ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటి), భారతదేశంలోని 25 ఇంజనీరింగ్ శాఖలతో ఇంటర్ డిసిప్లినరీ టెక్నాలజీ ఆధారిత ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థల సమూహం. ఈ ఇన్‌స్టిట్యూట్స్ సమాచార సాంకేతికత విద్యపై దృష్టి సారిస్తున్నాయి. వాటిలో ఐదు శాఖలు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడ్డాయి, ఆ శాఖ నుండి నిధులు సమకూర్చబడ్డాయి. మిగిలిన 20 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ, పరిశ్రమ భాగస్వాములు 50:35:15 నిష్పత్తిలో నిధులతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడ్డాయి.
ఏర్పాటు
మార్చుమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2014కి ముందు గ్వాలియర్, అలహాబాద్, జబల్‌పూర్, కాంచీపురం నటరాలలో ఐఐఐటీలను ఏర్పాటుచేసింది.[1]
2014లో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్లు, 2014 అనేది లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.[2] నాలుగు ఐఐఐటీలపై జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హొదా కల్పించాలని బిల్లులో కోరబడింది. అనేక చర్చలు, మార్పుల తర్వాత 2014 డిసెంబరు 1న పార్లమెంటులో బిల్లు ఆమోదించబడింది.[2][3] 2014 డిసెంబరు 8న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2014గా ప్రచురించబడి, 2015 జనవరి 5న అమల్లోకి వచ్చింది.
2015లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ప్రభుత్వ బాధ్యతగా[1] కర్నూలులో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఐదవ సంస్థ ఏర్పాటుచేయబడింది.[4] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం, 2017 ప్రకారం కర్నూలు ఇన్‌స్టిట్యూట్‌కు జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదా మంజూరుచేయబడింది.[5]
పైన పేర్కొన్న పూర్తి ప్రభుత్వ నిధులతో కూడిన ఐఐఐటీలతోపాటు 2010లో కేంద్ర మంత్రివర్గం 50:35:15 నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వాముల నిధులతో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ఆధారంగా మరో ఇరవై ఐఐఐటీల ఏర్పాటుకోసం ఒక పథకాన్ని ఆమోదించింది.[6] 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు & కాకినాడ), అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (పూణె & నాగ్‌పూర్), మణిపూర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ వంటి 21 రాష్ట్రాలలో 23 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు), ఆంధ్రప్రదేశ్ (కాకినాడ), అస్సాం, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర (పుణె), ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్ త్రిపుర వంటి 16 ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.[6] 2017 నాటికి వాటిలో 14 ఐఐఐటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో, త్రిపురలోని అగర్తలాలో ఏర్పాటు చేయబడలేదు. అదనంగా 2015లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో,[7] జార్ఖండ్‌లోని రాంచీలో ఐఐఐటీని ఆమోదించింది.[8] 2016లో బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఒక ఐఐఐటీ,[9] 2017లో గుజరాత్‌లోని సూరత్‌లో ఒక ఐఐఐటీ ఆమోదించబడింది.[10] 2017 సెప్టెంబరు నాటికి ఈ నాలుగు కొత్త ఇన్‌స్టిట్యూట్‌లు ఇప్పటికే స్థాపించబడ్డాయి.
2017 ఆగస్టు 9న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) చట్టం, 2017 భారత గెజిట్‌లో నోటిఫై చేయబడింది.[11] ఈ చట్టం వడోదర, గౌహతి, శ్రీసిటీ, కోట, తిరుచిరాపల్లి, కళ్యాణి, ఊనా, సోనీపత్, లక్నో, కొట్టాయం, మణిపూర్, ధార్వాడ్, పూణే, రాంచీ నగరాలలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో ఏర్పాటుచేసిన 15 ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను అందించింది.
2017లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో ఏర్పాటైన మూడు ఐఐఐటీలు సూరత్, భోపాల్, భాగల్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లు. 2017 ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య చట్టంలో కాకినాడ, అగర్తలలోని ఇన్‌స్టిట్యూట్‌లను పేర్కొనలేదు.
