గుడిమల్కాపూర్, హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రాంతం.

గుడిమల్కాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రాంతం. నగర పురాతన భాగాలలో ఇదీ ఒకటి. నగర శివారు ప్రాంతమైన మెహదీపట్నం నుండి 2 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ గుడిమల్కాపూర్ అనేది కూరగాయల (రైతు బజార్), పూల మార్కెట్‌కు పేరొందిన ప్రాంతం. మార్కెట్ పక్కన "జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం" అని పిలువబడే పురాతన పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.

గుడిమల్కాపూర్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 028
Vehicle registrationటిఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంనాంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

వాణిజ్య ప్రాంతం సవరించు

అన్ని బడ్జెట్లకు అనుకూలంగా ఉండే చాలా దుకాణాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ గుడిమల్కాపూర్ మార్కెట్ అని పిలువబడే పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది.[1] ఇందులో కూరగాయలు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. నగరంలోనే పేరొందిన మొజాంజాహి మార్కెట్[2] లోని పూల మార్కెటును 2009లో గుడిమల్కాపూర్ కు మార్చారు. ప్రతి ఉదయం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది.[3] ఈ ప్రాంతంలో అనేక ఫంక్షన్ హాళ్ళు వరుసగా ఉన్నాయి. వివాహాలు, వేడుకల సమయంలో రద్దీగా ఉంటాయి.

రవాణా సవరించు

గుడిమల్కాపూర్‌కు సమీపంలోని మెహదీపట్నంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో ఉంది. ఇక్కడి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు అనేక బస్సులు నడుస్తాయి. ఇక్కడికి సమీపంలోని నాంపల్లిలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

మతపరమైన ప్రదేశాలు సవరించు

త్రయంభకేశ్వర్ ఆలయం సవరించు

దీనిని సాయిబాబా దేవాలయం అని కూడా పిలుస్తారు. హైదరాబాదులోని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ శివలింగం, శ్రీ దుర్గా దేవి, షిర్డీ సాయిబాబా, నవగ్రహాల దేవతలు ఉంటారు. శ్రీరామనవమి, మహాశివరాత్రి, ఉగాది, దసరా పండుగల సందర్భాల్లో ఇక్కడికి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు.

జాంసింగ్ వెంకటేశ్వర దేవాలయం సవరించు

నగరంలోని పురాతన దేవాలయాల్లో ఈ జాంసింగ్ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఒకటి. ఇది మార్కెట్ పక్కనే ఉంది. ఇక్కడ వేంకటేశ్వరుడు, పద్మావతి, అలమేలు మంగ, రాధాకృష్ణ మొదలైన దేవతామూర్తులు ఉన్నారు.

విద్యా సంస్థలు సవరించు

సమాజంలోని అన్ని ఆర్థిక తరగతులకు ఇక్కడ అనేక పాఠశాలలు ఉన్నాయి.

  1. లాల్ బహదూర్ కళాశాల
  2. ఎంఎన్ఆర్ పాఠశాల
  3. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల
  4. వివేకానంద ఉన్నత పాఠశాల
  5. డే కేర్ సెంటర్లు (పిల్లల కోసం)

మూలాలు సవరించు

  1. "15 Best Markets in Hyderabad for Shopping". Nerd's Travel. 2018-09-21. Retrieved 2021-01-11.
  2. "Your guide to street shopping in Hyderabad". Times of India Travel. Retrieved 2021-01-11.
  3. "Flower sales bloom on new market premises". The Hindu. 2009-10-31. ISSN 0971-751X. Retrieved 2021-01-11.