ఆలోచన
(ఆలోచించు నుండి దారిమార్పు చెందింది)
ఆలోచన (Thought) మనుషుల బుద్ధికి చెందిన విశేష లక్షణం. ఇది మెదడుకు సంబంధించిన విషయం. భూమి మీద మానవుల ఆలోచనా విధానం మూలంగా మన జీవితం ఆధారపడి ఉంటుంది.
ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆ వ్యక్తి మంచి లేదా చెడుల మధ్య విచక్షణ ఆధారంగా తెలుస్తుంది.
తెలుగు భాషలో ఆలోచన పదానికున్న ప్రయోగాలు.[1] ఆలోచన n. Thought, looking at, or examining. Consultation, consideration, reflection, counsel, policy, deliberation, plan, intent, purpose, motive, imagination, supposition, advice, view, intention. ఆలోచనకు తెచ్చు to weigh, consider, view, regard. ఆలోచించు v. a. To think, view, consider. consult, deliberate, suppose or reflect.
స్త్రీ పురుషుల ఆలోచనల్లో తేడాలు
మార్చు- పురుషులకు జ్నాపక శక్తి కంటే తెలివి ఎక్కువ, స్త్రీలకు తెలివికంటే జ్నాపక శక్తి ఎక్కువ.
- రిస్కు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటారు స్త్రీలు, రిస్కు తీసుకునైనా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటారు పురుషులు.
- ఎవరి సాయమూ లేకుండా నిర్ణయం తీసుకోగలరు పురుషులు, నలుగుర్నీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు స్త్రీలు.
- పురుషుల కంటే స్త్రీలు చాలా సున్నిత మనస్కులు.
- పురుషులు ఎంతటి భయంకరమైన రహస్యాన్నైనా దాచుకోగలరు. స్త్రీలు దాచుకోలేరు.
- స్త్రీల ఆలోచన కుటుంబము వరకే పరిమితమౌతుంది, పురుషుల ఆలోచనలు కుటుంబమే కాక సమాజంలో కూడా విహరిస్తుంటాయి.