ఆసిఫ్‌నగర్ మండలం (హైదరాబాదు జిల్లా)
తెలంగాణ, హైదరాబాద్ జిల్లా లోని మండలం
ఆసిఫ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]
ఆసిఫ్‌నగర్ | |
---|---|
మండలం | |
Coordinates: 17°23′22″N 78°27′10″E / 17.3894°N 78.4527°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500028 |
Vehicle registration | టిఎస్ 11 |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
ఇది పాతబస్తీలో భాగం. ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3].ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, ఆసిఫ్‌నగర్ మండల విస్తీర్ణం 13.19 చ.కి.మీ., జనాభా 442229.
చరిత్ర
మార్చు1724లో మొఘలుల నుండి నిజాం గోల్కొండను స్వాధీనం చేసుకున్న తరువాత, నిజాం ఒక గ్రామంలోని కోట సమీపంలో నివసించాడు. తరువాత అది ఆసిఫ్‌నగర్ పేరుగా మార్చబడింది.
ప్రసిద్ధి
మార్చుఆసిఫ్నగర్ ఫర్నీచర్ శిల్పాలకు ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో తయారుచేసిన ఫర్నీచర్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతుంది.
రవాణా వ్యవస్థ
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫ్‌నగర్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో నాంపల్లి రైల్వే స్టేషను ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుపరిసరప్రాంతాలు
మార్చు- ఆఘాపురా
- బజార్ ఘాట్
- ధూల్‌పేట్
- గోషామహల్
- హుమయూన్ నగర్
- జియాగూడ
- కార్వాన్
- మంగళ్ హాట్
- మెహిదీపట్నం
- మాసాబ్ ట్యాంక్
- మురద్ నగర్
- నాంపల్లి
- సీతారాం బాగ్
- తాళ్ళగడ్డ
- విజయనగర్ కాలనీ[4]
- శాంతినగర్
మూలాలు
మార్చు- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
- ↑ "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.
- ↑ ఆంధ్రభూమి, హైదరాబాదు (28 August 2018). "సాయంత్రం 5గంటల వరకు 'కంటివెలుగు'". Archived from the original on 29 September 2018. Retrieved 29 September 2018.