ఆస్కార్ వైల్డ్ (అక్టోబర్ 16, 1854నవంబర్ 30, 1900) ఐర్లండుకు చెందిన నాటక రచయిత, నవలా రచయిత, కవి, కథా రచయిత. ఆయన రచనల్లోని చతురత పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. లండన్ను విక్టోరియా రాణి పరిపాలించే కాలంలో ఆయన ప్రముఖ రచయితల్లో ఒకడిగానే కాక ఆయన సమకాలికుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఆస్కార్ వైల్డ్
నెపోలియన్ సరోనీ చే 1882 లో తీయబడిన చిత్రం.
నెపోలియన్ సరోనీ చే 1882 లో తీయబడిన చిత్రం.
జననంOscar Fingal O'Flahertie Wills Wilde
(1854-10-16)1854 అక్టోబరు 16
డర్బిన్ , ఐర్లాండ్
మరణం1900 నవంబరు 30(1900-11-30) (వయసు: 46)
పారిస్, ఫ్రాన్స్
వృత్తిరచయిత, కవి, నాటక రచయిత
భాషఇంగ్లీషు, ఫ్రెంచ్
జాతీయతఐరిష్
పూర్వ విద్యార్థిట్రినిటీ కాలేజి, డర్బిన్
మాగ్డలిన్ కాలేజీ, ఆక్స్‌ఫర్డు
కాల వ్యవధిVictorian era
సాహిత్య ప్రక్రియడ్రామా, చిన్న కథలు, డైలాగులు, జర్నలిజం.
సాహిత్య ఉద్యమంAestheticism
ప్రసిద్ధ రచనలుsThe Importance of Being Earnest, The Picture of Dorian Gray
దాంపత్యభాగస్వామికాన్‌స్టన్స్ లాయిడ్ (1884–1898)
పిల్లలుసిరిల్ హాలండ్, వైవయాన్ హాలండ్
బంధువులుSir విల్లియం వైల్డ్, జానే, Lady లేడీ వైల్డ్
సంతకం

బాల్యం

మార్చు

ఆస్కార్ వైల్డ్ డబ్లిన్ లోని 21, వెస్ట్‌లాండ్ రో అనే ప్రదేశంలో జన్మించాడు. ఒక ఆంగ్లో-ఐరిష్ కుటుంబంలో ఆయన రెండో సంతానంగా జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సర్ విలియం వైల్డ్, జేన్ ఫ్రాంకెస్కా వైల్డ్. జేన ఒక మంచి రచయిత్రి మాత్రమే కాకుండా యంగ్ ఐర్లాండర్స్ అనే ఒక విప్లవ సంస్థకు కవయిత్రిగా కూడా పనిచేసేది. జీవితాంతం ఐరిష్ జాతీయురాలుగానే గడిపింది.[1]

సర్ విలియం ఐర్లాండ్ లోనే పేరొందిన కన్ను, చెవి వ్యాధుల స్పెషలిస్టు. 1864 లో వైద్య రంగానికి ఆయన చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదునిచ్చి సత్కరించింది.[1] ఆయన పురావస్తు శాస్త్రం మీద, జానపదుల మీద కూడా కొన్ని పుస్తకాలు రాశాడు. పేరొందిన వితరణశీలి. ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ కు వెనుక ఉన్న లింకన్ ప్లేస్ అనే ప్రదేశంలో ఉన్న డిస్పెన్సరీలో ఆయన నగరంలోని పేదప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Literary Encyclopedia - Oscar Wilde". Litencyc.com. 2001-01-25. Retrieved 2009-04-03.