ఇండోర్ గేమ్స్
ప్రతి మనిషి బాల్యం ఆటలతోనే ప్రారంభం అవుతుంది. ఆటలు/క్రీడలు ఆడటం వలన మనిషి ఆరోగ్యంగా, ఉత్యాహంగా వుండగలడు. క్రీడల అవశ్యకతను అన్ని దేశాలు గుర్తించాయి. అందువలన అన్ని దేశాలు ప్రభుత్వ మంత్రిమండలిలో క్రీడలకై ఒక శాఖను కేటాయించి, క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుంది. వాటి ద్వారా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయంగానూ ఆటలను ఆడటం జరుగుతున్నది.
ఆడే ప్రదేశాన్ని బట్టి క్రీడలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి, బయటి ఆవరణలో ఆడే క్రీడలు -వీటిని అవుట్‌డోర్ గేమ్స్ అంటారు. పుట్‌బాల్, హాకీ, సాప్ట్‌బాల్, కబడ్డి, క్రికెట్ వంటివి. పైకప్పు కలిగిన స్టెడియంలో ఆడే ఆటలను ఇండోర్‌గేమ్స్ అంటారు. వీటిలో కొన్నింటిని బయట కూడా ఆడవచ్చును. కొన్ని రకముల ఇండోర్ గేమ్స్ గురించిన వివరాలు దిగువన ఉన్నాయి.
టేబుల్ టెన్నిస్
మార్చుటెబుల్ టెన్నిస్‌ను 'పింగ్‌పాంగ్' అని కూడా అంటారు. కీ.శ.1880 లో ఇంగ్లాండ్‌లో ఈ క్రీడ మొదలైంది. ఈ క్రీడ యిద్దరు లేక నలుగురు ఆడతారు. యిద్దరు ఆడితే సింగిల్‌క్రీడ అని, నలుగురు ఆడితే డబుల్స్ అంటారు. ఈ గేమ్‌ను మొదట్లో మధ్యాహ్న భోజన విరామ సమయములో కాలక్షేపంగా ఆడేవారు. కాల క్రమేణా దీని ప్రాముఖ్యత మారింది. కీ.శ.1988 లో ఒలంపిక్‌లో ఈ క్రీడ ఆడెటందుకు అనుమతి లభించింది. తరువాత కీ.శ.2002 లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో అనుమతించబడింది. టేబుల్ టెన్నిస్ యొక్క బోర్డు 9X5 అడుగుల సైజులో ఉంటుంది. నేల నుండి బోర్డు 30" అంగుళాల ఎత్తులో ఉంటుంది. బోర్డుకు మధ్యలో అడ్డంగా ఆరు అంగుళముల ఎత్తుతో ఒక నెట్ ఉంటుంది. ఆటగాళ్ళు బోర్డుకు ఇరువైపుల చివరలో నిలబడి ఆడేదరు. బ్యాట్ లేక రాకెట్ కొద్దిగా అండాకారములో ఉంటుంది. బ్యాట్ చెక్కతో చెయ్యబడి, రెండు పక్కల రబ్బరు షీల్డింగ్ కలిగి ఉంటుంది. రాకెట్ బ్లేడ్ వెడల్పు 6.0" అంగుళములు, పొడవు 6.5" అంగుళములు ఉంటుంది. బంతి లేలికగా, డొల్లగా ఉంటుంది, 38-40 మి.