ఆవశ్యక కొవ్వు ఆమ్లం

(ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు నుండి దారిమార్పు చెందింది)

ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు (Essential fatty acids or EFAs) మానవుల, జంతువుల శారీరకంగా అవసరమైన కొవ్వు ఆమ్లాలు.వీటిని జీవక్రియ వలన శరీరంలో తయారుచేసుకోలేవు కాబట్టి ఆహారంతో వాటిని ఇతర వనరులనుండి తీసుకోవలసిన ఆవశ్యక పదార్ధాలు.[1]

ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు రెండు. ఇవి : ఆల్ఫా-లినోలినిక్ ఆమ్లం (alpha-linolenic acid) (an omega-3 fatty acid), లినోలిక్ ఆమ్లం (linoleic acid) (an omega-6 fatty acid) .[2][3][4] ఇతర కొవ్వు ఆమ్లాలు అప్పుడప్పుడు ఆవశ్యకముగా ("conditionally essential fatty acid" include గామా-లినోలెనిక్ ఆమ్లం (gamma-linolenic acid) (an omega-6 fatty acid), లారిక్ ఆమ్లం (lauric acid) (a saturated fatty acid),, పామిటోలిక్ ఆమ్లం (palmitoleic acid) (a monounsaturated fatty acid) .[5]

