ఇందిర షేక్ అబ్దుల్లా ఒప్పందం

షేక్ అబ్దుల్లా కాశ్మీర్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చే వీలు కలిగించిన ఒప్పందం

కాశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్లా, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీల మధ్య 1975లో కుదిరిన ఇందిరా-షేక్ ఒప్పందం, అబ్దుల్లా కాశ్మీర్ రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించే నిబంధనలను నిర్ణయించింది. 22 ఏళ్ల తర్వాత అబ్దుల్లా మళ్లీ జమ్మూ కాశ్మీర్‌కు ముఖ్యమంత్రి కావడానికి వీలు కలిగించింది. రాష్ట్రంలో పోటీ రాజకీయాలను ప్రారంభించింది.[1][2]

సందర్భం

మార్చు

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి చెంది, తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్‌గా ఏర్పడ్డాక, దక్షిణాసియాలో అధికార సమతుల్యత భారతదేశానికి అనుకూలంగా మారింది. భారతదేశం నిర్దేశించిన నిబంధనలను అనుసరించడం తప్ప వేరే మార్గం లేదని షేక్ అబ్దుల్లా నిర్ధారించుకున్నాడు.[3] యుద్ధంలో భారత విజయం భారతదేశ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ హోదాను పెంచింది. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే కాశ్మీరీ డిమాండు పట్ల ఆమె దృఢంగా వ్యవహరించింది. కాశ్మీర్, భారతదేశాల మధ్య 1953 కు ముందు ఉన్న సంబంధాలను పునరుద్ధరించాలనే షేక్ అబ్దుల్లా డిమాండ్‌ను అంగీకరించడమనేది ఊహించడమే అసాధ్యమని ఆమె పేర్కొంది. "గడియారాన్ని ఇలా వెనక్కి తిప్పడం జరిగేపని కాదు," అని ఆమె చెప్పింది.[4] 1975 లో షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలనే తన డిమాండును విరమించుకున్నాడు. 1953 నుండి భారతదేశం పట్ల వ్యతిరేకత కారణంగా అబ్దుల్లా కాశ్మీరులో ప్రజాదరణ పొందాడని, ఈ ఒప్పందానికి ఐదేళ్ల ముందు కూడా ఇటువంటి నిబంధనలకు అంగీకరించేవాడు కాదనీసుమంత్ర బోస్ పేర్కొన్నాడు.[5]

ఒప్పందం

మార్చు

ఆర్టికల్ 370 ప్రకారం రాష్ట్ర పరిపాలన నిర్వహించబడుతుందనే 1953 నాటి విలీన నిబంధనను ఈ ఒప్పందం పునరుద్ఘాటించింది. రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసేందుకు 1970 ల మధ్య నాటికి 23 రాజ్యాంగ ఉత్తర్వులు వచ్చాయని, రాష్ట్రానికి 262 యూనియన్ చట్టాలు వర్తింపజేశాయని సుమంత్ర బోస్ ఎత్తి చూపాడు.[6]

ఆర్టికల్ 370ని కొనసాగించినప్పటికీ, రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో "ఒక రాజ్యాంగ యూనిట్" గానే ఉంటుంది. భారత సార్వభౌమత్వాన్ని తిరస్కరించే లక్ష్యంతో కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలను రూపొందించడం ద్వారా భారత ప్రభుత్వం "అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను" నియంత్రించగలదు.[7]

1953 తర్వాత పొడిగించిన ఉమ్మడి జాబితా (కేంద్ర రాష్ట్రాలు పంచుకునే అధికారాల జాబితా) నుండి ప్రత్యేకంగా ఉన్న చట్టాలను మాత్రమే సమీక్షించే హక్కును ఈ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది. ఆ చట్టాలు మాత్రమే సవరణ కోసం గానీ, రద్దు చెయ్యడం కోసం గానీ పరిగణించబడతాయి. సంక్షేమం, సామాజిక, సాంస్కృతిక సమస్యలు, ముస్లిం వ్యక్తిగత చట్టం వంటి విషయాలపై చట్టం చేసే రాష్ట్ర హక్కును కూడా ఈ ఒప్పందం గుర్తించింది.[8]

