ప్రధాన మెనూను తెరువు

IBM గా సంక్షిప్తపరిచిన ఇంటర్నేషల్ బిజినెస్ మిషిన్స్ కార్పొరేషన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్‌లో ఉన్న అర్మోంక్‌ను ప్రధాన కార్యాలయంగా చేసుకొని పనిచేస్తుంది, ఇది ఒక బహుళజాతి కంప్యూటర్ టెక్నాలజీ మరియు IT కన్సల్టింగ్ సంస్థ. 19వ శతాబ్దం నుంచి సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కొనసాగుతున్న అతికొద్ది కంపెనీల్లో ఇది కూడా ఒకటి. కంప్యూటర్ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లను IBM తయారు చేసి, విక్రయిస్తుంది, ఇది సాఫ్ట్‌వేర్ రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది, కంప్యూటర్ కేంద్ర భాగాల నుంచి నానోటెక్నాలజీ వరకు మౌలిక సేవలు, ఆతిథ్య సేవలు, సలహాదారు సేవలు అందజేస్తుంది.[2] అధికార కార్పొరేట్ వర్ణాన్ని చూసి దీనికి "బిగ్ బ్లూ" అనే మారుపేరు కూడా వాడుకలో ఉంది.

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్
రకంపబ్లిక్ కంపెనీ
స్థాపితంEndicott, New York, U.S. (1896, incorporated 1911)
వ్యవస్థాపకు(లు)హెర్మన్ హొలిరెత్
ప్రధానకార్యాలయంఆర్మాంక్, న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
కీలక వ్యక్తులుSamuel J. Palmisano (Chairman, President and CEO)
Mark Loughridge (SVP and CFO)
Dan Fortin (President – Canada)
David Anderson (Junior Vice President, IBM Global Business Services)
Nick Donofrio (Executive Vice President – Innovation & Technology)
Mike Rhodin (President IOT Northeast Europe)
Dominique Cerutti (President IOT Southwest Europe)[1]
పరిశ్రమComputer hardware
Computer software
Consultant
IT service management
ఉత్పత్తులుSee products listing
ఆదాయం US$103.63 billion (2008)
నిర్వహణ రాబడి $15.938 billion (2008)
మొత్తం ఆదాయము $12.334 billion (2008)
ఆస్తులుDecrease $109.524 billion (2008)
మొత్తం ఈక్విటీDecrease $13.446 billion (2008)
ఉద్యోగులు398,455 (2009)
అనుబంధ సంస్థలుADSTAR
FileNet
ILOG
Informix
Iris Associates
Lotus Software
Rational Software
Sequent Computer Systems
Telelogic
Tivoli Software
వెబ్‌సైటుIBM.com
అర్మోంక్‌లోని ఐబిఎం యొక్క సురక్షిత ప్రధాన కార్యాలయాల సముదాయ ప్రవేశద్వారం

ప్రపంచంలో అతిపెద్ద కంప్యూటర్ కంపెనీగా మరియు సిస్టమ్స్ ఇంటెగ్రేటర్‌గా IBM బాగా సుపరిచితమైంది.[3] సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 388,000 మంది ఉద్యోగులు ఉన్నారు, IBM ప్రపంచంలో అతిపెద్ద మరియు అత్యంత లాభదాయక సమాచార సాంకేతిక పరిజ్ఞాన కంపెనీ. IBM వద్ద ఉన్నన్ని మేధోసంపత్తి హక్కులు U.S.కు చెందిన మరే ఇతర సాంకేతిక కంపెనీ కలిగిలేదు మరియు దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.[4] కంపెనీ 170కిపైగా దేశాల్లో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సలహాదారులు మరియు విక్రయ నిపుణులను కలిగివుంది.[5] IBM ఉద్యోగులు ఐదు నోబెల్ బహుమతులు, నాలుగు టర్నింగ్ అవార్డులు, తొమ్మిది నేషనల్ మెడల్స్ ఆఫ్ టెక్నాలజీ మరియు ఐదు నేషనల్ మెడల్స్ ఆఫ్ సైన్స్‌లను పొందారు.[6] చిప్ తయారీదారుగా, ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 సెమీకండక్టర్ విక్రయ దిగ్గజాల జాబితాలో గత కొన్నేళ్లుగా IBM కూడా ఉంది.

చరిత్రసవరించు

IBMగా రూపాంతరం చెందిన టాబులేటింగ్ మిషిన్ కంపెనీ[7]ని హెర్మన్ హోలెరిత్ 1896లో న్యూయార్క్‌లోని బ్రూమ్ కౌంటీలో స్థాపించారు (ఎండికాట్, న్యూయార్క్ లేదా బింగ్‌హామ్టన్, న్యూయార్క్), ఇక్కడ ఇప్పటికీ కంపెనీ పరిమిత కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇది జూన్ 16, 1911న కంప్యూటింగ్ టాబులేటింగ్ రికార్డింగ్ కార్పొరేషన్‌గా సంస్థీకరించబడింది మరియు 1916లో జార్జ్ వింథ్రోప్ ఫెయిర్‌చైల్డ్‌చే కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదయింది. 1917లో మొదట CTR యొక్క కెనడా విభాగానికి, తరువాత దీని దక్షిణ అమెరికా అనుబంధ సంస్థకు ఇంటర్నేషనల్ బిజినెస్ మిషిన్స్‌గా పేరుపెట్టారు, 1924లో థామస్ జె.వాట్సన్ నియంత్రణాధికారాలు చేపట్టిన తరువాత కంపెనీ మొత్తానికి ఈ పేరును వర్తింపజేశారు. 2018న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ రెడ్ హ్యాట్ ని 34 వందల కోట్ల డాలర్లకి సముపార్జన చేసుకుండి.[8][9][10]

కొన్ని ప్రస్తుత ప్రాజెక్టులుసవరించు

డెవలపర్ వర్క్స్సవరించు

developerWorks అనేది సాఫ్ట్‌వేర్ డెవెలపర్‌లకు మరియు IT నిపుణుల కోసం IBM నడుపుతున్న ఒక వెబ్‌సైట్. ఇది డెవెలపర్‌లు, సాంకేతిక నిపుణుల కోసం కొద్ది సంఖ్యలో ఎలా చేయాలో తెలిపే కథనాలు మరియు విశద బోధనలతోపాటు, సాఫ్ట్‌వేర్ దిగుమతులు మరియు సంకేత నమూనాలు, చర్చావేదికలు, పాడ్‌కాస్ట్‌లు, బ్లాగులు, వికీలు మరియు ఇతర వనరులను కలిగివుంటుంది. ఇందులో ఉండే విషయాలు, Java, Linux, SOA మరియు వెబ్ సేవలు, వెబ్ అభివృద్ధి, Ajax, PHP, మరియు XML వంటి పరిశ్రమ- ప్రామాణిక సాంకేతిక పరిజ్ఞానాల నుంచి IBM యొక్క ఉత్పత్తుల (WebSphere, Rational, Lotus, Tivoli మరియు DB2 వంటి) వరకు ఉంటాయి. 2007లో developerWorksను జోల్ట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రవేశపెట్టారు.[11] gladson baba

