ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పూణే

మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పూణే (ఐఐఐటీ పూణే లేదా ట్రిపుల్ ఐటీ పూణే), అనేది మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా లాభాపేక్ష లేని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడిన 25 ఐఐఐటీలలో ఇదీ ఒకటి.[1]

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పూణే
నినాదంసాంకేతికత టెక్నాలజీని పెంచడం
రకంపబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా)
స్థాపితం2016 (2016)
డైరక్టరుఒ.జి. కాక్డే
విద్యార్థులు970
అండర్ గ్రాడ్యుయేట్లు900
పోస్టు గ్రాడ్యుయేట్లు50
డాక్టరేట్ విద్యార్థులు
20
స్థానంపూణే, మహారాష్ట్ర
18°27′46″N 73°50′04″E / 18.462711°N 73.83445°E / 18.462711; 73.83445
కాంపస్పట్టణ, 100 ఎకరం (40 హె.)
రంగులు   నీలం & ఎరుపు

చరిత్ర

మార్చు

ఇది 2016లో ప్రారంభించబడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు ప్రకారం 2017 ఆగస్టులో భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది.[2]

స్థాపన

మార్చు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖచే ఆమోదించబడిన ఐఐఐటీ పూణే, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటు చేయబడింది. ఇందులో యాభై శాతం వాటాలను విద్యా మంత్రిత్వ శాఖ, ముప్పై ఐదు శాతం మహారాష్ట్ర ప్రభుత్వం, పదిహేను శాతం పరిశ్రమ భాగస్వాములచే నిర్వహించబడుతోంది.

కోర్సులు

మార్చు

ఇందులో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బిటెక్)లో కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్ (సిఎస్ఈ), ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) అనే రెండు కోర్సులను అందిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరం నుండి ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్), డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్.డి.) కోర్సులను ప్రారంభించింది.

సిఎస్ఈలో 175 మంది విద్యార్థులు, ఈసీఈలో 50 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది.[3] జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ద్వారా సీట్ల భర్తీ ఉంటుంది.[4] పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎంటెక్ కోసం సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం పొందుతారు.

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు, సంస్థ వివిధ విభాగాల్లో 'మేజర్'తో రెండు బ్రాంచ్‌లలోని ప్రతిభగల విద్యార్థులకు 'ఆనర్స్' డిగ్రీని ప్రదానం చేయడం ప్రారంభించింది.[5]

బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బిటెక్ ) మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్.డి.)
  • కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • అప్లైడ్ మ్యాథమెటిక్స్, డేటా సైన్స్
  • హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, మేనేజ్‌మెంట్

ప్రాంగణం

మార్చు
 
ఐఐఐటీ పూణే శాశ్వత క్యాంపస్ ప్లాన్

ఐఐఐటీ పూణే ప్రస్తుతం అంబేగావ్ బుద్రుక్, సింహగడ్ ఇన్స్టిట్యూట్ రోడ్, పూణే 411041 వద్ద ఉన్న తాత్కాలిక క్యాంపస్ నుండి పనిచేస్తోంది. తలేగావ్ దభడే సమీపంలోని నానోలి టార్ఫ్ చకన్ వద్ద ఉన్న 100 ఎకరాలలో శాశ్వత ప్రాంగణం నిర్మించబడుతోంది.

ప్లేస్‌మెంట్

మార్చు

పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, విద్యార్థులను రిక్రూట్ చేయడానికి ఇతర సంస్థల కంటే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కెరీర్ డెవలప్‌మెంట్ & కార్పొరేట్ రిలేషన్ సెంటర్ విద్యార్థులకు మార్గదర్శకత్వం, కెరీర్ ప్లానింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా అవకాశాలను అందిస్తుంది. 2021–2022 బ్యాచ్ కోసం టాప్ కంపెనీలు ఐఐఐటీ పూణేని సందర్శించాయి.[6]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2 January 2021. Retrieved 2023-02-11.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Department of Higher Education | Government of India, Ministry of Education".
  3. "Academics | Indian Institute of Information Technology, Pune".
  4. "Archived copy". Archived from the original on 3 July 2020. Retrieved 2023-02-11.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Latest Updates Detail | Indian Institute of Information Technology, Pune". Archived from the original on 2020-11-25. Retrieved 2023-02-11.
  6. "IIIT Pune opens to 100% internships, Rs 22 lakh salary | Pune News - Times of India". The Times of India.