పాఠ్యం

మార్చు
  1. భారత యూనియన్‌లో ఒక భాగమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, యూనియన్‌తో దాని సంబంధంలో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370A [9] లోని తాత్కాలిక నిబంధనల ద్వారా నిర్వహించబడుతుంది.
  2. శాసనం లోని అవశేష అధికారాలు రాష్ట్రంతో ఉంటాయి; అయితే, భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను నిరాకరించడం, ప్రశ్నించడం లేదా భంగం కలిగించడం లేదా భారత భూభాగంలో కొంత భాగాన్ని విడదీయడం, యూనియన్ నుండి భారతదేశ భూభాగం లేదా భారత జాతీయ జెండా, భారత జాతీయ గీతం రాజ్యాంగానికి అవమానం కలిగించడంవంటి చర్యలను నిరోధించడానికి అవసరమైన చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, కొనసాగుతుంది.
  3. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అనుసరణ, సవరణలతో భారత రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను వర్తింపజేసినట్లయితే, అటువంటి అనుసరణలు, సవరణలు ఆర్టికల్ 370 ప్రకారం రాష్ట్రపతి ఆదేశం ద్వారా మార్చబడతాయి లేదా రద్దు చేయబడతాయి. ఈ సందర్భంలో ఒక్కో ప్రతిపాదనను దాని యోగ్యతపై ఆధారపడి విడిగా పరిగణనలోకి తీసుకుంటారు; కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అనుసరణ లేదా సవరణ లేకుండా ఇప్పటికే వర్తింపజేసిన భారత రాజ్యాంగంలోని నిబంధనలు మార్చలేనివి.
  4. సంక్షేమ చర్యలు, సాంస్కృతిక అంశాలు, సామాజిక భద్రత, వ్యక్తిగత చట్టం, విధానపరమైన చట్టాల వంటి విషయాలపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి దాని స్వంత చట్టం ఉండేలా, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా స్వేచ్ఛను హామీ ఇచ్చే ఉద్దేశంతో, ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించిన ఏదైనా అంశంలో 1953 తర్వాత పార్లమెంటు చేసిన లేదా రాష్ట్రానికి విస్తరించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించవచ్చని, వాటిలో దేనికి సవరణ లేదా రద్దు అవసరమో నిర్ణయించవచ్చని అంగీకరించింది. ఆ తర్వాత, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు. అటువంటి చట్టానికి రాష్ట్రపతి సానుభూతితో పరిగణించి, ఆమోదం మంజూరు చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 2వ నిబంధన ప్రకారం భవిష్యత్తులో పార్లమెంటు చేయబోయే చట్టాల విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారు. అటువంటి చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపజేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుంటారు.
  5. ఆర్టికల్ 368 కింద అందించబడిన దానికి పరస్పరం ఏర్పాటు చేసిన విధంగా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఏ చట్టం చేయని విధంగా రాష్ట్రానికి వర్తించే విధంగా ఆ ఆర్టికల్‌కు తగిన సవరణను రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా చేయాలి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనలో ఏదైనా మార్పు లేదా దాని ప్రభావంలో ఏదైనా క్రింద పేర్కొన్న అంశాలకు సంబంధించి, బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయబడి, అతని ఆమోదం పొందితేనే అమలులోకి వస్తుంది.; ఈ విషయాలు ఎ) గవర్నర్ నియామకం, అధికారాలు, విధులు, విధులు, అధికారాలు, మినహాయింపులు, బి) ఎన్నికలకు సంబంధించిన విషయాలు - భారత ఎన్నికల సంఘం ఎన్నికల పర్యవేక్షణ, ఆదేశాలు ఇవ్వడం, నియంత్రణ, వివక్ష లేకుండా ఓటర్ల జాబితాలలో చేర్చడానికి అర్హత, వయోజన ఓటు హక్కు లెజిస్లేటివ్ కౌన్సిల్ కూర్పు [10]

ఈ ఒప్పందంపై అబ్దుల్లా తరపున మీర్జా అఫ్జల్ బేగ్, భారత ప్రభుత్వం తరపున (ప్రధానమంత్రి గాంధీ నేతృత్వంలో) జి. పార్థసారథి 1975 ఫిబ్రవరి 24 న న్యూఢిల్లీలో సంతకం చేశారు.[11]

స్పందనలు, పరిణామాలు

మార్చు

స్వయం నిర్ణయాధికారం కోసం చేస్తున్న కాశ్మీరీ ఉద్యమం ఈ ఒప్పందంతో ముగిసిందని వ్యాఖ్యాతలు భారతదేశం భావించాయి.[12] స్వయం నిర్ణయాధికారం కోసం కాశ్మీరీ ప్రజల డిమాండ్‌ను విస్మరించినట్లుగా భావించిన మిర్వాయిజ్ మౌల్వీ ఫరూక్, ఒప్పందంపై రాష్ట్రంలో నిరసనలు జరిపాడు. అవామీ యాక్షన్ కమిటీ, ప్లెబిసైట్ ఫ్రంట్‌ల మధ్య ఘర్షణలు జరిగాయి.

