హైదరాబాదు జిల్లా
హైదరాబాదు జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఇది ఒకటి. ఇది రాష్ట్రంలోనే చిన్న జిల్లా.
?హైదరాబాదు జిల్లా తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 217 కి.మీ² (84 చ.మై) |
ముఖ్య పట్టణం | హైదరాబాదు |
ప్రాంతం | తెలంగాణ |
జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
40,10,238 (2011 నాటికి) • 18,480/కి.మీ² (47,863/చ.మై) • 4010238 • 2064359 • 1945879 • 79.04 (2001) • 84.11 • 73.67 |
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగర ప్రాంతం మొత్తం ఈ జిల్లాలో భాగమే. సమస్యల గురించి పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు జీ.హెచ్.ఎం.సీ. 040 - 2111 1111, 155304 నెంబర్లను కేటాయించింది.[1]
హైదరాబాదు (నగర) జిల్లా ప్రస్తుత స్థితిలో 1978 ఆగస్టులో ఏర్పడింది. పూర్వపు హైదరాబాదు జిల్లానుండి నగరం చుట్టూ వున్న గ్రామీణ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లా అనే పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పడటంతో ఇలా పరిణమించింది. అప్పటి హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ రంగారెడ్డి జిల్లాలో చేర్చారు. మొత్తం హైదరాబాదు మున్సిపాలిటీ ప్రాంతం (ఒక చిన్న భాగం మినహాయించి), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతం, లాలాగూడ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతాలను హైదరాబాదు జిల్లాలో చేర్చారు. అప్పుడు జిల్లాలో మొత్తం 66 గ్రామాలు నాలుగు తాలూకాలు (చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్) గా విభజించబడినవి. ఆ తరువాత పరిపాలనా సౌలభ్యం కొరకు స్థానిక పాలనను సంస్కరించి 1985 జూన్ 25న మండలాలను యేర్పాటు చేసినప్పుడు హైదరాబాదు జిల్లా నాలుగు మండలాలుగా విభజించారు. అవి చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్. 1996 డిసెంబరు 27న ఈ నాలుగు మండలాలనుండి మొత్తం 16 మండలాలు సృష్టించి పునర్వ్యవస్థీకరించారు.రాష్ట్ర రాజధాని జిల్లాలో ఉండటంతో జిల్లా అన్నివిధాల బాగా అభివృద్ధి చెందింది.
జిల్లా చరిత్ర
మార్చు1948లో జరిగిన పోలీస్‌చర్య వలన ఆట్రాఫ్-అ-బాల్దా, భగత్ జిల్లాలని ఏకీకృతం చేసి హైదరాబాదు జిల్లాను రూపుదిద్దారు. 1978లో ఈ జిల్లాను హైదరాబాదు గ్రామీణ, హైదరాబాదు పట్టణ జిల్లాలగా విభజించారు. గ్రామీణ హైదరాబాదు జిల్లాకు తరువాత రంగారెడ్డి జిల్లాగా పేరు మార్పిడి జరిగింది. హైదరాబాదు పట్టణ జిల్లా ప్రస్తుతం హైదరాబాదు జిల్లాగా పిలువబడుతుంది.1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటింది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని, ఐతే హైదరాబాద్ నగరం దాటిన కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు. హైదరాబాద్ నగరం, కంటోన్మెంట్ (సికిందరాబాద్) ప్రాంతాల్లో సారవంతమైన కొన్ని భూములు ఉండి పండ్లు పండే తోటలు వేయదగ్గ పరిస్థితులు ఉన్నా పంటపండేనాటికి బలవంతులు, అధికారం చేతిలో ఉన్నవారు వాటిని దౌర్జన్యంగా తీసుకుపోయే వాడుతుండడంతో సామాన్యులు తోటలు వేసుకోవడం కూడా లేదని అతను వ్రాశారు.[2]
భౌగోళిక స్వరూపం
మార్చుహైదరాబాదు జిల్లా 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
జిల్లాలోని మండలాలు
మార్చుమండలాలు, గ్రామాలు
మార్చుఅధికార పరిధి
మార్చుజిల్లా పాలన రాష్ట్ర ప్రభుత్వ అధికారులచేత పాలనా యంత్రాంగం పనిచేస్తుంది. పట్టణ జిల్లాకావున నగరపాలకసంస్థ స్థానిక పరిపాలన చేస్తుంది. ఈ జిల్లాకు రాష్ట్రీయంగా ఎమ్ ఎల్ ఎ, కేంద్రీయంగా ఎమ్ పి ప్రతినిధులు పాలనాబాధ్యతలలో పాలు పంచుకుంటారు. జిల్లా మొత్తం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జి.హెచ్.ఎమ్.సి.) అధికార పరిధిలోనే ఉంటుంది. పాలనా ప్రతినిధులను జి హెచ్ ఎమ్ సి ఆధ్వర్యంలో అన్ని వార్డుల నుండి ఎన్నిక చేయబడతారు.జిల్లా పాలనలో భాగంగా ఈ-సేవ కేంద్రాల ద్వారా వివిధ ధ్రువపత్రాలు (కులం, నివాసం, ఆదాయం...) జారీచేయబడుతున్నాయి. ఆలాగే ఆసుపత్రి నమోదు, పాఠశాల తాత్కాలిక నమోదు, వడ్డీ వ్యాపారం అనుమతి, వృద్ధాప్య, వికలాంగ, విధవ పింఛన్లు మంజూరు చేయబడుతున్నాయి.