2012 నుండి ఆగిపోయిన ఐఐఐటీ అగర్తల స్థాపన కోసం 2018లో త్రిపుర ప్రభుత్వం 50.67 కోట్ల రూపాయలను ఆమోదించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా కింద ప్రైవేట్ సంస్థల నుండి రావలసిన 5.82 కోట్ల రూపాయలు కవర్ చేయబడింది.[12] నీట్ అగర్తల క్యాంపస్ నుండి 2018-2019 అకడమిక్ సెషన్‌లో తరగతులను ప్రారంభించేందుకు సంస్థ ప్రణాళికను చేసింది.[13]
2016లో, కర్ణాటకలోని రాయచూర్‌లో ఐఐఐటీకి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.[14] 2018లో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారికంగా కాకినాడ స్థానంలో రాయచూర్ ఇన్‌స్టిట్యూట్‌ను భర్తీ చేస్తుందని స్పష్టం చేసింది. ఇన్‌స్టిట్యూట్ కోసం భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది, తరువాతి సంవత్సరం నాటికి ఇన్‌స్టిట్యూట్‌ని పనిచేసేలా ప్రణాళిక చేసింది.[15] అయితే, భూమిని సేకరించనందున, 2019లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఐఐఐటీని తెలంగాణలోని హైదరాబాద్‌కు మార్చాలని నిర్ణయించింది.[16] ఐఐఐటీ రాయచూర్ తన విద్యా కార్యకలాపాలను 2019 ఆగస్టులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, తెలంగాణాలోని తాత్కాలిక క్యాంపస్ నుండి ప్రారంభించింది.[17]
2020లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు ద్వారా సూరత్, భోపాల్, భాగల్‌పూర్, అగర్తల, రాయచూర్‌లలోని ఐఐఐటీలను అధికారికంగా ప్రకటించడంతోపాటు వాటికి జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను కూడా ప్రదానం చేయబడింది.[18] 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[19]
ప్రవేశాలు
మార్చుజాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ, జెఈఈ-మెయిన్ ద్వారా 6,000 సీట్లకు ఐఐఐటీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లు జరుగుతాయి.[20] పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు ఇంజనీరింగ్ పట్టభద్రుల యోగ్యతా పరీక్ష (గేట్) పరీక్ష ద్వారా ప్రవేశం ఉంటుంది.
25 ట్రిపుల్ ఐటిల జాబితా
మార్చుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ ఉన్నాయి:
క్రమసంఖ్య | పేరు | స్థాపించబడిన సంవత్సరం | స్థాపన | రాష్ట్రం |
1 | అటల్ బిహారీ వాజ్‌పేయి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ | 1997 | విద్యా మంత్రిత్వ శాఖ | మధ్యప్రదేశ్ |
2 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలహాబాద్ | 1999 | విద్యా మంత్రిత్వ శాఖ | ఉత్తర ప్రదేశ్ |
3 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, జబల్‌పూర్ | 2005 | విద్యా మంత్రిత్వ శాఖ | మధ్యప్రదేశ్ |
4 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, కాంచీపురం | 2007 | విద్యా మంత్రిత్వ శాఖ | తమిళనాడు |
5 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ | 2013 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | ఆంధ్రప్రదేశ్ |
6 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గౌహతి | 2013 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | అస్సాం |
7 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వడోదర | 2013 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | గుజరాత్ |
8 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కోటా | 2013 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | రాజస్థాన్ |
9 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి | 2013 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | తమిళనాడు |
10 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉనా | 2014 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | హిమాచల్ ప్రదేశ్ |
11 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోనేపట్ | 2014 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | హర్యానా |
12 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కళ్యాణి | 2014 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | పశ్చిమ బెంగాల్ |
13 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లక్నో | 2015 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | ఉత్తర ప్రదేశ్ |
14 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ధార్వాడ్ | 2015 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | కర్ణాటక |
15 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కర్నూలు | 2015 | విద్యా మంత్రిత్వ శాఖ | ఆంధ్రప్రదేశ్ |
16 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కొట్టాయం | 2015 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | కేరళ |
17 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మణిపూర్ | 2015 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | మణిపూర్ |
18 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాగ్‌పూర్ | 2016 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | మహారాష్ట్ర |
19 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పూణే | 2016 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | మహారాష్ట్ర |
20 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాంచీ | 2016 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | జార్ఖండ్ |
21 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సూరత్ | 2017 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | గుజరాత్ |
22 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భోపాల్ | 2017 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | మధ్యప్రదేశ్ |
23 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భాగల్పూర్ | 2017 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | బీహార్ |
24 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా | 2018 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | త్రిపుర |
25 | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాయచూర్ | 2019 | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం | కర్ణాటక |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Institutions – Government of India, Ministry of Human Resource Development". mhrd.gov.in. Retrieved 2023-01-31.