ఆల్ఫా వర్క్స్సవరించు

IBM అభివృద్ధి చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలకు alphaWorks అనేది ఆధారం. ఈ సాంకేతిక పరిజ్ఞానాలు ఏమిటంటే:

  • ఫ్లెక్సిబుల్ ఇంటర్నెట్ ఇవాల్యూషన్ రిపోర్ట్ ఆర్కిటెక్చర్ – ఇంటర్నెట్ సర్వేల యొక్క రూపకల్పన, ప్రదర్శన మరియు నివేదించడం కోసం అత్యంత అనుకూలమైన నిర్మాణం.
  • IBM హిస్టరీ ఫ్లో విజువలైజేషన్ అప్లికేషన్ – చైతన్యవంతమైన, పరిణమించుచున్న పత్రాలను మరియు బహుళ సహకార రచయితల సంకర్షణలను చూపించే ఒక సాధనం.
  • IBM Linux on POWER పెర్ఫామన్స్ సిమ్యులేటర్Linux on Power వినియోగదారులకు IBM యొక్క POWER ప్రాసెసర్‌లకు ఒక ప్రదర్శన నమూనాల సమితిని అందజేసే సాధనం.
  • డేటాబేస్ ఫైల్ ఆర్కైవ్ అండ్ రిస్టోరేషన్ మేనేజ్‌మెంట్ – డేటాబేస్‌లలో నిల్వచేసిన ఫైలు సిఫార్సులను ఉపయోగించి హార్డ్ డిస్క్ డ్రైవ్ ఫైళ్లను ఆర్కైవ్ చేయడానికి మరియు పునరుద్ధరణకు ఉపయోగించే అనువర్తనం.
  • పాలసీ మేనేజ్‌మెంట్ ఫర్ అటానమిక్ కంప్యూటింగ్ – IT మరియు వ్యాపార ప్రక్రియల యాంత్రికీకరణను సరళీకరించే ఒక విధాన ఆధారిత యంత్ర నిర్వహణా మౌలికసదుపాయం.
  • FairUCE – విషయ వడపోతకు బదులుగా పంపినవారి గుర్తింపును సరిచూసే ఒక స్పామ్ వడపోత సాధనం.
  • అన్‌స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ ఆర్కిటెక్చర్ (UIMA) SDKఅవ్యవస్థీకృత సమాచారంతో పనిచేసే అనువర్తనల అమలు, కూర్పు, వ్యవస్థాపనకు మద్దతు ఇచ్చే ఒక Java SDK.
  • యాక్సెసిబిలిటీ బ్రౌజర్దృష్టి లోపాలు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెబ్- బ్రౌజర్ ఉచిత సాఫ్ట్‌వేర్‌గా విడుదల కానుంది. "A-బ్రౌజర్"గా కూడా తెలిసిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మౌస్ అవసరం లేకుండా, మీటలు మరియు పూర్తిగా స్వర- నియంత్రణలు, మీటలు, ముందుగా నిర్వచించిన సత్వరమార్గ కీలపై ఆధారపడేలా చేయాలనే లక్ష్యంతో అభివృద్ధి చేశారు.

సెమీకండక్టర్ రూపకల్పన మరియు తయారీసవరించు

 
IBM యొక్క Nintendo Wii "బ్రాడ్‌వే" CPU

వాస్తవానికి కొత్త తరానికి చెందిన అన్ని కన్సోల్ గేమింగ్ సిస్టమ్‌లు IBM అభివృద్ధి చేసిన మైక్రోప్రాసెసర్‌లను ఉపయోగిస్తున్నాయి. 24 నెలలకన్నా తక్కువ సమయంలో రూపకల్పన, తయారీ కార్యక్రమాలు పూర్తిచేసి IBM విడుదల చేసిన PowerPC ట్రై-కోర్ ప్రాసెసర్‌ను Xbox 360 కలిగివుంది.[12] IBM, Toshiba, మరియు Sonyలు సంయుక్తంగా రూపకల్పన చేసిన సెల్ BE మైక్రోప్రాసెసర్‌ను Sony యొక్క ప్లేస్టేషన్ 3 కలిగివుంది. Wii అనే Nintendo యొక్క ఏడో తరం కన్సోల్ కూడా బ్రాడ్‌వే అనే పేరు గల IBM చిప్‌ను కలిగివుంటుంది. పాత Nintendo గేమ్‌క్యూబ్ కూడా IBM రూపొందించిన గెక్కో ప్రాసెసర్‌ను ఉపయోగించుకుంటుంది.

మే 2002లో, IBM మరియు Butterfly.net, Incలు ఆన్‌లైన్ వీడియో గేమ్ మార్కెట్ కోసం బటర్‌ప్లై గ్రిడ్ పేరుతో ఒక కమర్షియల్ గ్రిడ్‌ను ప్రకటించాయి.[13] మార్చి 2006లో, డిమాండ్ ఆధారిత విషయ నిర్వహణ మరియు బ్లేడ్ సర్వర్ కంప్యూటింగ్ రీసోర్స్‌లను అందజేసేందుకు Hoplon Infotainment, Online Game Services Incorporated (OGSI) మరియు RenderRocketలతో IBM వేర్వేరు ఒప్పందాలను ప్రకటించింది.[14]

ఓపెన్ క్లయింట్ ఆఫరింగ్సవరించు

ఓపెన్ క్లయింట్ ఆఫరింగ్ పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించనున్నట్లు IBM ప్రకటించింది, ఇది Linux, Microsoft యొక్క Windows, మరియు Apple యొక్క Mac OS Xలపై అమలు అవుతుంది. వ్యాపారాల కోసం ఉద్యోగులు Windows మరియు దాని ప్రత్యామ్నాయాలపై పనిచేసేందుకు ఒకే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే సౌలభ్యాన్ని తమ కొత్త ఉత్పత్తి అందజేస్తుందని కంపెనీ తెలిపింది. దీనర్థం ఏమిటంటే "ఓపెన్ క్లయింట్ ఆఫరింగ్" సాఫ్ట్‌వేర్ Windowsకు సంబంధించి Linux లేదా Apple నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది. Windowsకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి కార్యకలాపాల నిర్వహణ సాగడం లేదు కనుక, కార్యకలాపాల లైసెన్స్‌ల కోసం Microsoftకు కంపెనీలు అనవసరపు చెల్లింపులను నిరోధించవచ్చు. Microsoft యొక్క ఆఫీస్ డాక్యుమెంట్ ఫార్మాట్‌లకు ఒక ప్రత్యామ్నాయం ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ సాఫ్ట్‌వేర్, దీని అభివృద్ధి వెనుక IBM కృషి ఉంది. దీనిని అనేకరకాల కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు: వర్డ్ ప్రాసెసింగ్, ప్రజెంటేషన్‌లు, Lotus నోట్స్ సంయుక్త సహకారంతో తక్షణ సందేశ సేవలు, మరియు Internet Explorer పోటీదారు- Mozilla Firefox వెబ్ బ్రౌజర్‌తోపాటు బ్లాగ్ టూల్‌ల కోసం ఉపయోగించవచ్చు. తన యొక్క desktop PCలలో 5% ఓపెన్ క్లయింట్ సాఫ్ట్‌వేర్‌ను వ్యవస్థాపన చేయాలని IBM ప్రణాళికారచన చేసింది.

