ఆస్తిమూరెడు ఆశబారెడు

డబ్బు సంపాదన కోసం నీతి నిజాయితీలను వదిలేసి చట్టబద్దంకాని పనులు కూడా చేయడానికి వెనుకాడని మధ్యతరగతి జీవుల నేపథ్యం ఈ కథ. సామాన్యజీతంతో ఇల్లు నడుపుతూ నిజాయితీగా చిన్న ఉద్యోగం చేసుకొనే మధ్యతరగతి వ్యక్తిగా సోభన్బాబు నటించాడు. ఆశలెక్కువగా లేకున్నా ప్రక్కవారితో పోల్చుకొని భర్తను వేదించే పాత్రలో జయసుధ నటించింది. వీళ్ళిద్దరనూ తనకనుకూలంగా మార్చుకొని ఆశపెట్టి సొభన్బాబును తనుచేసే అక్రమ వ్యాపారంలో భాగస్వామిగా మారుస్తాడు కార్ట్యూమ్ కృష్ణ. చిత్రాంతములో పోలీసులకు పట్టుబడినప్పుడు తనుతప్పుకొని సోభ్న్బాబును నేరంలో ఇరికించే ప్రయత్నంచేస్తాడు. పొరుగువాడైన కోడిరామకృష్ణ సహాయంతో బయటకొచ్చి కార్ట్యూమ్ కృష్ణ భరతంపట్టటంతో కథ సుఖాంతమవుతుంది.

ఆస్తిమూరెడు ఆశబారెడు
(1995 తెలుగు సినిమా)
Asti Mooredu Asa Baaredu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం శోభన్ బాబు,
జయసుధ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ మాధవి కృష్ణ మూవీస్
భాష తెలుగు