సుఖ్విందర్ సింగ్ సుఖు

సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాదౌన్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, 2022 హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనను 2022 డిసెంబరు 10న ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎంపీగా చేసింది.[1][2]

సుఖ్విందర్ సింగ్ సుఖు
సుఖ్విందర్ సింగ్ సుఖు


Taking office
11 డిసెంబర్ 2022
గవర్నరు రాజేంద్ర అర్లేకర్
డిప్యూటీ ముఖేష్ అగ్నిహోత్రి
Succeeding జై రామ్ థాకూర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 డిసెంబర్ 2017
ముందు విజయ్ అగ్నిహోత్రి
పదవీ కాలం
2003 – 2012
ముందు బాబు రామ్ మండియాల్
తరువాత విజయ్ అగ్నిహోత్రి
నియోజకవర్గం నాదౌన్

వ్యక్తిగత వివరాలు

జననం 27 మార్చి 1964
నాదౌన్, హామిర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రసీల్ సింగ్, సంసార్ దేవి
జీవిత భాగస్వామి కమలేష్ ఠాకూర్
సంతానం 2
పూర్వ విద్యార్థి హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

సుఖ్విందర్​ సింగ్ సుఖు 1964 మార్చి 27న రసీల్ సింగ్, సంసార్ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

సుఖ్విందర్​ సింగ్ సుఖు 1980ల్లో ఎన్.ఎస్.యూ.ఐ ద్వారా విద్యార్థి రాజకీయాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చి  రెండుసార్లు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నియమితుడై, 2003లో హామిర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని నాదౌన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సుఖ్విందర్​ సింగ్ సుఖు 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుంచి 2019 వరకు హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌‌‌గా పనిచేశాడు. ఆయన అనంతరం 2022 ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌‌‌‌గా పనిచేస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాలుగోవసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా, కాంగ్రెస్ పార్టీ ఆయనను 2022 డిసెంబరు 10న ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించింది.[4] సుఖ్విందర్ సింగ్ సుఖు 2022 డిసెంబరు 11న సిమ్లాలోని చారిత్రక రిడ్జ్ గ్రౌండ్‌లో హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[5]

నిర్వహించిన పదవులు

మార్చు
 • 1988 - ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
 • 1995 - యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 • 1998 నుంచి 2008 వరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
 • 1992 నుంచి 2002 వరకు సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌
 • 2003 - నాదౌన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక
 • 2007 - నాదౌన్ నియోజకవర్గం నుండి 2వ సారి ఎమ్మెల్యే
 • 2019 జనవరి 10 నుండి 2019 జనవరి 10 వరకు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు
 • 2017 - నాదౌన్ నియోజకవర్గం నుండి 3వ సారి ఎమ్మెల్యే
 • హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌
 • 2022 - నాదౌన్ నియోజకవర్గం నుండి 4వ సారి ఎమ్మెల్యే
 • 2022 డిసెంబరు 11 నుండి ప్రస్తుతం - హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి[6]

మూలాలు

మార్చు
 1. Namasthe Telangana (10 December 2022). "సీఎంగా సుఖ్విందర్‌ సింగ్‌.. డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి." Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
 2. V6 Velugu (11 December 2022). "హిమాచల్ సీఎం సుఖ్విందర్". Retrieved 11 December 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
 3. BBC News తెలుగు (11 December 2022). "డ్రైవర్ కొడుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారంటే". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
 4. ETV Bharat News (11 December 2022). "పాల విక్రేత నుంచి సీఎం వరకు.. హిమాచల్ నూతన ముఖ్యమంత్రి విజయ ప్రస్థానం". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
 5. 10TV Telugu (11 December 2022). "హిమాచల్‌ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. Eenadu (11 December 2022). "హిమాచల్‌ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌ సింగ్‌..రేపే ప్రమాణస్వీకారం". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.