UC2: యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ అండ్ కొలాబరేషన్సవరించు

UC2 (యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ అండ్ కొలాబరేషన్ ) అనేది IBM మరియు Cisco Systems సంయుక్తంగా చేపట్టిన Eclipse మరియు OSGi ఆధారిత ప్రాజెక్టు. ఇది అసంఖ్యాక Eclipse అప్లికేషన్ డెవెలపర్‌లకు సులభ పని వాతావరణం కోసం ఒక ఏకీకృత వేదికను అందజేస్తుంది.

UC2 ఆధారిత సాఫ్ట్‌వేర్ ప్రధాన సంస్థలకు Lotusకు సంబంధించిన Sametime వంటి సులభంగా ఉపయోగించగలిగే కమ్యూనికేషన్ సొల్యూషన్‌లు అందిస్తుంది. భవిష్యత్‌లో Sametime వినియోగదారులు క్లిక్-టు-కాల్ మరియు వాయిస్ మెయిలింగ్ వంటి అదనపు సేవల లబ్దిని పొందుతారు.[15]

అంతర్గత కార్యక్రమాలుసవరించు

ఎక్స్‌ట్రీమ్ బ్లూ అనేది అధిక- విలువ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు అనుభవం ఉన్న IBM ఇంజనీర్లు, ప్రతిభావంతులైన పట్టభద్రులు మరియు బిజినెస్ మేనేజర్లతో కంపెనీ చేపట్టిన ఒక కార్యక్రమం. కొత్తగా ఉద్భవిస్తున్న వ్యాపార అవసరాలను విశ్లేషించేందుకు, వాటిని పరిష్కరించగల సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. అధిక విలువగల సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ ప్రాజెక్టులకు వేగంగా రూపకల్పన చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం.

మే 2007లో, శక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు IBM బిగ్ గ్రీన్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది, ఈ ప్రాజెక్టుకు తన వ్యాపారాల నుంచి ప్రతి ఏటా $1 బిలియన్ నిధులు మళ్లిస్తోంది.

పర్యావరణ చరిత్రసవరించు

పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో IBMకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సమగ్ర అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ వ్యవస్థ మద్దతుతో 1971లో కంపెనీ పర్యావరణ రక్షణ కోసం ఒక కార్పొరేట్ విధానాన్ని ఏర్పాటు చేసింది. IBM లెక్కల ప్రకారం, గత ఐదేళ్లలో కంపెనీ తాను ఉత్పత్తి చేసే ప్రమాదకర వ్యర్థాలను 44% మేర తగ్గించింది, 1987తో పోలిస్తే ఈ వ్యర్థాల ఉత్పత్తి 94.6% శాతం మేర తగ్గింది. IBM యొక్క మొత్తం ప్రమాదకర వ్యర్థాల లెక్కింపులో ఉత్పాదకేతర మరియు ఉత్పాదక కార్యకలాపాలు రెండూ ఉన్నాయి. వ్యర్థాలను పారవేసి, కొత్త రసాయన పదార్థాలను ఉపయోగించడానికి బదులుగా ఉత్పాదక కార్యకలాపాల నుంచి వచ్చే వ్యర్థాల్లోని రసాయనాలను నిర్గమన వ్యవస్థల ద్వారా సేకరించి వాటినే పునరుపయోగిస్తున్నారు. ఏళ్లు గడిచేకొద్ది, IBM నిర్గమన వ్యవస్థల ద్వారా పునరుపయోగ ప్రక్రియలను నిర్వహించడం దాదాపుగా నిలిపివేసింది, ఇప్పుడు వాటి స్థానంలో పర్యావరణానికి మరింత స్నేహపూరక పదార్థాలను ఉపయోగిస్తోంది. IBM పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే నమూనా పరిష్కారాన్ని కూడా ఏర్పాటు చేసింది, సిక్స్ సిగ్మా సిద్ధాంతాలు గ్రీన్ సిగ్మా, లియాన్‌ను ఉపయోగిస్తూ తన కర్బన వినియోగాన్ని తగ్గించింది[16]

"నిత్యప్రయాణికులకు మొదటి 20 ఉత్తమ ప్రదేశాల్లో" ఒకదానిగా IBM 2005లో అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA)చే గుర్తింపు పొందింది. ఫార్చూన్ 500 కంపెనీలను గుర్తించేందుకు ఈ అవార్డును ఉపయోగిస్తారు, ట్రాఫిక్, వాయుకాలుష్యాన్ని తగ్గిస్తూ ఉద్యోగులకు అత్యుత్తమ నిత్యప్రయాణిక ప్రయోజనాలను అందించే సంస్థలకు ఈ జాబితాలో చోటు కల్పిస్తారు.[17]

అయితే IBM జన్మస్థలం ఎండికాట్, దశాబ్దాలపాటు కాలుష్యంతో పీడించబడుతోంది. రెండు దశాబ్దాలుకుపైగా సర్క్యూట్ బోర్డ్ నిర్మాణ కార్యకాలాపాల్లో IBM ద్రవ శుద్ధి కారకాలను ఉపయోగిస్తోంది, ఆరుసార్లు ద్రవ శుద్ధి కారకాలు చిందడం మరియు కారిపోయిన దాఖలాలు నమోదయ్యాయి, 1979లో ఒక భూగర్భ ట్యాంకు నుంచి 4,100 గ్యాలన్ల ద్రవం కారిపోయింది. ఈ సంఘటనల కారణంగా పట్టణ మట్టి మరియు భూగర్భ జలాల్లో ఆందోళనకర కర్బన పదార్థాలు చేరాయి. ప్రమాదకర కర్బన పదార్థాల మూలకాలను ఎండికాట్ పట్టణ త్రాగునీటిలో గుర్తించారు. అయితే వీటి స్థాయి నియంత్రణ పరిధిలోనే ఉంది. 1980 నుంచి, IBM ట్రిక్లోరోఈథేన్, ఫ్రెయాన్, బెంజిన్ మరియు పర్‌క్లోరోఈథేన్ వంటి 78,000 గాలన్ల రసాయనాలను గాలిలోకి విడిచిపెట్టింది, పరిసర గ్రామాల్లో అనేక క్యాన్సర్ కేసులు నమోదవడానికి ఈ రసాయనాలే కారణమని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ విభాగం IBM ఎండికాట్‌ను ప్రధాన కాలుష్య కారకంగా గుర్తించింది, ఈ పరిస్థితికి స్థానిక డ్రై క్లీనర్ మరియు ఇతర కాలుష్యకారకాలు కూడా కారణం. కాలుష్యకారక స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఎండికాట్‌లో వాయు లేదా జల కాలుష్యం వాస్తవానికి ఏవైనా ఆరోగ్య సమస్యలకు కారణమైందో లేదో పరిశీలించలేదు. గ్రామాధికారుల సమాచారం ప్రకారం, ఇక్కడ నీరు త్రాగడానికి సురక్షితమైనదేనని పరీక్షలు చూపిస్తున్నాయి.[18]

