ఇంటికి దీపం ఇల్లాలే

(ఇంటికిదీపం ఇల్లాలే నుండి దారిమార్పు చెందింది)

ఇంటికి దీపం ఇల్లాలే ,1961 జనవరి26 విడుదల.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు , జగ్గయ్య, జమున, బి సరోజాదేవి నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్ విశ్వనాధన్,రామమూర్తి అందించారు.

ఇంటికి దీపం ఇల్లాలే
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.ఎన్.రెడ్డి
తారాగణం ఎన్.టి. రామారావు,
జగ్గయ్య,
జమున,
బి. సరోజాదేవి,
నాగయ్య,
కన్నాంబ,
రేలంగి,
గిరిజ,
రమణారెడ్డి,
ఇ.వి.సరోజ,
కె.మాలతి
సంగీతం ఎమ్మెస్ విశ్వనాథన్,
రామమూర్తి
నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

అన్న త్రాగుబోతు. తమ్ముడు పరాయి ఊర్లో డాక్టరు. తమ్ముణ్ణి ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. కానీ అతనికి ఆ విషయం తెలియదు. అతడు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అతనికి తెలియకుండా అన్నకు భార్యగా మారుతుంది. పెండ్లికి తమ్ముడు హాజరు కాలేదు కాబట్టి కొని రోజుల తర్వాత ఆమెను తమ్ముడు ఇంటికి వచ్చి చూస్తాడు. తర్వాత తమ్ముడు, తన భార్య ఇది వరకే ప్రేమించుకున్నారని అన్న తెలుసుకుంటాడు. కాని వారిరువురికి ఇప్పుడు తల్లీ కొడుకుల బాంధవ్యం తప్ప మరేమీ లేకపోయినా అన్న అపార్థం చేసుకుంటాడు. ఆ ఇల్లాలి మంచి గుణాలవల్ల, సహనము, సాధుశీలత వల్ల తన భర్త నరనరాల్లో కరడుగట్టిన త్రాగుడును మాన్పించగలిగింది. అతనిలో పెనవేసుకుని పగసాధించాలన్న అపోహను తొలగించగలిగింది. చివరకు ఆ కుటుంబంలో కమ్ముకుని వున్న చిమ్మచీకట్లు తొలిగి వెలుతురు ప్రవహిస్తుంది.[1]

పాటలు

మార్చు
  1. అమ్మాయగారికి మనస్సులోన ఆశచేత దడాదడా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
  2. ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేల ఈ భందాలన్నీ - పి.బి. శ్రీనివాస్, రచన: ఆచార్య ఆత్రేయ
  3. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడేనమ్మా - సుశీల , రచన: ఆచార్య ఆత్రేయ
  4. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడేనమ్మా (బిట్) - సుశీల, రచన: ఆత్రేయ
  5. నీవేనీవే నిన్నేనిన్నే నీవే నీవే కావలసినది నిన్నేనిన్నే నే - పి.బి.శ్రీనివాస్, సుశీల, రచన: ఆత్రేయ
  6. పొంగి పొంగి వచ్చినది సంబరాల సంక్రాంతి - డి. ఎల్. రాజేశ్వరి బృందం, రచన: ఆత్రేయ
  7. వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు[2] (సంతోషం) - సుశీల - రచన:శ్రీశ్రీ
  8. వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు (విషాదం) -పి. సుశీల - రచన:శ్రీశ్రీ
  9. కడుపు పంట కొడుకునని కనిపించావే , ఎం.ఎస్.రాజేశ్వరి , రచన: ఆచార్య ఆత్రేయ .

వనరులు

మార్చు
  1. గ్రిద్దలూరు గోపాలరావు (3 February 1961). "చిత్ర సమీక్ష - ఇంటికి దీపం ఇల్లాలే" (PDF). జమీన్ రైతు. 33 (5): 9. Retrieved 25 July 2020.
  2. సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.