జీవక్రియలో కొవ్వు ఆమ్లాలు

మార్చు

క్షీరదాలు కొంతమేరకు కొవ్వుఆమ్లాలను తయారుచేసుకునే సమర్దత కలిగివున్నాయి. పది కార్బనుల వరకు హైడ్రోకార్బను శృంఖలం కలిగివున్న సంతృప్త కొవ్వుఆమ్లాలను తయారుచేసుకొగలవు. అయితే అంతకు మించి కార్బనులున్న కొవ్వు ఆమ్లాలను, ముఖ్యంగా బహుబంధాలున్న అసంతృప్త కొవ్వుఆమ్లాలను (poly unsaturated fatty acids) సృష్టించుకొనే శక్తి లేదు.[6] ఇందుకు కారణం క్షీరదాలలో డెస్యాచురెజ్ ఎంజైమ్ (desaturase enzyme) లేకపోవడం. అందువలన బహుబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగిన పదార్థాలను ఆహారముతో పాటు తప్పనిసరిగా తీసుకొవాలి. క్షీరదాలు స్యయంగా సృష్టించుకోలేని కొవ్వు ఆమ్లాలను 'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు' (essential fatty acids) అంటారు. 1950-70 వరకు మూడు బహుబంధ కొవ్వు ఆమ్లాలను ఆవశ్యక కొవ్వుఆమ్లాలుగా భావించె వారు. అవి : 1. అల్ఫా (α) లినోలినిక్ ఆమ్లం (C3:3) 2. లినొలిక్‌ ఆమ్లం (C18:2) 3. ఆరచిడొనికామ్లం (C20:4) . తరువాత మొదటి రెండు కొవ్వుఆమ్లాలను ఆవశ్యక కొవ్వుఆమ్లాలనిలుగా నిర్ణయించారు. కారణం జీవక్రియలో (metabolism) లో లినొలిక్‌ ఆమ్లం నుండి ఆరాచిడొనిక్‌ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ ఆవశ్యకపు ఆమ్లాలనే 'ఒమేగా' కొవ్వుఆమ్లాలని ప్రస్తుతం ఎక్కువగా పిలుస్తున్నారు. లినోలినిక్‌ ఆమ్లాన్ని ఒమేగా (ω-3) 3 కొవ్వు ఆమ్లమని, లినొలిక్‌ కొవ్వు ఆమ్లాన్ని ఒమేగా (ω-6) -6 కొవ్వుఆమ్లమని అంటారు. కొత్తగా ఈ ఒమేగా అనే పేరు ఎందుకు వచ్చింది?. సాధారణంగా గతంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలలోని ద్విబంధాలను కార్బొక్షిల్‌ సమూహం (COOH.group) లో వున్న కార్బను నుండి లెక్కించడం మొదలు పెట్టెవారు. కార్బొక్షిల్‌ సమూహాన్ని డెల్టా ఎండ్‌ (δ end) అని, కార్బొక్షిల్ గ్రూప్‌లో వున్న కార్బను తరువాత వున్న కార్బనును 'ఆల్ఫా (α) కార్బను అని పిలిచెదరు .α కార్బను తరువాత నున్నకార్బనును β కార్బను (కార్బొక్షొల్‌ కార్బను నుండి 3వ కార్బను) అంటారు. డెల్టా కార్బను నుండి ఏ కార్బనుల వద్ద ద్విబంధాలున్నయో ఆ సంఖ్యను ఆమ్లాల పేరు ముందు చేర్చెవారు. ఉదాహరణకు ఒలిక్‌ అమ్లంకు, కార్బొక్షిల్‌ కార్బను నుండి 9 వ కార్బను వద్ద ద్విబంధం ఉంది. లినొలిక్‌ ఆమ్లంకు-9, -12 కార్బనుల వద్ద బంధాలున్నాయి, లినోలినిక్‌ అమ్లానికి -9, -12, -15 ల వద్ద బంధాలున్నాయి. ఒలిక్‌ ఆమ్లాన్ని 9-ఆక్టా డెసెనొయిక్‌ ఆమ్లమని, లినొలిక్‌ ఆమ్లాన్ని 9, 12-ఆక్టా డెకాడైనొయిక్‌ ఆమ్లమని, లినోలినిక్‌ ఆమ్లాన్ని 9, 12, 15-ఆక్టాడెకా ట్రైయినొయిక్‌ ఆమ్లమని పిలుస్తారు. కొవ్వు ఆమ్లంలోని హైడ్రోకార్బను గొలుసులోని కార్బొక్షిల్ సమూహం (group) లోని కార్బను తరువాత కార్బనును 'అల్ఫా కార్బను అనియు, హైడ్రొకార్బను గొలుసు రెండో చివరన వున్న మెథైల్ (CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా కార్బను అని అంటారు. గ్రీకు ఆక్షరమాలలో అల్ఫా మొదటి అక్షరం,, ఒమెగా చివరి ఆక్షరం. మిథైల్ గ్రూప్‌లోని కార్బను చివరి కార్బను కావటం వలన దానిని ఒమేగా కార్బను అన్నారు. లినోలినిక్‌ ఆమ్లంలోని చివరి ద్విబంధం (15=16 కార్బనుల వద్ద నున్న ద్విబంధం) ను ఒమేగా కార్బను వైపు నుంచి లెక్కించిన అది 3=4 కార్బనుల వద్ద వుండును. ఒమేగా కార్బను నుండి లెక్కించినప్పుడు 3వ కార్బను వద్ద మొదటి ద్విబంధం వున్న కొవ్వుఆమ్లాలను ఒమేగా-3 కొవ్వుఆమ్లాలని, 6 వ కార్బను వద్ద మొదటి ద్విబంధమున్న ఒమేగా-6 కొవ్వుఆమ్లమని పిలవడం ప్రారంభమైనది.