సౌర శక్తిసవరించు

టోక్యో ఓక్లా పారిశ్రామిక ప్రాంతం కోగ్యో కో., లిమిటెడ్. (TOK) మరియు IBM సంయుక్తంగా కొత్త, తక్కువ-వ్యయ పద్ధతుల్లో CIGS (కాపర్- ఇండియమ్- గాలియం- సెలెనైడ్) సోలార్ సెల్ మాడ్యూల్‌లుగా పిలిచే రాబోయే తరం సౌర శక్తి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. CIGS వంటి థిన్ ఫిల్మ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సోలార్ సెల్‌లకు అవసరమయ్యే మొత్తం వ్యయాన్ని బాగా తగ్గించడంతోపాటు, వాటి వినియోగాన్ని వేగంగా స్వీకరించే వీలు ఏర్పడుతుంది.[19][20]

ఫొటోవోల్టియాక్ పరిశోధనకు సంబంధించి నాలుగు ప్రధాన విభాగాల్లో IBM అన్వేషణలు సాగిస్తోంది: చౌక మరియు మరింత సమర్థవంతమైన సిలికాన్ సోలార్ సెల్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం, థిన్ ఫిల్మ్ ఫొటోవోల్టియాక్ పరికరాలను సంవిధానపరిచే సేవలను, కాన్సట్రేటర్ ఫొటోవోల్టియాక్స్ మరియు సెమీకండక్టర్ క్వాంటమ్ డాట్‌లు మరియు నానోవైర్‌ల వంటి నానోనిర్మాణాలను ఆధారంగా చేసుకొని భవిష్యత్ తరానికి సంబంధించిన ఫొటోవోల్టియాక్ నిర్మాణాలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.[21]

గ్రీన్ సిగ్మాసవరించు

గ్రీన్ సిగ్మా అనేది ఒక సిక్స్ సిగ్మా క్రియాశీల నిర్వహణ వ్యవస్థ, డబ్లిన్‌లోని ఇన్నోవేషన్ సెంటర్‌లో ప్రస్తుతం దీనికి సంబంధించిన అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలను సాధిస్తూ, కార్బన్ వినియోగాన్ని నియంత్రించడం మరియు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.

గ్రీన్ సిగ్మా ఈ కింది మూలకాలపై దృష్టి కేంద్రీకరించింది:

  • కార్బన్
  • నీరు
  • వాతావరణ ఉద్గారాలు
  • ద్రవ వ్యర్థం
  • ఘన వ్యర్థం
  • భూగర్భ ఉద్గారాలు
  • నివేదించడం

ప్రస్తుతం కోర్ ప్రక్రియలు మరియు KPMGలను అనుకూల పరిచేందుకు క్లయింట్ బృందంతో కలిసి IBM గ్రీన్ సిగ్మాTM కన్సల్టెంట్‌లు పనిచేస్తున్నారు.

  • దశ I: ముఖ్య పనితీరు సూచీలను (KPIs) నిర్వచించడం
  • దశ II: కొలమానాన్ని స్థిరపరచడం
  • దశ III: కార్బన్ కన్సోల్‌ను నియోగించడం
  • దశ IV: ప్రక్రియలను అనుకూలపరచడం
  • దశ V: పనితీరు నియంత్రణ

కొత్త మార్పులను అభివృద్ధి చేయడం, వ్యాపారాలకు ఆర్థిక ప్రయోజనాలను సాధించడం, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంలో క్లయింట్‌లను భాగస్వాములను చేయడం IBM చేపట్టిన గ్రీన్ సిగ్మాTM యొక్క ప్రధాన ఉద్దేశం. [22]

కార్పొరేట్ సంస్కృతిసవరించు

 
1970వ దశకంలో బ్లూ హార్డ్‌వేర్‌తో IBM సిస్టమ్/3

బిగ్ బ్లూ అనేది IBM యొక్క మారుపేరు. ఈ మారు పేరు రావడాన్ని వివరించేందుకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఇందులో IBM కోసం ఆ సమయంలో పనిచేసిన ఉద్యోగుల ఆధారంగా తెరపైకి వచ్చిన ఒక సిద్ధాంతం ఏమిటంటే, IBM క్షేత్ర ప్రతినిధులు 1960వ దశకంలో ఈ పదాన్ని ఉపయోగించారు, 1960లో మరియు 1970వ దశకం ప్రారంభంలో IBM తయారుచేసిన కంప్యూటర్ కేంద్ర భాగాల రంగుకు సూచనగా ఈ పదం వాడుకలోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఒక విధేయుడైన IBM వినియోగదారు "ఆల్ బ్లూ" అనే పద వర్ణనను వాడినట్లు, వ్యాపార రచయితలు తరువాత ఈ పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు చెప్పబడుతోంది.[23][24] కంపెనీ యొక్క చిహ్నం ఆధారంగా బిగ్ బ్లూ అనే పదం వాడుకలోకి వచ్చినట్లు మరో సిద్ధాంతం చెబుతోంది. ఎక్కువ మంది IBM ఉద్యోగులు కేవలం తెల్ల చొక్కాలు మరియు నీలం సూట్‌లను ధరించాలనే పాత కంపెనీ వస్త్రధారణ నిబంధనకు సంబంధించి బిగ్ బ్లూ అనే పదం వాడుకలోకి వచ్చినట్లు మరో సిద్ధాంతం ప్రచారంలో ఉంది.[23][25] IBM కీబోర్డులు, టైప్‌రైటర్లు మరియు ఇతర ఉత్పాదక పరికరాలకు కూడా బిగ్ బ్లూ అంశాన్ని ముడిపెట్టారు, వాటి ఎంటర్ కీలు, కారేజ్ రిటర్న్‌లు ఇదే రంగులో ఉంటాయి.

విక్రయాలుసవరించు

విక్రయ- కేంద్ర లేదా విక్రయ- ఆధారిత వ్యాపార సంస్కృతికి మారుపేరుగా IBM తరచుగా అభివర్ణించబడుతోంది. సంప్రదాయబద్ధంగా, ఎక్కువమంది IBM నిర్వహణాధికారులు మరియు ప్రధాన నిర్వాహకులను వారి విక్రయ బలగం నుంచే ఎంపిక చేస్తుంటారు. ప్రస్తుత CEO, సామ్యూల్ జె. పాల్మిసానో, కంపెనీలో సేల్స్‌మాన్‌గా చేరారు, ప్రధాన కంపెనీల CEOలకు భిన్నంగా ఆయన నియామకం జరిగింది, ఎందుకంటే ఆయనకు MBA లేదా పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్హత లేదు. ముఖ్యమైన ఖాతాదారులకు విక్రయాలకు సంబంధించిన వివరణ ఇస్తున్న సమయంలో సేల్స్‌మెన్‌లకు మధ్యస్థాయి మరియు ఉన్నతస్థాయి యాజమాన్యం తరచుగా ప్రత్యక్ష మద్దతు ఇచ్చేందుకు రంగంలోకి దిగుతుంది.

