ఆవులవారి పాలెం (కొల్లూరు)

(ఆవులవారి పాలెం(కొల్లూరు) నుండి దారిమార్పు చెందింది)

ఆవులవారి పాలెం,బాపట్ల జిల్లా, కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఆవులవారి పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఆవులవారి పాలెం is located in Andhra Pradesh
ఆవులవారి పాలెం
ఆవులవారి పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′15″N 80°48′41″E / 16.187413°N 80.811267°E / 16.187413; 80.811267
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి దేవకుమారి
పిన్ కోడ్ 522301
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో దేవకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్ర మాసంలో, వసంత నవరాత్రులు కన్నుల పండువగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, స్వామివారికి గ్రామోత్సవం జరుపుతారు. గ్రామోత్సవంలో, ఇంటింటా, మహిళలు పూజలు చేసి, హారతులిచ్చెదరు. యువకులు, చిన్నారులు గులాం జల్లుకుంటూ, ఉత్సాహంగా పాల్గొంటారు.

గ్రామంలోని ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

  • చిల్లా వాసు ప్రముఖ జర్నలిస్టు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.