- ↑ 2.0 2.1 "Legislation : Loksaha" (Type "Indian Institutes of Information Technology" in the "Short Title of the Bill" field and click "Submit"). loksabhaph.nic.in. Retrieved 2023-01-31.
- ↑ "The Indian Institutes of Information Technology Act, 2014" (PDF). Gazette of India. Government of India. 8 December 2014. Retrieved 2023-01-31.
- ↑ "Indian Institutes of Information Technology (Amendment) Bill, 2017" (PDF). Government of India. 21 March 2017. Archived from the original (PDF) on 25 October 2018. Retrieved 2023-01-31.
- ↑ "Indian Institutes of Information Technology (Amendment) Act, 2017" (PDF). Gazette of India. Government of India. 17 August 2017. Archived from the original (PDF) on 17 April 2018. Retrieved 2023-01-31.
- ↑ 6.0 6.1 "Setting up of Indian Institute of Information Technology". pib.nic.in. Ministry of Human Resource Development. 16 July 2014. Retrieved 2023-01-31.
- ↑ Choudhari, Abhishek (15 May 2015). "HRD ministry approves IIIT for Nagpur". The Times of India. Times News Network. Retrieved 2023-01-31.
- ↑ Narayan, Santosh (9 December 2015). "Cabinet clears decks for setting up IIIT". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2023-01-31.
- ↑ Roshan, Kumar (15 December 2016). "More room for education". The Telegraph (Calcutta). Retrieved 2023-01-31.
- ↑ "IIIT Surat". svnit.ac.in (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2018. Retrieved 2023-01-31.
- ↑ "The Indian Institutes of Information Technology (Public-Private Partnership) Act, 2017" (PDF). egazette.nic.in. 9 August 2017. Retrieved 2023-01-31.
- ↑ Deb, Debraj (13 April 2018). "Rs 50cr approved for IIIT in Tripura". Telegraph India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-31.
- ↑ "IIIT to start classes in Tripura this year". The Times of India. 14 April 2018. Retrieved 2023-01-31.
- ↑ "In-principle approval given for IIIT in Raichur". The Hindu. 15 December 2016. Retrieved 2023-01-31.
- ↑ "MHRD confirms IIIT at Raichur". The Hindu. 25 January 2018. Retrieved 2023-01-31.
- ↑ "IIIT goes to Telangana". Bangalore Mirror (in ఇంగ్లీష్). 26 July 2019. Retrieved 2023-01-31.
- ↑ Ullas, Sruthy Susan (16 January 2020). "IIIT-Raichur may soon shift to its hometown". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-31.
- ↑ "The Indian Institutes of Information Technology Laws (Amendment) Bill, 2020". PRSIndia (in ఇంగ్లీష్). 4 March 2020. Retrieved 2023-01-31.
- ↑ Nagari, Akhilesh (22 September 2020). "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2023-01-31.
- ↑ "More seats in new IITs 387 additional BTech berths on offer this year".