బొడ్డపాటి కృష్ణారావు

బొడ్డపాటి కృష్ణారావు తెలుగు సినిమా నటుడు. ఇతడు రాజనాల, ముక్కామల, రేలంగి మాదిరిగా ఇంటి పేరుతో బొడ్డపాటిగా సినిమా రంగానికి సుపరిచితుడు. ఇతని స్వస్థలం మచిలీపట్నం. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడు. సినీరంగంలో ప్రవేశానికి ముందు ఇతడు నాటకాలలో సుబ్బిశెట్టి మొదలైన పాత్రలను ధరించి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి వంటి పండితుల మెప్పును పొందాడు. ఇతడు తెలుగు తమిళ సినిమాలలో సుమారు 90 చిత్రాలలో చిన్న చిన్న పాత్రలను ధరించాడు. ఇతని మొదటి సినిమా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1954లో విడుదలైన అమర సందేశం.

బొడ్డపాటి కృష్ణారావు
మాయాబజార్ సినిమాలో శంఖుతీర్థుల పాత్రలో బొడ్డపాటి
వృత్తితెలుగు ఉపాధ్యాయుడు
ప్రసిద్ధిరంగస్థల, చలనచిత్ర నటుడు

చిత్రాల జాబితా మార్చు

బొడ్డపాటి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:[1]