యూనిఫాంసవరించు

దాదాపుగా 20వ శతాబ్దం మొత్తం IBM ఉద్యోగులకు ముదురు (లేదా బూడిద రంగు) సూట్, తెల్ల చొక్క మరియు "సిన్సియర్" టై[26] ధరించడం యూనిఫాంగా ఉంది. 1990ల్లో IBM యొక్క యాజమాన్య మార్పు సందర్భంగా, CEO లూయిస్ వి. గెస్ట్నెర్, జూనియర్. ఇతర పెద్ద సాంకేతిక రంగ కంపెనీల ఉద్యోగులకు సమానంగా ఈ నిబంధనలను సడలించడంతోపాటు, ఉద్యోగుల వస్త్రధారణ, ప్రవర్తనను సరళీకృతం చేశారు.

IBM కంపెనీ విలువలు మరియు "జామ్"సవరించు

2003లో, కంపెనీ విలువలను తిరిగి రాసేందుకు IBM ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తన యొక్క జామ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కంపెనీ కీలకమైన వ్యాపార అంశాలపై 50,000 మంది ఉద్యోగులతో 3 రోజులపాటు ఇంటర్నెట్ ఆధారిత ఆన్‌లైన్ చర్చలను నిర్వహించింది. థీమ్‌ల కోసం ఆన్‌లైన్ అభిప్రాయాలను సేకరించేందుకు ఈ చర్చలను ప్రత్యేకమైన పద విశ్లేషణ సాఫ్ట్‌వేర్ (eClassifier) విశ్లేషించింది. 2003 జామ్ ఫలితంగా, కంపెనీ విలువలు మూడు ఆధునిక వ్యాపారాలను ప్రతిబింబించేవిధంగా నవీకరించబడ్డాయి, వ్యాపారప్రదేశం మరియు ఉద్యోగుల అభిప్రాయాలు: "డెడికేషన్ టు ఎవ్విరి క్లయింట్స్ సక్సెస్", "ఇన్నోవేషన్ దట్ మాటర్స్ - ఫర్ అవర్ కంపెనీ అండ్ ఫర్ ది వరల్డ్", "ట్రస్ట్ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆల్ రిలేషన్‌షిప్స్".[27]

2004లో మరో జామ్ నిర్వహించారు, ఇందులో 52 వేల మంది ఉద్యోగులు 72 గంటలపాటు అత్యుత్తమ విషయాలను పంచుకున్నారు. ముందుగా గుర్తించిన విలువలను అమలు పరిచేందుకు ఆచరణీయ మార్గాలను కనుగొనడంపై ఈసారి వారు దృష్టిసారించారు. IBM ఉద్యోగులు విలువలకు మద్దతు ఇచ్చే కీలకమైన ఆలోచనలను ఎంపిక చేసేందుకు కొత్తగా పోస్ట్-జామ్ రేటింగ్స్ అనే కార్యక్రమం అభివృద్ధి చేయబడింది. 2005 వసంతకాలంలో పాల్మిశానో (వేతన పెంపు) అందజేస్తున్న సమయంలో ఈ జామ్‌ను కంపెనీ బోర్డు డైరెక్టర్లు ప్రస్తావించారు.[28]

IBM ఇన్నోవేషన్‌జామ్ 2008 పేరుతో మరో జామ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.[29] ఈ జామ్ అక్టోబరు 5న US EDT ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది, అక్టోబరు 8 వరకు 72 గంటలపాటు కొనసాగింది. ఇంతకుముందు జామ్‌లకు భిన్నంగా, ఇన్నోవేషన్ జామ్ 2008లో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది IBM ఖాతాదారులు, వ్యాపార భాగస్వాములు, విద్యావేత్తలతోపాటు, వేలాది మంది IBM ఉద్యోగులు పాల్గొన్నారు.

దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల పింఛనులను రక్షించేందుకు 2006లో మార్పులు ప్రవేశపెట్టినప్పటికీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లో జూలై 2009లో అనేక మంది ఉద్యోగులను ప్రభావితం చేసే పింఛను కోతలకు ఉపక్రమించి తన సొంత విలువలను IBM ఉల్లంఘించింది.

ఓపెన్ సోర్స్సవరించు

ఓపెన్ సోర్స్ కార్యక్రమానికి ప్రముఖ ప్రతిపాదకురాలిగా IBM వ్యవహరిస్తోంది, 1998 నుంచి Linuxకు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది.[30] IBM Linux టెక్నాలజీ సెంటర్ ద్వారా Linux ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు మరియు సేవలపై బిలియన్లకొద్ది డాలర్ల పెట్టుబడి పెట్టింది, ఈ కేంద్రంలో 300 మందికిపైగా Linux అంతర్భాగ డెవెలపర్‌లు పనిచేస్తున్నారు.[31] ప్లాట్‌ఫాం-ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ ప్రేమ్‌వర్క్ Eclipse (ఆ సమయంలో సుమారు US$40 మిలియన్ల విలువైన విరాళం),[32] మూడు-వాక్యాల ఇంటర్నేషనల్ కాంపోనెంట్స్ ఫర్ యూనికోడ్ (ICU) లైసెన్స్, మరియు Java-ఆధారిత రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (RDBMS) Apache Derby వంటి వివిధ ఓపెన్ సోర్స్ లైసెన్స్‌ల కింద IBM నియమావళిని కూడా విడుదల చేసింది. IBM ఓపెన్ సోర్స్‌లో జోక్యం చేసుకోవడం సమస్యలు కూడా తెచ్చిపెట్టింది, (SCO వర్సెస్ IBMను చూడండి).