జమ్మూలో జనసంఘ్ మద్దతుదారులు ఆర్టికల్ 370 ని రద్దు చేయాలని, రాష్ట్రాన్ని భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలని పిలుపునిచ్చి నిరసనలు చేసారు.[13]

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అనుభవజ్ఞుడైన నాయకుడు. మీర్జా అఫ్జల్ బేగ్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా ఉన్న అబ్దుల్ ఖయ్యూమ్ జర్గర్, సుమంత్ర బోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఒప్పందం నిబంధనలు "ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు", కేవలం షేక్ అబ్దుల్లా అంగీకరించిన కారణంగా వారు దాన్ని "చేదు మాత్రలాగా మింగారు" అని అన్నాడు. అయితే, ఒప్పందానికి అందరూ కట్టుబడలేదు. షబ్బీర్ షా అనే యువ కార్యకర్త స్వయం నిర్ణయాధికారం కోసం పీపుల్స్ లీగ్‌ని సృష్టించాడు.[14]

నైలా అలీ ఖాన్, ఈ ఒప్పందం భారత ప్రభుత్వానికి షేక్ అబ్దుల్లా "లొంగిపోవటమే" నని, కాశ్మీరీ సంస్థలపై భారతదేశపు "ఎదురులేని శక్తిని" మరచిపోయాడనీ వర్ణించింది.[15] ఒప్పందం ముగిసిన తర్వాత కూడా షేక్ అబ్దుల్లా, కాశ్మీరీ ముస్లింలు "గాంధీ నెహ్రూల లౌకిక భారతదేశంలో సురక్షితంగా లేరని" భావించాడు.[16]

