శ్యామ్ ప్రసాద్ రెడ్డి

సినీ నిర్మాత

మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చిత్ర నిర్మాత.[1] అతను 1987లో తన మొదటి చిత్రం తలంబ్రాలు నిర్మించాడు. ఇతను చిత్ర రచయిత, చలనచిత్ర నిర్మాత ఎం.ఎస్.రెడ్డి కుమారుడు. శ్యాం ప్రసాద్ రెడ్డి యొక్క చిత్రాలు సాంకేతిక నైపుణ్యం, విజువల్ ఎఫెక్ట్ కలిగి యుంటాయి.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి

వృత్తి

మార్చు

శ్యాం ప్రసాద్ రెడ్డి అమెరికాలో చదువు పూర్తి చేసుకుని మాతృదేశానికి వచ్చి ఏదైనా చాలెంజింగ్ వృత్తిని స్వీకరిద్దామని అనుకున్నాడు. తండ్రి మల్లెమాల సుందరరామిరెడ్డి వారసత్వం ఉన్నా ఫిల్ం మేకింగ్ లో శిక్షణ పొందాడు. తండ్రికి సన్నిహితుడైన రామోజీ రావుతో కలిసి చిత్ర నిర్మాణంలో మెలకువలు నేర్చుకున్నాడు. కోదండరామిరెడ్డి, పి. ఎన్. రామచంద్రరావు వంటి వారి దగ్గర దర్శకత్వం గురించి తెలుసుకున్నాడు. తన మీద తనకు నమ్మకం కలిగాక తలంబ్రాలు అనే సినిమా రూపొందించాడు.

టర్మినేటర్ 2 చిత్రాన్ని చూసిన శ్యాం ప్రసాద్ రెడ్డికి అందులో ఉన్న గ్రాఫిక్స్ ని చూసి మన పురాణాలు, సంస్కృతికి కూడా ఇలా గ్రాఫిక్స్ మేళవించి సినిమాలు తీస్తే బాగుంటుందనిపించింది. అలా పుట్టుకొచ్చిందే అమ్మోరు చిత్రం. ఆయన నిర్మించిన అంజి చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ కి గాను జాతీయ పురస్కారం కూడా దక్కింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

శ్యాం ప్రసాద్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమార్తె వరలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇరువురు కుమార్తెలు. ఈమె ఆగస్టు 7, 2024 న అనారోగ్యంతో మరణించింది.[2]

చలన చిత్రాల పట్టిక

మార్చు

టెలివిజన్ ప్రదర్శనలు

మార్చు
  • ఢీ "నృత్య ప్రదర్శన on ఈటీవీ (పూర్తయింది)"
  • జీన్స్, అదుర్స్, వీర ప్రదర్శనలు on ఈటీవీ (పూర్తయింది)
  • క్యాష్, స్టార్ మహిళ, జబర్దస్త్ (ప్రస్తుత ప్రదర్శనలు).

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "T-Town moves into 3D space". Times of India. 12 December 2010. Retrieved 21 December 2010.
  2. "Shyam Prasad Reddy: నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఇంట విషాదం.. సినీ ప్రముఖుల సంతాపం". EENADU. Retrieved 2024-08-08.

బయటి లింకులు

మార్చు