విడుదలైన సంవత్సరం సినిమా పేరు పాత్ర దర్శకుడు
1954 అమర సందేశం ఆదుర్తి సుబ్బారావు
1955 సంతోషం సి.పి.దీక్షిత్
1955 దొంగ రాముడు కె.వి.రెడ్డి
1956 ఏది నిజం? ఎస్.బాలచందర్
1956 సొంతవూరు ఇ.ఎస్.ఎన్.మూర్తి
1956 చరణదాసి తాతినేని ప్రకాశరావు
1956 ముద్దు బిడ్డ కె.బి. తిలక్
1957 మాయాబజార్ శంఖుతీర్థులు కె.వి.రెడ్డి
1957 సంకల్పం సి.వి.రంగనాథదాసు
1957 వినాయక చవితి వినాయకుడు, యదువీరుడు సముద్రాల రాఘవాచార్య
1957 పాండురంగ మహత్యం కమలాకర కామేశ్వరరావు
1957 ఎం.ఎల్.ఏ. కె.బి.తిలక్
1957 వద్దంటే పెళ్ళి బి.విఠలాచార్య
1958 రాజనందిని ఆనవోతు వేదాంతం రాఘవయ్య
1958 అన్న తమ్ముడు సి.యస్.రావు
1958 ముందడుగు కృష్ణారావు
1958 పెళ్లినాటి ప్రమాణాలు పేరయ్య కె.వి.రెడ్డి
1958 ఆడపెత్తనం ఆదుర్తి సుబ్బారావు
1958 అత్తా ఒకింటి కోడలే కె.బి.తిలక్
1959 బండరాముడు పి. పుల్లయ్య
1959 జయభేరి పి.పుల్లయ్య
1959 రేచుక్క-పగటిచుక్క కమలాకర కామేశ్వరరావు
1960 చివరకు మిగిలేది గుత్తా రామినీడు
1960 కులదైవం కబీర్‌దాస్
1960 భక్త శబరి చోటి చిత్రపు నారాయణమూర్తి
1960 దేవాంతకుడు సి.పుల్లయ్య
1960 ఋణానుబంధం వేదాంతం రాఘవయ్య
1960 భక్త రఘునాథ్ సముద్రాల రాఘవాచార్య
1960 మహాకవి కాళిదాసు కమలాకర కామేశ్వరరావు
1960 జగన్నాటకం శోభనాద్రిరావు
1961 శ్రీకృష్ణ కుచేల చిత్రపు నారాయణమూర్తి
1961 భార్యాభర్తలు లాయర్ కె.ప్రత్యగాత్మ
1961 సతీ సులోచన ఎస్.రజనీకాంత్
1961 బాటసారి అంజయ్య (నౌకరు) పి.ఎస్. రామకృష్ణారావు
1961 పెండ్లి పిలుపు ఆమంచర్ల శేషగిరిరావు
1961 తండ్రులు కొడుకులు కె.హేమాంబరధరరావు
1961 జగదేకవీరుని కథ భట్రాజు కె.వి.రెడ్డి
1961 ఇంటికి దీపం ఇల్లాలే వి.యన్.రెడ్డి
1961 ఇద్దరు మిత్రులు ఆఫీసు గుమాస్తా ఆదుర్తి సుబ్బారావు
1962 గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు
1962 భీష్మ దాశరాజు మంత్రి బి.ఎ.సుబ్బారావు
1962 చిట్టి తమ్ముడు కె.బి.తిలక్
1963 ఆప్తమిత్రులు కె.బి.నాగభూషణం
1963 ఎదురీత బి.ఎస్. నారాయణ
1963 పెంపుడు కూతురు బి.ఆర్.పంతులు
1963 మంచి చెడు టి.ఆర్.రామన్న
1963 ఈడూ జోడూ కె.బి.తిలక్
1964 పీటలమీద పెళ్ళి జి.కృష్ణమూర్తి
1964 మంచి మనిషి కె.ప్రత్యగాత్మ
1964 వివాహబంధం పి.ఎస్. రామకృష్ణారావు
1964 మర్మయోగి బి.ఎ.సుబ్బారావు
1965 కీలుబొమ్మలు సి.యస్.రావు
1965 దేవత కె.హేమాంబరధరరావు
1965 ప్రమీలార్జునీయము ఎం.మల్లికార్జునరావు
1965 తోడూ నీడా ఆదుర్తి సుబ్బారావు
1966 పల్నాటి యుద్ధం గుత్తా రామినీడు
1966 శ్రీకృష్ణ తులాభారం కమలాకర కామేశ్వరరావు
1966 శకుంతల కమలాకర కామేశ్వరరావు
1966 శ్రీమతి విజయారెడ్డి
1966 సంగీత లక్ష్మి గిడుతూరి సూర్యం
1967 సాక్షి బాపు
1967 భామావిజయం సి.పుల్లయ్య
1967 సత్యమే జయం పి.వి.రామారావు
1967 ఉమ్మడి కుటుంబం ఎన్.టి.రామారావు
1968 గ్రామదేవతలు సి.యస్.రావు
1968 మన సంసారం సి.యస్.రావు
1968 లక్ష్మీనివాసం వి.మధుసూదనరావు
1969 చిరంజీవి సావిత్రి
1969 బందిపోటు భీమన్న ఎం.మల్లికార్జునరావు
1969 ముహూర్త బలం ఎం.మల్లికార్జునరావు
1969 ధర్మపత్ని బి.ఎ.సుబ్బారావు
1970 పసిడి మనసులు పి.సుబ్రహ్మణ్యం
1970 మెరుపు వీరుడు బి.హరినారాయణ
1970 కథానాయిక మొల్ల పద్మనాభం
1970 పెత్తందార్లు సి.యస్.రావు
1970 పగ సాధిస్తా కె.వి.యస్.కుటుంబరావు
1970 తల్లా పెళ్ళామా ఎన్.టి.రామారావు
1971 మోసగాళ్ళకు మోసగాడు కె.ఎస్.ఆర్.దాస్
1971 ఆనందనిలయం బి.ఎస్.నారాయణ
1971 జీవితచక్రం సి.యస్.రావు
1971 మా ఇలవేల్పు జి.వి.ఆర్.శేషగిరిరావు
1971 విచిత్ర దాంపత్యం పి.చంద్రశేఖరరెడ్డి
1971 రైతుబిడ్డ బి.ఎ.సుబ్బారావు
1972 సోమరిపోతు వి.రామచంద్రరావు
1972 మా ఇంటి కోడలు శ్రీకాంత్

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Boddapati". indiancine.ma. Retrieved 10 June 2022.

బయటి లింకులు మార్చు