నియోజకవర్గాలు
మార్చుహైదరాబాదు జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం 15 శాసనసభ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అంతకు క్రితం ఈ సంఖ్య 13 మాత్రమే. ఈ 15 నియోజకవర్గాలు హైదరాబాదు లోక్‌సభ, సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గాలలో ఏడేసి చొప్పున, మిగిలిన ఒక నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
రవాణా వ్వవస్థ
మార్చుహైదరాబాదు రాష్ట్ర రాజధాని కావడంతో వాయు, రైలు, రహదారి సౌకర్యాలు అభివృద్ధి చెందాయి.
2017లో ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా మెట్రో రైలు ప్రారంభమైంది.
గణాంక వివరాలు
మార్చు2011 లెక్కల ప్రకారం హైదరాబాదు జిల్లా జనాభా 40,10,238. 2001లో 38,29,753 ఉన్న జిల్లా జనాభా దశాబ్దం కాలంలో 4.71% వృద్ధి చెందింది. 1901లో కేవలం 4.99 లక్షలు ఉన్న జనాభా 1911 నాటికి 6.27 లక్షలకు పెరిగి 1921లో 5.56 లక్షలకు తగ్గింది.[3] ఆ తర్వాత క్రమక్రమంగా వృద్ధిచెందుతూ 2011 నాటికి 40.1 లక్షలకు చేరింది. గ్రేటర్ హైదరాబాదు మొత్తాన్ని పరిగనలోకి తీసుకుంటే జనాభా 2011 నాటికి 68.09 లక్షలకు చేరింది.
సంస్కృతి
మార్చుహిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి.ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.
పశుపక్ష్యాదులు
మార్చు1830లో హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రచరిత్రలో నగరాన్ని గురించి చాలా విశేషాలు నమోదుచేశారు. అందులో భాగంగా 1830ల్లో నగరంలోని పక్షిజాతుల గురించి వ్రాస్తూ హైదరాబాద్ రాజ్యంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాకులు దాదాపుగా లేవని వ్రాశారు. హైదరాబాద్ నగరంలో డేగల్ని పెంచుకునేవారు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. మీదుమిక్కిలి సంఖ్యలో ఉన్న పెంపుడు డేగలే నగరంలో కాకులు బతకనియ్యని స్థితి తీసుకువచ్చివుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.[2]
విద్యాసంస్థలు
మార్చుహైదరాబాదులో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి.
ఆకర్షణలు
మార్చు*టాంక్ బండ్ హైదరాబాద్ - సికిందరాబాద్ జంటనగరాలను కలుపుతున్న మార్గము
- లుంబిని పార్కు
హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
- పబ్లిక్ గార్డెన్స్ - శాసనసభ, జూబిలీ హాలు వంటీ కట్టడాలతో కూడిన చక్కటి వనం.
- లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్ - ఈ యస్ ఐ వద్ద లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు హైదరాబాదు లోని ప్రముఖ పార్కుల్లో ఒకటి. ఇది ఇ.యస్.ఐ. బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది.
- చార్మినారు - ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదు చిహ్నం.
- లాడ్ బజార్ - చార్మినారుకు పశ్చిమాన ఉంది. గాజులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది.
- మక్కా మసీదు - చార్మినారుకు నైరుతిలో ఉన్న రాతి కట్టడం.
- గోల్కొండ కోట - భారత్‌లో ప్రసిద్ధి చెందిన కోటల్లో ఇది ఒకటి.
- హుస్సేన్ సాగర్ - హైదరాబాదు, సికిందరాబాదులను వేరుచేస్తున్న మానవనిర్మిత కాసారం.
- సాలార్‌జంగ్ మ్యూజియం - పురాతన వస్తువులతో కూడిన పెద్ద సంగ్రహాలయమిది.
- బిర్లా ప్లానిటేరియం - నగర మద్యంలో నౌబత్ పహాడ్ గుట్టపై ఉంది.
- రామోజీ ఫిల్మ్ సిటీ
- ఇస్కాన్ దేవాలయం, అబిడ్స్ : ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది.[4]
- శిల్పారామం
క్రీడలు
మార్చుహైదరాబాదులో చాలా క్రీడాప్రదేశాలు ఉన్నాయి. లాల్ బహదూర్ స్టేడియం క్రీడాపోటీలకు ప్రముఖ వేదిక.
ఇవికూడా చూడండి
మార్చు- హైదరాబాదు నగరం
మూలాలు
మార్చు- ↑ eenadu.net
- ↑ 2.0 2.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
- ↑ Hand Book of Statistics, Hyderabad Dist, 2009, Published by Chief Planning Office
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-11-20. Retrieved 2012-06-28.