఒరియా భాషలలో కూడా కొన్ని పాటలు పాడింది.

పురస్కారాలు

మార్చు

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఆరు దశాబ్దాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండింటినీ వివిధ భారతీయ భాషలలో ఒక మహిళా గాయనిగా పాడినందుకు ఆమె గుర్తింపు పొందింది. ఆమె ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర అవార్డులను కూడా అందుకుంది.[9] దక్షిణ భారత సినిమాలో స్త్రీవాదాన్ని నిర్వచించిన గాయకురాలిగా సుశీలా విస్తృతంగా ప్రశంసలు అందుకుంది.‘’ప్రతిష్టాత్మక గౌరవం’’ అనే జాతీయ అవార్డును ప్లేబాక్ సింగర్సులో ఉయర్ధా మణిధన్ అనే తమిళ చిత్రానికి సుశీల మొదటి గ్రహీతగా గెలుచుకుంది.ఆమెను "గాన కోకిల" "గాన సరస్వతి" అని పిలుస్తారు. ఆమె పాడిన ఏ భాషలోనైనా అక్షరాల ఉచ్చారణ చాలా స్పష్టంగా, కచ్చితంగా ఉండే గొప్ప గాత్ర గాయకులలో ఒకరిగా ఆమె పరిగణించబడుతుంది.[10]

సుశీల పాడిన పాటల సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
 1. "నాయనమ్మ పేరు చెడగొట్టద్దని..." EENADU. Retrieved 2022-02-27.
 2. 2.0 2.1 2.2 "Melody Queen P. Susheela - About Smt. P. Susheela".
 3. "Untitled Document".
 4. https://variety.com/2013/film/global/tamil-songwriter-vaali-dies-at-83-1200565558/
 5. "Melody Queen P. Susheela".
 6. "Melody Queen P. Susheela - Kannada Page".
 7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-06. Retrieved 2020-04-13.
 8. "Melody Queen P. Susheela - Malayalam Page".
 9. "About". The Southern Nightingale (in ఇంగ్లీష్). 2015-06-28. Archived from the original on 2020-05-08. Retrieved 2020-04-09.
 10. "Melody Queen P. Susheela - Interviews". psusheela.org. Retrieved 2020-04-09.
 11. "ప్రముఖ గాయని సుశీల పేరిట ప్రత్యేక తపాలా స్టాంపు విడుదల". ETV Bharat News. Retrieved 2022-03-09.

బయటి లింకులు

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=పి.సుశీల&oldid=4172365" నుండి వెలికితీశారు