కార్పొరేట్ వ్యవహారాలుసవరించు

నాజీ జర్మనీకి మద్దతుసవరించు

హోలోకాస్ట్ (నాజీ జర్మనీ నేతృత్వంలో సాగిన యూదుల సామూహిక హత్యలు) సందర్భంగా, IBM యొక్క న్యూయార్క్ ప్రధాన కార్యాలయాలు మరియు CEO థామస్ జె. వాట్సన్‌లు వారి విదేశీ అనుబంధ సంస్థల ద్వారా నాజీ జర్మనీ యంత్రాంగానికి సాయపడ్డారు, యూరోపియన్ యూదులను (ముఖ్యంగా కొత్తగా స్వాధీనపరుచుకున్న భూభాగంలో) గుర్తించేందుకు ఉపయోగపడే పంచ్ కార్డ్ యంత్రాలను హిట్లర్ నేతృత్వంలోని నాజీ జర్మనీ యంత్రాంగానికి IBM అందజేసింది. మానవులను గుర్తించే వ్యవస్థను అభివృద్ధి పరచడం అదే తొలిసారి.[33] నాజీల కిరాతకాలకు IBM న్యూయార్క్ విభాగం, దాని జెనీవా కార్యాలయం మరియు జర్మనీలోని డెహోమగ్‌లో ఉన్న దాని అనుబంధ సంస్థ ఏ విధంగా మద్దతు ఇచ్చాయో వివరించే IBM మరియు ప్రభుత్వ మెమోలు మరియు లేఖల నుంచి సేకరించిన విషయాలు ఎడ్విన్ బ్లాక్ రాసిన IBM అండ్ ది హోలోకాస్ట్ అనే పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. నాజీల చర్యలను మరింత సమర్థవంతం చేసేందుకు ఈ యంత్రాలు బాగా ఉపయోగపడ్డాయని ధృవీకరించే IBM యొక్క అంతర్గత నివేదికలను కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది. నాజీ నియంతృత్వంతో తనకు గల సంబంధాలపై క్షమాపణ చెప్పాలని యూదులు, రోమన్లు, హతశేషులు మరియు యుద్ధంలో పాల్గొన్న గ్రూపులు చేసిన డిమాండ్‌లను IBM తోసిపుచ్చింది. పుస్తకాలు లేదా లఘు చిత్రాల్లోని ఆధారాలు లేదా వాస్తవాలు లేదా తనపై వచ్చిన వివాదాస్పద ఆరోపణల్లో వేటితోనూ IBM ఎన్నడూ విభేదించలేదు, అయితే ఆ సమయానికి సంబంధించి తమ వద్ద వాస్తవ సమాచారం ఏదీ లేదని మాత్రం వెల్లడించింది మరియు దీనిపై జరిగిన పరిశోధనలను మరియు నిర్ధారణలను ప్రశ్నించింది.

మానవ వనరుల్లో వైవిధ్యంసవరించు

మానవ వనరుల్లో వైవిధ్యాన్ని మరియు సమాన అవకాశాలను ప్రోత్సహించేందుకు IBM చేపట్టిన చర్యల గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయానికి వెళ్లాలి, ఆ సమయంలో వికలాంగులైన వారిని కంపెనీ ఉద్యోగాల్లోకి తీసుకుంది. వర్కింగ్ మదర్ మేగజైన్ 2004నాటి జాబితాలో టాప్- 10లో చోటు దక్కించుకున్న ఒకేఒక్క సాంకేతిక రంగ కంపెనీ IBM, 2005లో మాత్రం రెండు కంపెనీలు టాప్- 10లో నిలిచాయి (రెండో కంపెనీ Hewlett-Packard).[34][35]

సెప్టెంబరు 21, 1953న, జాతి, మతం, మూలం లేదా లింగ తారతమ్యం లేకుండా అత్యత్తమ నైపుణ్యం ఉన్నవారిని తాము కోరుకుంటున్నామని IBM తనవద్ద పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ వివాదాస్పద లేఖను ఒకదానిని పంపింది, ఆ సమయంలో CEOగా థామస్ జె.వాట్సన్ వ్యవహరిస్తున్నారు. 1984లో, IBM లింగ ప్రాధాన్యతను చేర్చింది. తన పోటీదారులను వెనక్కునెట్టేందుకు నిపుణులైన ఉద్యోగులకు ఆశ్రయం ఇవ్వాలని, ఈ చర్య పోటీతత్వ వాతావరణంలో IBMకు ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.[36]

కంపెనీ సంప్రదాయబద్ధంగా కార్మిక సంఘం ఏర్పాటవడాన్ని నిరోధించింది, అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాల వెలుపల IBM కార్మికులు కొన్ని సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2009లో ఎక్కువ మంది ఉద్యోగులను ప్రతిపాదిత పింఛను పరిధి నుంచి తొలగించేందుకు UKలో కంపెనీ పింఛను కోతలు ప్రకటించింది, ఈ పరిణామంతో అనేక మంది కంపెనీ ఉద్యోగులు యునైట్ యూనియన్‌లో చేరారు.

1990వ దశకంలో రెండు ప్రధాన పింఛను మార్పు కార్యక్రమాలు జరిగాయి, ఇందులో కాష్ బాలెన్స్ ప్లాన్‌కు బదిలీ చేసే మార్పు కూడా ఒకటి, దీనిపై ఒక ఉద్యోగ సంఘం కంపెనీ వయస్సు ప్రాతిపదికన వివక్ష చూపుతుందని ఆరోపిస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. IBM ఉద్యోగులే ఈ కేసు గెలిచి, కంపెనీతో పాక్షిక రాజీకి వచ్చారు, అయితే వారి విజ్ఞప్తిలు ఇప్పటికీ పరిశీలనలోనే ఉన్నాయి. IBM 2006లో సుదీర్ఘకాలంగా నడుస్తున్న మరో కేసును కూడా పరిష్కరించుకుంది.[37]

చారిత్రాత్మకంగా, IBM ఎక్కువకాలం ఉద్యోగులను నిలుపుకొని మంచి పేరు దక్కించుకుంది, అయితే భారీస్థాయిలో ఉద్యోగులపై వేటు వేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. తగ్గుతున్న లాభాలు మరియు మారుతున్న విపణి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల IBM ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు అనేక భారీ కోతలు విధించింది. 2005 తొలి త్రైమాసికంలో అంచనాలకన్నా తక్కువ స్థాయిలో ఆదాయార్జనను ప్రకటించిన IBM 14,500 మంది ఉద్యోగులపై వేటు వేసింది, ఈ ఉద్యోగాల కోత ఎక్కువగా ఐరోపా ఖండ దేశాల్లో జరిగింది. మే 2005లో, IBM ఐర్లాండ్ తన యొక్క MD (మైక్రో-ఎలక్ట్రానిక్స్ డివిజన్) కేంద్రాన్ని ఏడాది చివరినాటికి మూసివేస్తున్నట్లు ప్రకటించి, సిబ్బందికి ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించింది. అయితే కార్యకలాపాలు మొదలైతే తిరిగి IBM ఐర్లాండ్‌లోనే పనిచేసేందుకు సిబ్బంది మొత్తం సుముఖత వ్యక్తం చేశారు. ఉత్పాదక కార్యకలాపాలు సింగపూర్‌లోని అంకోర్ అనే కంపెనీకి బదిలీ చేయబడ్డాయి, అంకోర్ సింగపూర్‌లోని IBM యొక్క మైక్రోఎలక్ట్రానిక్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది మరియు ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసినందుకు బదులుగా పూర్తి సామర్థ్యంమేర ఉత్పత్తి ఇస్తామని IBM హామీ ఇచ్చింది. జూన్ 8, 2005న, IBM కెనడా లిమిటెడ్. సుమారు 700 ఉద్యోగాలపై వేటు వేసింది. IBM ఈ చర్యలను తన వ్యాపారాలు, వృత్తి నైపుణ్యాల్లో "పునఃసమతౌల్యం" తీసుకొచ్చే వ్యూహంలో భాగమని ప్రకటించింది. IBM ఇండియా మరియు చైనా, ఫిలిప్పీన్స్, కోస్టా రికాల్లోని ఇతర IBM కార్యాలయాల్లో మాత్రం ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది, ఈ దేశాల్లో ఖర్చు తక్కువగా ఉండటం వలన ఉద్యోగ నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు ఉద్యోగులు మాత్రం కంపెనీ పేరులోని ఐ, బి, ఎం అక్షరాలకు ఐ హావ్ బీన్ మువ్డ్ అనే భాష్యం కూడా చెప్పారు.

