ఆహుతి (1987 సినిమా)
'ఆహుతి' తెలుగు చలన చిత్రం 1987, డిసెంబర్ 3 న విడుదల.ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్ పతాకంపై మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రాజశేఖర్, జీవిత జంటగా నటించారు.కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
ఆహుతి (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | రాజశేఖర్, జీవిత, బాబూ మోహన్ |
సంగీతం | సత్యం |
గీతరచన | మల్లెమాల |
నిర్మాణ సంస్థ | యం.యస్.ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుతెరవెనుక
మార్చు- నిర్మాత: ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి
- దర్శకుడు: కోడి రామకృష్ణ
- సంభాషణలు: గణేశ్ పాత్రో
- పాటలు: మల్లెమాల
- నేపథ్య గాయకులు : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, ఎస్.జానకి
- సంగీత దర్శకత్వం : సత్యం
సంక్షిప్త చిత్రకథ
మార్చుశంభు ప్రసాద్ (గోపి) ఒక రాజకీయనాయకుడు. తనకు సహాయం చేస్తానని వచ్చిన అశోక్ (రాజశేఖర్) అనే సారావ్యాపారి అవినీతిని ఎండగట్టి అతని దొంగవ్యాపారాన్ని బట్టబయలు చేసి ప్రజలలో పలుకుబడిని పెంచుకుని, ఎన్నికలలో గెలుస్తాడు. హోం మంత్రి అవుతాడు. శంభుప్రసాద్ శాంతి (జీవిత)ని గర్భవతిని చేసి ఆమె అసహాయతను తన రాజకీయ ఎత్తుగడలకు వాడుకోవాలని చూస్తాడు. శాంతి అతనిని లెక్కచేయకుండా స్వతంత్రంగా జీవిస్తుంటుంది. శంభుప్రసాద్ అశోక్‌ని ఒక దొంగరవాణా కేసులో ముద్దాయిని చేస్తాడు. కేసు నుండి బయట పడాలని అశోక్ చూస్తూవుంటే అతడిని ఇబ్బందులపాలు చేయడానికి శంభుప్రసాద్ పై ఎత్తులు వేస్తుంటాడు. శంభుప్రసాద్ దగ్గర న్యాయసలహాదారుగా పనిచేస్తున్న శాంతి చేతి నుండి కేసుకు సంబంధించిన ఫైలును అశోక్ మనుషులు దొంగిలిస్తారు. శాంతి జైలు పాలవుతుంది. అశోక్ ఆమెకు జామీను ఇచ్చి తాను చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా ఆమెకు సహాయపడదామనుకుంటాడు. కాని శాంతి దానికి నిరాకరిస్తుంది. కిడ్నాప్ చేయబడిన తన కొడుకును కాపాడిన తర్వాత అశోక్ మీద శాంతికి నమ్మకం కలుగుతుంది. వారి మధ్య స్నేహం పెరుగుతుంది. ఇది ఓర్వలేని శంభుప్రసాద్ అశోక్ సారాదుకాణాలను ధ్వంసం చేస్తాడు. ప్రతిఫలంగా అశోక్ మనుషులు శంభుప్రసాద్‌ని హత్యచేయడానికి ప్రయత్నించి కాల్పులలో మరణిస్తారు. రెచ్చిపోయిన అశోక్ శంభుప్రసాద్‌ని కాల్చి చంపబోతుండగా వెనుక నుండి తుపాకి కాల్పులకు గురై కుప్పకూలిపోతాడు. శాంతి కొడుకు అందించిన తుపాకితో శంభుప్రసాద్‌ను కాల్చి ఇద్దరూ చనిపోవడంతో కథ ముగుస్తుంది.[1]
పాటలు
మార్చు- అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చెబుతా నీకో వింత కథ ఎపుడు ఎవరు వినని కథ - ఎస్.పి. బాలు
- బుద్ధుడు పుట్టిన పుణ్య భూమిలో గాంధి మహాత్ముని జన్మభూమిలో - రామకృష్ణ
- సూరీడు తూరుపున దీపమై వెలుగు ఆ వెలుగు లోకానికంతటికి - ఎస్.జానకి
- పడగలెత్తిన దురాగతానికి పచ్చని బతుకులు ఆహుతి