ఆస్కార్ ఫెర్నాండేజ్

ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా పని చేశాడు.

ఆస్కార్ ఫెర్నాండేజ్
ఆస్కార్ ఫెర్నాండేజ్


ది యంగ్ ఇండియన్ డైరెక్టర్
పదవీ కాలం
22 జనవరి 2011 – 13 సెప్టెంబర్ 2021

ది అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్ - డైరెక్టర్
పదవీ కాలం
17 జూన్ 2010 – 13 సెప్టెంబర్ 2021

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1 జులై 1998 – 13 సెప్టెంబర్ 2021
నియోజకవర్గం కర్ణాటక

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
17 జూన్ 2013 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సిపి జోషి
తరువాత నితిన్ గడ్కరి

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
18 జనవరి 1980 – 10 మే 1996
ముందు టి. ఎ. పాయ్
తరువాత ఐ. ఎం. జయరామ శెట్టి
నియోజకవర్గం ఉడిపి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1941-03-27)1941 మార్చి 27
ఉడిపి, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ఇప్పుడు కర్ణాటక, భారతదేశం)
మరణం 2021 సెప్టెంబరు 13(2021-09-13) (వయసు 80)[1]
మంగళూరు, కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి బ్లోసమ్ ఫెర్నాండెస్
సంతానం 2
నివాసం డోరిస్ రెస్ట్ హవెన్, అంబాల్పడి, ఉడిపి.

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కర్ణాటక రాష్ట్రం, ఉడుపిలో 1947 మార్చి 27న జన్మించాడు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ఉపాధ్యాయుడు, తల్లి లియోనిస్సా ఫెర్నాండెజ్ భారతదేశంలో మొదటి మహిళా మేజిస్ట్రేట్. ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ ఎంజీఎం కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన మొదట ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేసి ఆ తర్వాత మణిపాల్‌లో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆయన అదే సమయంలో వ్యవసాయం చేసి అత్యుత్తమ రైతుగా అవార్డును అందుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ 1975-76లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఉడిపి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1980 లో కర్ణాటకలోని ఉడిపి నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఫెర్నాండేజ్‌ ఉడిపి నియోజకవర్గం నుండి వరుసగా 1984, 1989, 1991, 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన 1984-85లో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశాడు. ఫెర్నాండేజ్‌ 1998లో, 2004 లో ఫెర్నాండెజ్ రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో 2004 నుంచి 2009 వరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు.

ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ 13 సెప్టెంబర్ 2021న అనారోగ్యంతో బాధపడుతూ మంగళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. "Congress veteran and former Union minister Oscar Fernandes passes away". Vinobha K T. The Times of India. 13 September 2021. Retrieved 13 September 2021.
  2. Namasthe Telangana (13 September 2021). "కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  3. Sakshi (13 September 2021). "Oscar Fernandes: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మృతి". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.
  4. The Hindu (13 September 2021). "Former Union minister Oscar Fernandes passes away" (in Indian English). Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.