ఇండోర్ జిల్లా

మధ్యప్రదేశ్ లోని జిల్లా

ఇండోర్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. ఇండోర్ నగరం మీదుగా జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఇది దాని ముఖ్యపట్టణం. ఈ జిల్లా ఇండోర్ డివిజన్‌లో భాగం.

ఇండోర్ జిల్లా
రాజ్వాడా, ఇండోర్
రాజ్వాడా, ఇండోర్
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుఇండోర్
Seatఇండోర్
Government
 • లోక్‌సభ నియోజకవర్గాలుIndore, Dhar
విస్తీర్ణం
 • మొత్తం3,989 కి.మీ2 (1,540 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం32,76,697 (provisional)[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత82.3%[2]
Time zoneUTC+05:30 (IST)
సగటు వార్షిక అవపాతం1062 మి.మీ.
Websitehttp://indore.nic.in

2011 నాటికి, మధ్యప్రదేశ్‌లోని జిల్లాల్లో ఇది అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఇదే.[3]

భౌగోళికం

మార్చు

ఇండోర్ జిల్లా వైశాల్యం 3,898 చ.కి.మీ [4] ఉత్తరాన ఉజ్జయిని, తూర్పున దేవాస్, దక్షిణాన ఖర్‌గోన్, పశ్చిమాన ధార్ జిల్లాలు ఇండోర్ జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి.

నదులు

మార్చు

ఇండోర్ జిల్లా గుండా రెండు ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నాయి. పశ్చిమాన చంబల్ నది (మౌకు దక్షిణాన వింధ్య పర్వత శ్రేణిలో ఉద్భవించింది), తూర్పున చంబల్ నదికి ఉపనది అయిన క్షిప్రా నది ప్రవహిస్తున్నాయి. క్షిప్రా నదికి ఉపనదులైన గంభీర్, కన్హ్ కూడా జిల్లాలో ఉన్నాయి

జనాభా వివరాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, ఇండోర్ జిల్లా జనాభా 32,76,697.[3] ఇది మారిటానియా దేశ జనాభాకు,[5] అమెరికా రాష్ట్రమైన అయోవా జనాభాకూ సమానం.[6] ఇది భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో 105 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనసాంద్రత 841/చ.కి.మీ. 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 32.88%. ఇండోర్ జిల్లాలో లింగ నిష్పత్తి 928. అక్షరాస్యత 80,87% (మగవారిలో 87,25%, స్త్రీలలో 74,02%).

2011 భారత జనాభా లెక్కల సమయంలో, జిల్లాలో 88.69% మంది హిందీ, 3.54% మరాఠీ, 2.81% ఉర్దూ, 1.74% సింధీ, 0.98% గుజరాతీ, 0.81% పంజాబీ, 0.49% భిలి మాట్లాడేవారు ఉన్నారు.[7]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19013,02,057—    
19112,72,396−9.8%
19213,38,992+24.4%
19313,80,889+12.4%
19414,54,541+19.3%
19516,01,035+32.2%
19617,53,594+25.4%
197110,25,150+36.0%
198114,09,473+37.5%
199118,35,915+30.3%
200124,65,827+34.3%
201132,76,697+32.9%

శీతోష్ణస్థితి

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Indore district
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 27.5
(81.5)
28.8
(83.8)
38.3
(100.9)
42.7
(108.9)
46.4
(115.5)
36.2
(97.2)
30.3
(86.5)
28.2
(82.8)
30.9
(87.6)
32.4
(90.3)
22.7
(72.9)
16.9
(62.4)
31.8
(89.2)
సగటు అల్ప °C (°F) 5.8
(42.4)
9.4
(48.9)
16.2
(61.2)
21.2
(70.2)
24.4
(75.9)
24.1
(75.4)
22.6
(72.7)
21.9
(71.4)
21.1
(70.0)
18.1
(64.6)
11.9
(53.4)
6.6
(43.9)
16.9
(62.5)
సగటు అవపాతం mm (inches) 4
(0.2)
3
(0.1)
1
(0.0)
3
(0.1)
11
(0.4)
136
(5.4)
279
(11.0)
360
(14.2)
185
(7.3)
52
(2.0)
21
(0.8)
7
(0.3)
1,062
(41.8)
సగటు అవపాతపు రోజులు 0.8 0.8 0.3 0.3 1.8 8.6 15.9 18.3 8.6 3.1 1.4 0.6 60.5
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 288.3 274.4 288.3 306.0 325.5 210.0 105.4 80.6 180.0 269.7 273.0 282.1 2,883.3
Source: HKO

మూలాలు

మార్చు
  1. "Distribution of population, sex ratio, density and decadal growth rate of population - State and District : 2011". Office of The Registrar General & Census Commissioner, India. Retrieved 18 July 2011.
  2. "Total Population, child population in the age group 0-6,literates and literacy rates by sex: 2011". Office of The Registrar General & Census Commissioner, Government of India. Retrieved 18 July 2011.
  3. 3.0 3.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  4. "Indore District - Statistics". Collectorate, Indore, Madhya Pradesh. Archived from the original on 21 July 2011. Retrieved 20 July 2011.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Mauritania 3,281,634 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011. Iowa 3,046,355
  7. "C-16 Population By Mother Tongue - Madhya Pradesh". censusindia.gov.in. Retrieved 29 September 2019.