ఆవశ్యకత

మార్చు

ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు మానవ దేహ వ్యవస్దకు ఎంతో అవసరము. కణపొరల నిర్మాణంలో (cell membrane), జీవచర్యకు అవసమగు శక్తిని అందించడంలో కొవ్వులు అత్యంత కీలక భాగస్వామ్యం కల్గివున్నాయి. మొదడులోని బూడిదరంగు కణపొరలలో 50% వరకు పాస్పొలిపిడ్స్ ఉన్నాయి. పాస్పోలిపిడ్స్‌ కొవ్వుఆమ్లం, గ్లిసెరొల్, పాస్పర్‌, నత్రజని సమ్మేళన పదార్థములు. అంతియే కాదు మిగతా శరిరభాగాలలో నిర్మాణంలో కూడా EPA, DHA పాలుపంచుకుంటాయి. కొవ్వుఆమ్లాలను నూనెల రూపంలో ఆహారంగా తీసుకన్నప్పుడు దేహా కణాలలోనికి నూనెలు శోషింపపడూటకు ముందు హైడ్రొలిసిస్ చర్య వలన గ్లిసెరొల్,, కొవ్వుఆమ్లంలుగా విడగొట్టబడును. ఇందుకు దేహంలో నిలిపెసెస్ (triglyceridases) అనే ఎంజైమ్‌ కారణం. గ్లిసెరొల్ జీవక్రియలో గ్లిసెరాల్దిహైడ్ 3-ఫాస్పెట్‌గా మారి గ్లైకొసిస్ లో ప్రవేశించి అకడి నుండి క్రెబ్స్‌ వలయం (Kerb's cycle) ద్వారా ATPని ఉత్పత్తిలో పాలుపంచుకొనును. కొవ్వుఆమ్లాలు పాస్ఫొలిపిడ్స్‌తో కలసి కణనిర్మాణంలో భాగస్యామ్యం వహించును., కావలసిన శక్తిని విడుదలచేయును. కొవ్వుఆమ్లాలు β-ఆక్సికరణ ద్వారా శక్తిని విడుదల చేయును. β-అక్సీకరణ కొవ్వుఆమ్లంలోβ కార్బను వద్ద ప్రారంబమగును.

జీవక్రియ (metabolism, biosynthesis) లో లినొలిక్ ఆమ్లం (ఒమేగా-6 ఆమ్లం డెసచురెసెన్ వలన మొదట గామా లినొలెనిక్‌ ఆమ్లంగా (GLA), తరువాత డి హోమో గామా లినొలెనిక్‌ ఆమ్లంగా (DGLA), చివరకు ఆరాచి డొనిక్‌ ఆమ్లంగా రూపాంతరం చెందును.[7] ఆరాచిడొనిక్‌ ఆమ్లం నుండి లిపొక్సిజెనెస్ (lipoxygenase), సైక్లొ-అక్సిజెనెస్ (cyclo-oxygenase) వలన లిపొక్షినులు, లుకొట్రైయిన్స్ (lipoxins, leucotreines) ఏర్పడును. అల్ఫా లినొలెనిక్‌ ఆమ్లం (ఒమెగా-3 ఆమ్లం) డిసచురెస్,, ఎలంగెస్ వలన ఎయికొస పెంటనొయిక్‌ ఆమ్లంగా (Eicosapentanoic acid (EPA) ) గా మారును. EPA నుండి లుకొట్రైయిన్స్, ప్రోస్టగ్లాండిన్స్ (prostaglandins), థ్రొంబాక్షెన్స్ (Thrombaxanes),, డొకొస హెక్సనొయిక్‌ ఆమ్లం (DHA) ఏర్పడును. అల్ఫాలినొలెనిక్‌ ఆమ్లం లిన్‌సీడ్, పెరిల్ల, వాల్‌నట్‌, గుమ్మడి్‌ విత్తన నూనెలలో అధికంగా వుండును.

లినొలిక్‌, లినొలెనిక్‌ ఆమ్లంలను కల్గివున్నకొన్ని నూనెలు

నూనె లినొలిక్‌ఆమ్లం లినొలెనిక్‌ఆమ్లం
పెరిల్లా 15% 61%
లిన్‌సీడ్, అవిసె నూనె 16% 53%
కనొలా 22% 10%
వాల్‌నట్ 60% 10%
సోయా నూనె 51% 7%
పామాయిల్ 10% 0.0
ఆలివ్ నూనె 10% 0.0
మొక్కజొన్న 55% 0.0
పొద్దుతిరుగుడు నూనె 65% 0.0
కుసుమ నూనె 75% 0.0

ఒమేగా కొవ్వుఆమ్లాలు

మార్చు

 