మీ. వ్యాసంతో ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఆటను 11 పాయింట్ల కోసం ఆడతారు. ముందుగా 11 పాయింట్లు చేసినవారు గెలిచినట్లు. మొదటగా సర్వీసు చేసే ఆటగాడు, బంతి మొదట తన వైపు కోర్ట్‌లో బౌన్స్‌అయ్యి, తరువాత ప్రత్యర్థి కోర్ట్‌లోనికి వెళ్ళేలా కొట్టవలెను. ప్రత్యర్థి తిరిగి బంతిని, అవతలి కోర్ట్‌లోనికి వెళ్ళేలా కొట్టాలి. అలా కొట్టలేకపోతే పాయింట్ కొల్పోతారు. ప్రతి ఆట తరువాత, తరువాతి ఆట కోసం ఆటగాళ్లు బోర్డు సైడు మారతారు. 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో ఆటలు ఆడిన తరువాత, ఎక్కువ ఆటలు గెలచిన వ్యక్తిని మ్యాచ్ గెలచినట్లుగా ప్రకటిస్తారు.[1] [2]
బాడ్మింటన్
మార్చుబాడ్మింటన్ గేమ్ మొదటగా ఇంగ్లాండ్‌లో చిన్న పిల్లలు ఆడుకునే ఆటగా మొదలైంది. ఆ తరువాత భారతదేశములో బ్రిటీష్ వారి పాలన కాలములో, బ్రిటీష్ ఆర్మీ వారు ఇండియాలో ఆడటం ప్రారంభించారు. మొదట్లో ఈ గేమ్‌ను 'Poona'అని పిలిచెవారు. 1938 లో అంతర్జాతీయ బాడ్మింటన్ ఫెడరేషన్ ఏర్పడింది. ఈ ఫెడరేషన్‌లో ప్రస్తుతం 130 దేశాలు సభ్యత్యము కలిగి ఉన్నాయి. ఒలంపిక్స్‌లో ఈ ఆటకు 1992 లో స్దానము కల్పించారు. బాడ్మింటన్ కాక్‌ను బాతు ఈకలతో, చెక్క కార్క్‌తో చేస్తారు. కాక్‌లో 16 ఈకలు ఉంటాయి. రాకెట్ లేదా బ్యాట్ ను హికరి కార్బను మిశ్రమంతో లేదా ఉక్కుతో తయారు చేస్తారు. సింగిల్ ఆట కోసం కోర్టు 17 X 44 అడుగుల సైజులో ఉంటుంది. డబుల్స్ ఆట కోసం 20X44 అడుగుల సైజు ఉంటుంది. కోర్టు చుట్టూ 5 అడుగుల ఖాళీ స్థలం ఉండాలి. కోర్ట్‌ను కాంక్రీట్ లేదా బిట్యుమినస్ తారుతో తయారు చేస్తారు. కోర్టును రెండు సమభాగాలుగా చేస్తూ, మధ్యలో అడ్దంగా ఒక నెట్ కట్టబడి ఉంటుంది. నెట్ ఎత్తు చివర్ల వద్ద 5 అడుగుల 1 అంగుళము (5'-1"), కోర్ట్‌మధ్యలో 5 అడుగులూ (5'-0") ఉంటుంది. ప్రతి గేమ్‌కు 15 పాయింట్‌లు ఉంటుంది. మహిళల ఆట అయితే 11 పాయింట్‌లు ఉంటుంది. సర్వీసును కోర్టుకు ఒక చివర నుండి హద్దు లైన్ వెలుపలనుండి ప్రత్యర్థి కోర్టు లోపల (హద్దు లైన్ లోపల) వెళ్ళేలా కాక్‌ను కొట్టాలి. తన కోర్ట్‌లోనికి వచ్చిన బంతిని/కాక్ తిరిగి ప్రత్యర్థి కోర్ట్‌లోనికి పంపలేకపోయిన పక్షంలో-సర్వీస్ చేసిన ఆటగాడైతే సర్వీస్ కోల్పోతారు, ప్రత్యర్థి ఆయితే పాయింట్ కోల్పోతారు. ప్రతి ఆట తరువాత కోర్టు సైడు మారతారు.
