చేకూరి రామారావు

తెలుగు రచయిత, భాషా శాస్త్రవేత్త

తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పిలువబడేవారు డాక్టర్‌ చేకూరి రామారావు (అక్టోబర్ 1, 1934 - జూలై 24, 2014). చేరాగా అందరికి సువరిచితులు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నోమ్ చోమ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యాడు.

చేకూరి రామారావు
చేకూరి రామారావు
జననంచేకూరి రామారావు
అక్టోబర్ 1, 1934
ఖమ్మం లోని మధిర తాలూకా ఇల్లెందులపాడు
మరణం2014 జూలై 24(2014-07-24) (వయసు 79) [1]
హైదరాబాద్ లోని హబ్సిగూడా
మరణ కారణంగుండెపోటు
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుచేరా
వృత్తిసాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకులు

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈయన 1934, అక్టోబరు 1న ఖమ్మం లోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించారు.

హెచ్ ఎస్ సి వరకు మచిలీపట్నంలో చదువుకున్నాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ (తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తూమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభధ్రులయ్యాడు. భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుంచి తెలుగు భాషా పరివర్తన సిద్ధాంతం ('ట్రాన్స్‌ఫర్మేషన్‌ థియరీ ఇన్‌ తెలుగు') అనే అంశంపై పిహెచ్‌డి పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రాధిపతిగా పనిచేస్తున్న కాలంలో చేరా దగ్గర డాక్టర్‌ ద్వానా శాస్త్రి శిక్షణపొందాడు.

తన నివాసంలో ధ్యానం చేస్తుండగా 24 జూలై, 2014 రాత్రి గుండెపోటు వచ్చి మృతిచెందారు.[1]

రచనా ప్రస్థానం

మార్చు

ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యాడు.

ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం సృష్టించారు- ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశ పెట్టారు. ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహూకరించింది.

కొన్ని తెలుగు రచనలు

మార్చు
  1. 1975 తెలుగు వాక్యం(వికీసోర్స్ లో)
  2. 1978 వచన పద్యం: లక్షణ చర్చ
  3. 1982 రెండు పదుల పైన
  4. 1982 తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు)
  5. 1991 చేరాతలు సాహిత్య విమర్శ - పరామర్శ
  6. 1994 చేరా పీఠికలు
  7. 1997 ముత్యాల సరాల ముచ్చట్లు
  8. 1998 ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం
  9. 2000 స్మృతికిణాంకం
  10. 2000 భాషానువర్తనం
  11. 2001 భాషాంతరంగం
  12. 2001 సాహిత్య వ్యాస రింఛోళి
  13. 2001 కవిత్వానుభవం
  14. 2002 వచన రచన తత్త్వాన్వేషణ
  15. 2002 సాహిత్య కిర్మీరం
  16. 2003 భాషా పరివేషం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 కపిలం రాంకుమార్ (2017-07-14). "చెరిగిపోని ' చేరా' తలెన్నో". వన్ ఇండియా. Retrieved 2021-02-26.