ఆవుల మంజులత
ఆవుల మంజులత తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి. తండ్రి ఆవుల సాంబశివరావు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తే... ఆమె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ చేశారు. నాన్న ఆవుల సాంబశివరావు, అమ్మ ఆవుల జయప్రదాదేవి ఇద్దరూ సంఘసేవకులే. పుట్టింది మద్రాస్‌లో. హైదరాబాద్‌లో పెరిగారు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క. విద్యాభ్యాసమంతా నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు పాఠశాలలో, రెడ్డి విమెన్స్ కాలేజీలో జరిగింది. కెమికల్ ఇంజనీర్ డి.ఎస్.రావుతో పెళ్లయింది. తెలుగు అకాడమీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా, రీసెర్చ్ ఆఫీసర్‌గా బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావులతో కలిసి పనిచేశారు. 1999లో తెలుగు అకాడమీకి డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2005లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంకి ఉపకులపతి అయ్యారు. ఇజ్రాయెల్ లోని హీబ్రూ యూనివర్శిటీలో తెలుగుశాఖను ఏర్పాటు చేశారు. కొడుకులిద్దరూ అమెరికాలో ఉన్నారు.
ఆవుల మంజులత | |
---|---|
జననం | ఆవుల మంజులత |
వృత్తి | తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్‌ఛాన్సలర్ 1999లో తెలుగు అకాడమీకి డైరెక్టర్ |
ప్రసిద్ధి | తెలుగు అకాడమీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా, రీసెర్చ్ ఆఫీసర్ |
భార్య / భర్త | డి.ఎస్.రావు |
పిల్లలు | ఇద్దరు కుమారులు |
తండ్రి | ఆవుల సాంబశివరావు |
తల్లి | ఆవుల జయప్రదాదేవి |