వాలీబాల్
మార్చువాలీబాల్ క్రీడ మొదటగా కీ.శ.1895 లో అమెరికాలో మొదలైంది. ఆటలో రెండు టీములు ఉంటాయి. ప్రతి జట్టులో 6 గురు ఆటగాళ్ళు ఉంటారు. వాలీబాల్‌ను ఇండోర్‌గేమ్ గానే కాకుండగా, అవుట్‌డోర్ గేమ్‌గా బీచ్ వాలిబాల్, గ్రాస్ వాలీబాల్ అని కూడా ఆడతారు. 1964 నుండి ఒలంపిక్ క్రీడల్లో కూడా ఆడటం ప్రారంభమైంది. కోర్టు పొడవు 18 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు ఉంటుంది. కోర్టును రెండు (9X9mts) సమభాగములుగా చేస్తూ మధ్యలో ఒక నెట్ ఉంటుంది. నెట్ యొక్క పై అంచు నుండి గ్రౌండ్‌కు 2.43 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మహిళల క్రీడ అయ్యినచో 2.24 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బంతి గోళాకారముగా ఉంటుంది. బంతిని చర్మంతోగాని, సింథటిక్ చర్మంతోగానీ తయారు చేస్తారు. బంతి చుట్టుకొలత 65-67 సెం.మీ. ఉంటుంది. బంతి లోపల గాలి వత్తిడి 0.3-0.32 కి.గ్రా/సెం.మీ<sum>2</sum> ఉంటుంది. ఆటగాళ్ళు తమ చేతులతో బంతిని అవతల కోర్టులోనికి వెళ్ళేలా కొట్టాలి. తమ కోర్టులోనికి వచ్చిన బంతిని అవతలి కోర్టులోనికి కొట్టేందుకు మూడుసార్లు బంతిని తాకవచ్చు. అయితే వరుసగా ఒకే ఆటగాడు రెండుసార్లు బంతిని తాకడం కాని కొట్టడం కాని చెయ్యరాదు. అవతలి కోర్టు నుండి వచ్చిన బంతిని ఒక ఆటగాడు చేతులతో పైకి లేచేలా కొడితే, రెండో ఆటగాడు బంతిని అవతలి కోర్టులోనికి వెళ్ళేలా కొడతారు. అలా కొట్టిన బంతి అవతలి కోర్టులో నేలను తాకినా, లేదా అవతలి వారు కొట్టిన బంతి నెట్‌ను తగిలి ఆ కోర్టులోనే ఉండిపోయినా పాయింట్‌ను కోల్పోతారు. ప్రతి జట్టు తమ ప్రత్యర్థి కోర్టులోని నేలను తాకేలా 'షార్ప్ షాట్స్' కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ప్రతి ఆటలో ఒక సెట్‌కు 25 పాయింట్‌లు ఉంటాయి. ఒక గేములో 5 సెట్‌లు ఉంటాయి. 5 వ సెట్‌కు మాత్రం 15 పాయింట్‌లు మాత్రమే ఉంటాయి. బంతిను చేతులతో మాత్రమే కాకుండా తలతో, భుజాలతో, మెడవెనుక భాగంతో కూడా కొట్టవచ్చు. ఒక టీములో సెట్టర్స్, హిట్టర్స్ ఉంటారు. సెట్టరు బంతిని ఒడుపుగా పైకి లేపగా, హిట్టరు బంతిని ప్రత్యర్థి కోర్టులో నేలను తాకేలా కొడతారు.
