ఆళ్ళవారిపాలెం
ఆళ్ళవారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఆళ్ళవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°03′57″N 80°44′47″E / 16.065841°N 80.746502°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522309 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
మౌలిక సదుపాయాలు
మార్చువైద్య సౌకర్యం:- ఈ గ్రామం కనగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనిది.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కూరేటి రామారావు, సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుగ్రామదేవత శ్రీ అంకాళ్ళమ్మ తల్లి
మార్చుఆళ్ళవారిపాలెం గ్రామంలో కొలువైన గ్రామదేవత శ్రీ అంకాళ్ళమ్మ తల్లి కొలువులు, 2014, జూన్-1 నుండి 5 వరకు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజు, 5వ తేదీ గురువారం నాడు, ఉదయం అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. జంగమదేవర చెప్పే అమ్మవారి కథలు వినేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపినారు. సాయంత్రం అమ్మవారిని తిరిగి, ఆలయంలో ప్రవేశపెట్టినారు.
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన శ్రీ రేపల్లె మాధవరావు ఒక కౌలు రైతు. వీరి కుమారుడు శ్రీకాంత్, దగ్గరలో విద్యాసౌకర్యం లేకపోవడంతో, దూరమైనా గానీ, గూడవల్లిలోని వనజాచంద్ర పాఠశాలకు రోజూ వెళ్ళి చదువుకుని, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఇతడు, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, తన గ్రామానికీ మరియూ తను చదువుకున్న పాఠశాలకూ పేరుతెచ్చాడు.