ఒమేగా-6 కొవ్వుఆమ్లం

మార్చు

1. లినొలిక్‌ ఆమ్లం: 18 కార్బనులను కల్గివుండి, రెండు ద్విబంధాలను కలిగివున్నది. ఒమేగా కార్బనుండి -6, -9 కార్బనులవద్ద ద్విబంధాలున్నాయి.ఈకొవ్వుఆమ్లాలు, కుసుమ, పొద్దుతిరుగుడు, సొయా, మొక్కజొన్నగింజలలో నూనెలో అధికంగా ఉండును[8]

2.గామా లినొలెనిక్‌ ఆమ్లం: 18 కార్బనులను కలిగివుండి, మూడు ద్విబంధాలను కలిగివుండును. ఒమెగా కార్బను నుండి -6, -9, -12 కార్బనుల వద్ద ద్విబంధాలుండును.ఇదిborrage seed oil, evening primrose oil,, black currant seed oil లలో ఉన్నది[7]

ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు

మార్చు

1. ఆల్ఫాలినొలెనిక్‌ ఆమ్లం: 18 కార్బను లను కలిగివున్నది. ఒమెగా కార్బను నుండి -3, -6, -9 వ కార్బనుల వద్ద ద్విబంధాలున్నాయి.

2.ఎయికొస పెంటనొయిక్‌ ఆమ్లం (Eicosapentanenoic acid) (EPA) : 20 కార్బనులను కలిగివుండి, 5 ద్విబంధాలను ఉన్నాయి. ద్విబంధాలు -3, -6, -9, -12, -15 కార్బనుల వద్ద కలిగివుండును.

3. డొకొసహెక్సనొయిక్‌ ఆమ్లం (Docosahexanenoic acid) (DHA) :22 కార్బనులను కలిగివుండి, 6 ద్విబంధాలున్నాయి. ద్విబంధాలు -3, -6, -9, -12, -15, -18 కార్బనుల వద్ద ఉన్నాయి.

  • EPA, DHA ఆమ్లాలు శాకనూనెలలో లభించవు. ఈ రెండు కొవ్వుఆమ్లాలు చేప (Fish),, గండుమీను (Cod) కాలేయనూనెలలో లభించును.

ఆవశ్యక కొవ్వుఆమ్లాల ప్రభావం

మార్చు
  • దేహ కణనిర్మాణంలో పాల్గొనును.
  • గుండె సంబంధమైన వ్యాధులని నివారించును.రక్త పీడనంను అదుపులో వుంచును.సుగరు వ్యాధిని అదుపులోవుంచును.
  • ప్రొస్టెట్‌ క్యాన్సరు,, రొమ్ము క్యాన్సరు నుండి రక్షణ కల్పించును. కీళ్లనొప్పులను తగ్గించును.

మూలాలు

మార్చు
  1. Modern Nutrition in Health and Disease 6th Ed. (1980) Robert S. Goodhart and Maurice E. Shils. Lea and Febinger. Philadelphia. ISBN 0-8121-0645-8. pp. 134-138.
  2. Whitney Ellie and Rolfes SR Understanding Nutrition 11th Ed, California, Thomson Wadsworth, 2008 p.154.
  3. Enig Mary G. Know your Fats Bethesda Press 2005 p.249
  4. Burr, G.O., Burr, M.M. and Miller, E. (1930). "On the nature and role of the fatty acids essential in nutrition" (PDF). J. Biol. Chem. 86 (587). http://www.jbc.org/cgi/reprint/97/1/1.pdf Archived 2007-02-21 at the Wayback Machine. Retrieved 2007-01-17.
  5. Enig 2005 p.249
  6. "Polyunsaturated Fatty Acids". healthyeating.sfgate.com. Archived from the original on 2015-05-06. Retrieved 2015-03-31.
  7. 7.0 7.1 "Gamma-linolenic acid". umm.edu. Retrieved 2015-03-31.
  8. "OMEGA - 6 FATTY ACIDS". webmd.com. Retrieved 2015-03-31.