బాస్కెట్ బాల్
మార్చుబాస్కెట్ బాల్ ఆట[3] మొదటగా అమెరికాలో 1891 లో స్పింప్‌ఫిల్డ్‌లో ఆడారు. 1936 లో ఒలంపిక్స్‌లో చేర్చారు. ఒక్కో జట్టులో 13-15 మంది ఆటగాళ్ళు వుంటారు. కాని కోర్టులో ఆట ఆడేటప్పుడు 5 గురు మాత్రమే ఆడుతూండ్గా, మిగిలినవాళ్ళు అదనపు ఆటగాళ్ళుగా ఉంటారు. ఎవరైనా ఆటగాణ్ణి, ఏ కారణం చేతనైనా మార్చాల్సి వస్తే, ఈ అదనపు ఆటగాళ్ళ నుండి ఒకరు లోపలికి వెళ్తారు. కోర్టు 28 మీటరుల పొడవు, 15 మీటరుల వెడల్పు ఉంటుంది. కోర్టుకు చివర యిరువైపుల బౌండరీ లైన్ వద్ద రెండు బాస్కెట్ నెట్ పోస్ట్‌లు ఉంటాయి. ఈ పోస్టులకు 6X3.5 సైజు బోర్డు అమరచ్చబడి ఉంటుంది. ఈ బోర్డులకు 18 అంగుళముల వ్యాసం వున్న రింగులు వుండి, దానికి క్రింద తెరుచుకునివున్న ఒక నెట్ ఉంటుంది. రింగు పై అంచు, నేలనుండి 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. కోర్టు లోపల కొన్ని వృత్తాలు గియ్యబడి ఉంటాయి. ఆయా వృత్తాలనుండి ఆటగాళ్ళు బంతిని రింగులో పడేలా వెయ్యాలి. దాన్ని బట్టి పాయింట్లు వస్తాయి. బంతి పరిమాణం పురుషుల ఆటలో 29.5 అంగుళాల చుట్టుకొలతతో, 624 గ్రాముల బరువు ఉంటుంది. మహిళల ఆటలో 28.5 అంగుళాల చుట్టుకొలత, 567 గ్రాముల బరువు ఉంటుంది. ప్రతి ఆట తరువాత 10-12 నిమిషాల చొప్పున 4 బ్రేకులు ఉంటాయి. ఎక్కువ పాయింట్లు సాధించినవారు గెలిచినట్లు. బంతి అందుకున్న ఆటగాడు, ప్రత్యర్థి ఆటగాడికి అందకుండా తప్పించుకుని ముందుకు వెళ్తారు. అవసరమైనప్పుడు, తన టీములోని ఆతఘాడికి బంతిను అందిస్తూ, ముందుకు వెళ్ళి, ప్రత్యర్థి కోర్టులోని రింగులో వెయ్యాలి. బంతిను చేతితో మాత్రమే తాకఅలి. కాలితో తన్నరాదు. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాణ్ణి నెట్టడంకాని, తోయడం కాని చెయ్యరాదు.
కారమ్‌బోర్డు
మార్చుకారమ్బోర్డు[4] ఆటలోని పరికరాలు 1. కారమ్‌బోర్డు 2. కారమ్‌మెన్ లేదా కాయిన్స్, 3. స్ట్రైయికర్
1. కారమ్‌బోర్డు: నలుచదరంగా వుండి, ప్లైవుడ్‌తో చేసిన బోర్డు. అంచులకు చెక్క ఫ్రేమ్ ఉంటుంది. బోర్డుసైజు 74X74 సెం.మీ. ఉంటుంది. చెక్క ఫ్రేమ్ 1.25-3.0 అంగుళాల మందం ఉంటుంది. బోర్డు నాలుగు మూలలలో నాలుగు కంతలు ఉంటాయి. బోర్డు ఉపరితలము నునుపుగా వుండి, కాయిన్స్, స్త్రైకరు, అతి తక్కువ ఘర్షణతో కదిలేలా ఉంటుంది. బోర్డుమీద గీతలు గీసి ఉంటాయి. పొడవుగా, నాలుగు వైపుల వున్న గీతల మధ్య స్ట్రెకరును వుంచి కాయిన్సును కొట్టాలి. ఈ ఆటను ఇద్దరు లేదా నలుగురు ఆడవచ్చు. ఇద్దరు అయితే ఎదురెదురుగా కూర్చుంటారు. నలుగురు అయితే రెండు జట్లుగా ఆడవచ్చు. ఒకే జట్టుకు చెందినవారు ఎదురెదురుగా కూర్చోవాలి.
2. కారమ్‌మెన్ లేదా కాయిన్స్ చెక్క లేదా అక్రిలిక్‌తో చేయబడి ఉంటాయి. ఇవి గుండ్రంగా ఉంటాయి. 19 కాయిన్స్ ఉంటాయి. అందులో 9 నల్లగా, 9 తెల్లగానూ, ఒకటి ఎర్రగానూ ఉంటాయి.ఎర్ర కాయిన్‌ను రాణి కాయిన్ అంటారు.