అబ్దుల్లా పునరాగమనాన్ని కాశ్మీర్ సంఘర్షణ నుండి "సమాధానమైన పరిష్కారం కోసం" అన్నట్లు కాకుండా, "తెలివైన ఎగవేత"గా చూపించే ప్రయత్నం చేసిందని సుమంత్ర బోస్ వివరించాడు. అయితే, అబ్దుల్లా పునరాగమనం రాష్ట్రంలో తొలిసారి "పోటీ రాజకీయాల"కు నాంది పలికిందని బోస్ అభిప్రాయపడ్డాడు.[17] అబ్దుల్లా పాలనలో ఒప్పందానికి వ్యతిరేకత కొనసాగింది.[18]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. What's the mystery of the Indira-Abdullah accord?, Deccan Herald, 13 December 2012.
  2. Indira-Sheikh accord a milestone event: Vohra, Business Standard, 27 October 2013.
  3. Sumantra Bose (June 2009). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. p. 89. ISBN 978-0-674-02855-5. He probably also calculated that after Pakistan's defeat and dismemberment in the December 1971 Bangladesh war, the regional balance of power had swung decisively in India's favor, leaving him with little alternative to accepting terms dictated by New Delhi.
  4. N. Khan (25 June 2014). The Life of a Kashmiri Woman: Dialectic of Resistance and Accommodation. Springer. pp. 103–. ISBN 978-1-137-46329-6. The consummate victory of the Indian military bolstered Indira Gandhi's position as premier of India, and she dealt with the demand for plebiscite in Jammu and Kashmir with a heavy hand. She declared that the Sheikh's insistence on restoring the pre-1953 constitutional relationship between the state and the Indian Union, which would afford greater autonomy and freedoms to the state, was inconceivable because, 'the clock could not be put back in this manner'.
  5. Sumantra Bose (June 2009). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. p. 88. ISBN 978-0-674-02855-5. In 1975 Sheikh Abdullah finally abandoned his self-determination platform. This was not a settlement Abdullah would have accepted or even considered -twenty, ten or even five years earlier. His politics and popularity since 1953 had been based on defiance of New Delhi's authoritarianism.
  6. Sumantra Bose (June 2009). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. p. 88. ISBN 978-0-674-02855-5. In return for Abdullah's release and appointment as IJK's chief minister, his associate, Mirza Afzal Beg, signed another 'Delhi accord' with the government of India. The agreement reaffirmed, virtually without modification, the terms of IJK's incorporation into India since 1953. A clause stated that 'Jammu and Kashmir, a constituent unit of the Union of India, shall continue to be governed under Article 370." Between 1954 and the mid-1970s, 28 constitutional orders "integrating" IJK with India had been issued from Delhi, and 262 Union laws had been made applicable in IJK.
  7. Victoria Schofield (30 May 2010). Kashmir in Conflict: India, Pakistan and the Unending War. I.B.Tauris. ISBN 978-0-85773-078-7. Although Kashmir's special status, enshrined in article 370 of the Indian Constitution was retained, the state was termed ' a constituent unit of the Union of India. The Indian government was able 'to make laws relating to the prevention of activities directed towards disclaiming, questioning or disrupting the sovereignty and territorial integrity of India or bringing about cession of a part of the territory of India from the Union or causing insult to the Indian national flag, the Indian national anthem and the Constitution.' This effectively gave India control in the areas which mattered most. There was to be no return to the pre-1953 status.
  8. Sumantra Bose (June 2009). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. p. 88. ISBN 978-0-674-02855-5. The Delhi accord gave IJK's government the right to 'review' only those laws from the shared center-state 'concurrent list' of powers which had been extended to IJK after 1953, and to 'decide' which of them might 'need amendment or repeal'...This aside, the Delhi accord patronizingly confirmed IJK's right to legislate on 'welfare measures, cultural matters, social security, and [Muslim] personal law.'
  9. Sharma, Padmakshi (2023-12-11). "Article 370 A Temporary Provision : Supreme Court Upholds Abrogation of Special Status of Jammu and Kashmir". Live Law (in ఇంగ్లీష్). Retrieved 2023-12-12.
  10. Noorani, A. G. "Letters between Indira Gandhi and Sheikh Abdullah before the controversial Kashmir accord". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-16.
  11. Role played by ‘G.P.’ in Indira–Sheikh Accord lauded, The Hindu, 30 October 2013
  12. Victoria Schofield (30 May 2010). Kashmir in Conflict: India, Pakistan and the Unending War. I.B.Tauris. ISBN 978-0-85773-078-7. Commentators at the time believed that the issue of plebiscite and self-determination could now be laid to rest...From an Indian standpoint, the movement for self-determination virtually came to an end with the 1975 accord.
  13. Victoria Schofield (30 May 2010). Kashmir in Conflict: India, Pakistan and the Unending War. I.B.Tauris. ISBN 978-0-85773-078-7. Within the state of Jammu and Kashmir, Mirwaiz Maulvi Farooq believed that Abdullah had relinquished the Kashmiris' right of self-determination. Throughout 1974 there had been clashes between his Awami Action Committee and the Plebiscite Front. The Jana Sangh in Jammu and Delhi protested against this accord. As always opposed to the special treatment meted out to the valley in preference of Jammu, Jana Sangh supporters wanted article 370 to be abrogated and the whole state included in the Indian Union, like all the other states.
  14. Sumantra Bose (June 2009). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. pp. 88–89. ISBN 978-0-674-02855-5. In 1995 I interviewed Abdul Qayyum Zargar, an NC veteran who had been Afzal Beg;s personal secretary.... Recalling the 1975 accord, Zargar said that its terms were deeply unpopular among NC-PF's activists and mass following, and swallowed as a bitter pill only because Abdullah had accepted the accord.... Not everyone agreed or acquiesced - a young Valley-based activist, Shabbir Ahmad Shah, formed an organization called the People's League in the mid-1970s to keep the quest for self-determination alive.
  15. N. Khan (25 June 2014). The Life of a Kashmiri Woman: Dialectic of Resistance and Accommodation. Springer. pp. 103–. ISBN 978-1-137-46329-6. Critics of the Sheikh's seeming "capitulation" to the government of India in 1975 overlook the pervasive power of the Indian state, which had infiltrated into political, socioeconomic, cultural and educational institutions.
  16. N. Khan (6 August 2012). The Parchment of Kashmir: History, Society, and Polity. Palgrave Macmillan US. pp. 27–. ISBN 978-1-137-02958-4. Even after the Indira-Abdullah Accord of 1975, he could feel that Kashmiri Muslims were not secure in the secular India of Gandhi and Nehru.
  17. Sumantra Bose (June 2009). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. p. 89. ISBN 978-0-674-02855-5. The Delhi-determined circumstances of an emasculated Abdullah's return to office amounted to a clever evasion of the Kashmir conflict rather than a substantive solution to it.
  18. Victoria Schofield (30 May 2010). Kashmir in Conflict: India, Pakistan and the Unending War. I.B.Tauris. ISBN 978-0-85773-078-7. Opposition to the Kashmir accord continued and a new educated class was being drawn into the political arena.