ఆశిష్ శర్మ (జననం 18 ఏప్రిల్ 1987) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో హమీర్‌పూర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2]

ఆశిష్ శర్మ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 - 22 మార్చి 2024
ముందు నరీందర్ ఠాకూర్
నియోజకవర్గం హమీర్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1987-04-18) 1987 ఏప్రిల్ 18 (వయసు 37)[1]
హమీర్‌పూర్, హిమాచల్ ప్రదేశ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హమీర్‌పూర్, హిమాచల్ ప్రదేశ్
పూర్వ విద్యార్థి జేపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

రాజకీయ జీవితం

మార్చు

ఆశిష్ శర్మ 2020లో రాజకీయాల్లోకి ప్రవేశించి 2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పుష్పిందర్ వర్మపై 12,899 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబీలోకి అడుగుపెట్టాడు.[3] ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా సుఖ్‌విందర్ సింగ్ సుఖు భాద్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికాడు.

2024లో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల అనంతరం ఆయన మార్చి 22న తన ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి[4], మార్చి 23న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Ashish Sharma". 2024. Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  2. Financial Express (9 December 2022). "Himachal Pradesh Election 2022 Winners list: Complete list of winners of BJP, Congress and Independent (Constituency-wise)" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
  3. The Times of India (8 December 2022). "Himachal assembly polls: Independent candidate Ashish Sharma wins from Hamirpur". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  4. Hindustan Times (22 March 2024). "Himachal: 3 Independent MLAs resign from assembly, to join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  5. Andhrajyothy (23 March 2024). "కాంగ్రెస్‌కు రెబల్స్ ఝలక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  6. The Hindu (23 March 2024). "In Himachal Pradesh, six former Congress MLAs, three Independents join BJP" (in Indian English). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.