3. స్ట్రయికర్: దీన్ని అక్రిలిక్‌తో తయారు చేస్తారు. మిగతా కాయిన్స్‌కన్న యిది పెద్దదిగా ఉంటుంది. వివిధ రంగులలో ఉంటుంది. స్ట్రయికరుతోనే కాయిన్స్‌ను కొడతారు. బోర్డుమీద స్ట్రయికరు ఘర్షణ లేకుండగా కదిలేందుకు బోర్డు్‌మీద బోరిక్ యాసిడ్ పొడిని చల్లుతారు.
ఆడే విధానము: మొదట కాయిన్స్‌ను బోర్డుమధ్యలో వున్న వృత్తములో పేర్చాలి. రెడ్‌కాయిన్ సెంటరులో వుండేలా, తెల్లకాయిన్స్'Y'ఆకారములో వుండేలా అమర్చాలి. టాస్ గెలిచిన వారు మొదట స్ట్రయిక్ చెయ్యాలి. టాస్ గెలచినవారు తెల్లకాయిన్స్‌ను కొట్టాలి. స్ట్రయికరుతో కాయిన్స్ నాలుగు వైపులా ఉన్న కంతల్లో పడేలా కొట్టాలి. రెడ్ కాయిన్‌ను కంతలో పడేసిన వెన్వెంటనే మరో కాయిన్‌ను 'కవరింగ్ కాయిన్'గా కంతలో పడేలా కొట్టాలి. కొట్టలేకపోతే రెడ్ కాయిన్ను తిరిగి బోర్డు మీద పెట్టెయ్యాలి. బోర్డుమీద నుండి ఎవ్వరి కాయిన్సును ముందుగా ఖాళీ అయిపోతాయో వారు ఆ సెట్‌ను గెలచినట్లు. బోర్డు మీద మిగిలివున్న ప్రత్యర్థి కాయిన్స్ బట్టి పాయింట్స్ ను లెక్కిస్తారు. రెడ్‌కు 3 పాయింట్స్ ఇస్తారు. ఒక ఆటకు 25 పాయింట్స్ ఉంటుంది. మొదటగా 25 పాయింట్స్ చేసినవారు విజేతలు.
స్క్రాబుల్
మార్చుస్క్రాబుల్ ఒక పద క్రీడ, దీంట్లో 15 బై 15 గ్రిడ్‌తో మార్క్ చేయబడిన వేరువేరు అక్షర ఫలకాల నుంచి పదాలను రూపొందించడం ద్వారా నలుగురు ఆటగాళ్లు స్కోర్ పాయింట్లను సాధిస్తారు. పదాలను క్రాస్‌వర్డ్ పద్ధతిలో అడ్డంగా, కిందివైపుకు అమర్చుతారు. ప్రామాణిక నిఘంటువులో ఉండే పదాలనే వాడాలి. అఫిషియల్ రిఫరెన్స్ వర్క్స్ (ఉదా. ది అఫిషియల్ స్క్రాబుల్ ప్లేయర్స్ డిక్షనరీ ) అనుమతించదగిన పదాలను అందిస్తుంది. కాలిన్స్ స్క్రాబుల్ చెకర్ కూడా పదం అనుమతించబడిందా లేదా అని తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది.[5]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-06. Retrieved 2013-09-25.
- ↑ https://www.google.co.in/search?q=table+tennis+history&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=XJVCUv3cDo2PrgfKyYG4AQ&ved=0CDYQsAQ&biw=1366&bih=677&dpr=1
- ↑ http://www.breakthroughbasketball.com/basics/basics.html
- ↑ https://en.wikipedia.org/wik/Carrom_Board#Equipment
- ↑ "Collins Scrabble Checker". Collins. 2009. Archived from the original on 2010-09-25. Retrieved 2009-02-15.