దేవాస్ జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో దేవాస్ జిల్లా (హిందీ:देवास ज़िला) ఒకటి. దేవాస్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.2001లో జిల్లా వైశాల్యం 1,306,617 చ.కి.మీ. జిల్లా వైశాల్యం 1991 నుండి భూభాగం 26% అధికరించబడింది.
దేవాస్ జిల్లా
देवास ज़िला | |
---|---|
![]() మధ్య ప్రదేశ్ పటంలో దేవాస్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Ujjain |
ముఖ్య పట్టణం | Dewas |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Dewas |
Area | |
• మొత్తం | 7,020 km2 (2,710 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 15,63,107 |
• Density | 220/km2 (580/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.53% |
• లింగ నిష్పత్తి | 941 |
Website | అధికారిక జాలస్థలి |

భౌగోళికం సవరించు
దేవాస్ జిల్లా దేవాస్ రాజాస్థానంలో భాగంగా ఉంటూ వచ్చింది. జిల్లా విద్యపర్వతాలో భాగం. జిల్లా ఉత్తర భూభాగంలో మాల్వా పీఠభూమి ఉంది. దక్షుణ భూభాగంలో నర్మదా నదీ లోయ ఉంది. మాల్వా పీఠభూమిలో సోయాబీన్ అధికంగా పండించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, సొర్ఘం, బియ్యం, పత్తి అధికంగా పండించబడుతుంది. జిల్లా ఉత్తర సతిహద్దులో సీహోర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో హర్దా జిల్లా, ఖాండ్వా జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఖర్‌గోన్ జిల్లా, ఇండోర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో ఉజ్జయిని జిల్లా ఉన్నాయి. దేవాస్ జిల్లా ఉజ్జయిని డివిజన్‌లో భాగం. పురాణ కాలపు విక్రమాదుత్యుని కాలంలో ఉన్న దేవ్సాల్ రేవత్ రాజపుత్రుల పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందిన వారని భావిస్తున్నారు.
విభాగాలు సవరించు
దేవాస్ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి : సొంకాత్చ్ దేవాస్, కన్నోద్, టాంక్-ఖుర్ద్, ఖతెంగావ్. దేవాస్ తాలూకా జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలోని తాలూకాలను అన్నింటినీ అక్కని రహదారి మార్గాలు అనుసంధానిస్తూ ఉన్నాయి. ఇది బాంబే - ఆగ్రా రహదారి మార్గంలో ఉంది. జిల్లా బ్రాగ్ గేజి రైలు మార్గంతో కూడా చక్కగా అనుసంధినించబడుతూ ఉంది.
2001 లో గణాంకాలు సవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,563,107,[1] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | హవాయి నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 319వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 223 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.48%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 914 : 1000[1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 70.53%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు సవరించు
జిల్లాలో హిందీ, మాల్వి, బంగ్లా, ఆంగ్లం బరెలి, భిల్ (దేవనాగరి లిపిని వాడుతుంటారు) భాషలను దాదాపు 64,000 మంది ప్రజలు మాట్లాడుతుంటారు. .[4]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gabon 1,576,665
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
వెలుపలి లింకుకు సవరించు
- Dewas District web site
- [1] List of places in Dewas
- Dewas City Map [2]