అక్టోబరు 10, 2005నాటికి, ప్రపంచంలో ఉద్యోగ నిర్ణయాల్లో జన్యు సమాచారాన్ని ఉపయోగించరాదని అధికారికంగా నిర్ణయం తీసుకున్న తొలి ప్రధాన కంపెనీగా IBM నిలిచింది. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క జెనోగ్రఫిక్ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలిచిన IBM, ఆ తరువాత కొన్ని నెలలకే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

స్వలింగ సంపర్క హక్కులుసవరించు

IBM తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల్లోని స్వలింగసంపర్కులకు ఆరోగ్య ప్రయోజనాలు అందజేస్తూ, వారికి వివక్షరహిత నిబంధనను వర్తింపజేస్తుంది. స్వలింగ సంపర్కులతో 100% స్నేహపూరితంగా వ్యవహరిస్తున్న కంపెనీల్లో ఒకదానిగా IBM హ్యూమన్ రైట్స్ క్యాంపైన్ నుంచి 2003లో గుర్తింపు పొందింది (ఆ ఏడాది నుంచి ప్రధాన కంపెనీలకు సంబంధించి హ్యూమన్ రైట్స్ క్యాంపైన్ నివేదిక తయారు చేస్తుంది, ప్రారంభ ఏడాది IBM 86% మార్కులు పొందింది).[38]

2007లో, స్టోన్‌వాల్ UK యొక్క ఉద్యోగకేంద్ర నాణ్యతా సూచిలో IBM UK అగ్రస్థానంలో నిలిచింది.[39]

IBM అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు స్వలింగ సంపర్కులు మరియు లింగమార్పిడి చేయించుకున్న వారి సంక్షేమానికి సంబంధించిన నలబైకిపైగా అవార్డులు పొందింది.[39]

IBM యొక్క వైవిధ్య కార్యక్రమంలో భాగంగా, GLBT డైవెర్శిటీ నెట్‌వర్క్ గ్రూపుతోపాటు, GLBT ఎంప్లాయ్ గ్రూపు (EAGLE – ఎంప్లాయ్ అలయన్స్ ఫర్ గే అండ్ లెస్బియన్ ఎంపవర్‌మెంట్)లు ఏర్పడ్డాయి, ప్రపంచవ్యాప్తంగా ఇందులో 1000 మంది నమోదిత సభ్యులు ఉన్నారు.

చిహ్నాలుసవరించు

1970వ దశకంలో రూపొందించిన చిహ్నాలు ఫోటోకాపియర్ల యొక్క సాంకేతిక పరిమితులకు సూక్ష్మగ్రాహకంగా ఉండేవి, అవి ఆ తరువాత బాగా వ్యాప్తి చెందాయి. మందమైన ఆకృతిలో ఉండే 1970లనాటి చిహ్నాన్ని కాపియర్లు పేలవంగా కాపీ చేయగలిగేవి, దీంతో కంపెనీలు మందమైన ఆకృతి లేని చిహ్నాలవైపు మొగ్గు చూపేవి. 1972లో IBM చిహ్నాలు ఇందుకు ఉదాహరణ.1980వ దశకం మధ్యకాలంలో డిజిటల్ కాపియర్లు అందుబాటులోకి రావడంతో, ఈ సాంకేతిక పరిమితులు కనిపించకుండా పోయాయి; దాదాపుగా అదే సమయంలో తక్కువ-రెజల్యూషన్ ఉన్న డిజిటల్ ప్రింటర్‌లు (240 డాట్స్ ఫర్ ఇంచ్) సరిగా కాపీ చేయలేకపోతున్న కారణంగా– 13-చారలు ఉన్న చిహ్నం నిలిపివేయబడింది.

బోర్డు డైరెక్టర్లుసవరించు

ప్రస్తుతం IBM బోర్డు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న సభ్యులు:

విడుదలలుసవరించు

  • IBM మధ్యస్థాయి మార్కెట్‌ల కోసం కొత్త BI సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది[40]

ఇవి కూడా చూడండిసవరించు

మరింత చదివేందుకుసవరించు

ఎడ్విన్ బ్లాక్ 2009 నాజీ నెక్సస్: అమెరికాస్ కార్పొరేట్ కనెక్షన్స్ టు హిట్లర్స్ హోలోకాస్ట్ ISBN 0-914153-09-9
ఎడ్విన్ బ్లాక్ 2008 IBM అండ్ ది హోలోకాస్ట్: ది స్ట్రాటజిక్ అలయన్స్ బిట్వీన్ నాజీ జర్మనీ అండ్ అమెరికాస్ మోస్ట్ పవర్‌ఫుల్ కార్పొరేషన్ ISBN 0-914153-10-2
ఉల్‌రిచ్ స్టెయిన్‌హిల్పెర్ 2006 డోంట్ టాక్ – డు ఇట్! ఫ్రమ్ ఫ్లైయింగ్ టు వర్డ్ ప్రాసెసింగ్ ISBN 1-872386-75-5
సామే చిత్తుం

2004

ఇన్ ఎన్ I.B.M. విలేజ్, పొల్యూషన్ ఫియర్స్ టెయింట్ రిలేషన్స్ విత్ నైబర్స్ న్యూయార్క్ టైమ్స్
లూయిస్ వి. గెస్ట్నెర్, జూనియర్. 2002 హు సేస్ ఎలెఫెంట్స్ కాంట్ డాన్స్? హర్పర్ కాలిన్స్ ISBN 0-00-715448-8
ఎడ్విన్ బ్లాక్ 2001 IBM అండ్ ది హోలోకాస్ట్ ISBN 0-676-80662-7
రాబర్ట్ స్లేటర్ 1999 సేవింగ్ బిగ్ బ్లూ: IBM's లో గెస్ట్నెర్ మెక్‌గ్రా హిల్
ఎమెర్సన్ డబ్ల్యు. పుగ్ 1996 బిల్డింగ్ IBM: షేపింగ్ ఎన్ ఇండస్ట్రీ మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
రాబర్ట్ హెల్లెర్ 1994 ది ఫేట్ ఆఫ్ IBM లిటిన్ బ్రౌన్
పాల్ కరోల్ 1993 బిగ్ బ్లూస్: ది అన్‌మేకింగ్ ఆఫ్ IBM క్రౌన్ పబ్లిషర్స్
రాయ్ ఎ బౌయెర్ మరియు ఇతరులు 1992 ది సిల్వర్‌లేక్ ప్రాజెక్ట్: ట్రాన్స్‌ఫార్మేషన్ ఎట్ IBM (AS/400) ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్
థామస్ వాట్సన్, జూనియర్. 1990 ఫాదర్, సన్ & కో: మై లైఫ్ ఎట్ IBM అండ్ బియాండ్ ISBN 0-553-29023-1
డేవిడ్ మెర్సెర్ 1987 IBM: హౌ ది వరల్డ్స్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కార్పొరేషన్ ఈజ్ మేనేజెడ్ [41] కోగాన్ పేజ్
రిచర్డ్ థామస్ డెలామార్టెర్ 1986 బిగ్ బ్లూ: IBM's యూజ్ అండ్ అబ్యూస్ ఆఫ్ పవర్ మాక్‌మిలన్
రాబర్ట్ సోబెల్ 1986 IBM వర్సెస్. జపాన్: ది స్ట్రగుల్ ఫర్ ది ఫ్యూచర్ ISBN 0-812-83071-7
బుక్ రోడ్జెర్స్ 1986 ది IBM వే హార్పర్ & రా
రాబర్ట్ సోబెల్ 1981 IBM: కొలోసస్ ఇన్ ట్రాన్షిషన్ ISBN 0-8129-1000-1
రాబర్ట్ సోబెల్ 1981 థామస్ వాట్సన్, సీనియర్.: IBM అండ్ ది కంప్యూటర్ రెవల్యూషన్ (బయోగ్రఫీ ఆఫ్ థామస్ జె. వాట్సన్) ISBN 1-893122-82-4
విలియం రోడ్జెర్స్ 1969 థింక్: ఎ బయోగ్రఫీ ఆఫ్ ది వాట్సన్స్ అండ్ IBM ISBN 0812812263

