సర్పంచి

గ్రామ పెద్దగా ఎన్నుకోబడేవారు

పంచాయతి అధ్యక్షుడిని సర్పంచి అంటారు. స్థానిక స్వయం పరిపాలన యొక్క చట్టబద్ధమైన సంస్థ ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది. గ్రామ స్థాయి స్థానిక స్వయం పరిపాలన యొక్క చట్టబద్ధమైన సంస్థను భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో గ్రామ పంచాయతి అని అంటారు. గ్రామ పంచాయితికి సర్పంచితో పాటు ఇతర సభ్యులను కూడా ఎన్నుకుంటారు, వీరిని మెంబర్స్ అంటారు. సర్పంచి ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ సమాజానికి మధ్య పరిచయ కేంద్ర స్థానంగా ఉంటాడు. ఇటీవల సర్పంచులకు పంచాయితీరాజ్ కింద చిన్న న్యాయ అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

సర్పంచ్ అర్థంసవరించు

సర్ అర్థం పెద్ద (నాయకుడు), పంచ్ అర్థం నిర్ణయించువారు, దీని ప్రకారం సర్పంచి అనగా గ్రామ నిర్ణయ రూపకర్తల పెద్ద.

ఎన్నికసవరించు

సర్పంచులను ఎంపిక చేసేటప్పుడు ప్రభుత్వం స్థానిక ప్రజలకు తెలిసేలా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. కొన్ని స్థానాలను రిజర్వేషన్ ప్రకారం కేటాయిస్తారు, ఈ స్థానాలలో సర్పంచి పదవికి రిజర్వేషన్ ఉన్నవారు మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది.

అర్హతలుసవరించు

గ్రామ పంచాయితికి పోటీ చేసే వ్యక్తి అదే పంచాయితిలో ఓటు హక్కును కలిగి ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ముగ్గురు బిడ్డలు ఉండకూడదు.గ్రామ పంచాయతికి సర్పంచితో పాటు ఎన్నుకోబడిన మెంబర్లలో ఒకరిని ఉపసర్పంచిగా ఎన్నుకుంటారు, ఉపసర్పంచిని మెజారిటీ పరంగా మెంబర్లే ఎన్నుకుంటారు, ఉపసర్పంచి పదవికి పోటీ పడిన అభ్యుర్థులలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ లేని పక్షంలో వారిలో ఒకరిని ఉపసర్పంచిగా సర్పంచి ఎన్నుకుంటాడు.రిజర్వేషన్ కేటాయించిన స్థానాలలో, రిజర్వేషన్ ఉన్నవారు ఎవరు లేనట్లయితే, లేక రిజర్వేషన్ ఉన్నా వారు సర్పంచి పదవికి పోటీ చేయనట్లయితే ఉప సర్పంచిగా ఎన్నుకోబడిన వ్యక్తే సర్పంచిగా (ఇన్‌ఛార్జి సర్పంచిగా) బాధ్యతలు స్వీకరిస్తాడు.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సర్పంచి&oldid=2937413" నుండి వెలికితీశారు