సూచనలుసవరించు

  1. Executive compensation at IBM.
  2. "Nanotechnology & Nanoscience". Cite web requires |website= (help)
  3. CNET నెట్‌వర్క్స్, "IBM ఛాలెంజెస్ పార్టనర్ Cisco".
  4. "IBM maintains patent lead, moves to increase patent quality". 2006-01-10. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  5. "Worldwide IBM Research Locations". IBM. Retrieved 2006-06-21. Cite web requires |website= (help)
  6. "Awards & Achievements". IBM. Retrieved 2009-08-13. Cite web requires |website= (help)
  7. మార్టిన్ క్యాంబెల్ మరియు విలియం ఆస్ప్రే, "కంప్యూటర్ ఎ హిస్టరీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మిషిన్ – రెండొవ ముద్రణ", వెస్ట్‌వ్యూ ప్రెస్, పేజి నెంబరు. 37, 2004.
  8. Greene, Jay; McMillan, Robert (2018-10-28). "IBM to Acquire Red Hat for About $33 Billion". Wall Street Journal (ఆంగ్లం లో). ISSN 0099-9660. Retrieved 2018-10-29.
  9. Hammond, Ed; Porter, Kiel; Barinka, Alex. "IBM Nears Deal to Acquire Software Maker Red Hat". www.bloomberg.com. Retrieved 28 October 2018.
  10. "IBM to Acquire Red Hat". Retrieved 28 October 2018. Cite web requires |website= (help)
  11. "developerWorks blogs : Michael O'Connell : dW wins Jolt Hall of Fame award; Booch, Ambler, dW authors also honored". IBM. 2007-03-27. Retrieved 2007-04-23. Cite web requires |website= (help)
  12. "IBM delivers Power-based chip for Microsoft Xbox 360 worldwide launch". IBM. 2005-10-25. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  13. "Butterfly and IBM introduce first video game industry computing grid". IBM. 2002-05-09. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  14. "IBM joins forces with game companies around the world to accelerate innovation". IBM. 2006-03-21. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  15. "IBM and Cisco: Attempt to Unite the Communication Software Developers". Cite web requires |website= (help)
  16. ibm.com. "ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్" 3 మే 2008.
  17. "ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్", 3 మే 2008.
  18. "ఇన్ ఎన్ I.B.M. విలేజ్, పొల్యూషన్ ఫియర్స్ టెయింట్ రిలేషన్స్ విత్ నైబర్స్." 15 మార్చి 2004. న్యూయార్క్ టైమ్స్ ఆన్‌లైన్. 1 May 2008.
  19. IBM అండ్ టోక్యో ఓకా గోగ్యో టర్నప్ వాట్స్ ఆన్ సోలార్ ఎనర్జీ ప్రొటెక్షన్.
  20. "Energy, the environment and IBM". IBM. 2008-04-01. Retrieved 2009-05-27. Cite web requires |website= (help)
  21. "IBM Press room - 2008-05-15 IBM Research Unveils Breakthrough In Solar Farm Technology - United States". IBM. 2008-05-15. Retrieved 2009-05-27. Cite web requires |website= (help)
  22. IBM
  23. 23.0 23.1 edited by Evan Selinger. (2006). Postphenomenology: A Critical Companion to Ihde. State University of New York Press. p. 228. ISBN 0-7914-6787-2.CS1 maint: extra text: authors list (link)
  24. Conway Lloyd Morgan and Chris Foges. (2004). Logos, Letterheads & Business Cards: Design for Profit. Rotovision. p. 15. ISBN 2-88046-750-0.
  25. E. Garrison Walters. (2001). The Essential Guide to Computing: The Story of Information Technology. Publisher: Prentice Hall PTR. p. 55. ISBN 0-13-019469-7.
  26. Smith, Paul Russell (1999). Strategic Marketing Communications: New Ways to Build and Integrate Communications. Kogan Page. p. 24. ISBN 0749429186.
  27. Samuel J. Palmisano (2004-04-27). "Speeches". IBM. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  28. "Leading Change When Business Is Good: The HBR Interview--Samuel J. Palmisano". Harvard Business Review. Harvard University Press. 2004. Unknown parameter |month= ignored (help)
  29. InnovationJam 2008, IBM, retrieved 2009-02-22
  30. "IBM launches biggest Linux lineup ever". IBM. 1999-03-02. మూలం నుండి 1999-11-10 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  31. Farrah Hamid (2006-05-24). "IBM invests in Brazil Linux Tech Center". LWN.net. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  32. "Interview: The Eclipse code donation". IBM. 2001-11-01. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  33. వరల్డ్ సోషలిస్ట్ వెబ్‌సైట్
  34. "100 best companies for working mothers 2004". Working Mother Media, Inc. మూలం నుండి 2004-10-17 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
  35. "100 best companies 2005". Working Mother Media, Inc. Retrieved 2006-06-26. Cite web requires |website= (help)
  36. "IBM's EO Policy letter is IBM's foundation for diversity". IBM. Cite web requires |website= (help)
  37. "IBM settles overtime lawsuit for $65 million". Cite web requires |website= (help)
  38. HRC కార్పొరేట్ ఈక్వాలిటీ ఇండెక్స్ స్కోర్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషిన్స్ కార్పొరేషన్. ( IBM) ప్రొఫైల్ .
  39. 39.0 39.1 "IBM Valuing Diversity - Awards and Recognition". IBM. Retrieved 2009-05-27. Cite web requires |website= (help)
  40. [IBM లాంచెస్ న్యూ BI సాఫ్ట్‌వేర్ ఫర్ మిడ్-మార్కెట్ http://www.cbronline.com/news/ibm_launches_new_bi_software_for_midmarket_090914]
  41. "IBM". Futureobservatory.dyndns.org. Retrieved 2008-09-22. Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు

సంబంధిత లింకులుసవరించు