ఇంద్రజిత్ (1990 సినిమా)
ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది.[1]
ఇంద్రజిత్ (1990 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తెలుగు సినిమా హాస్యనటుడు గిరిబాబు చిన్న కుమారుడు బోస్ బాబు ఈ సినిమాలో కథానాయకునిగా నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.[2]
తారాగణం
మార్చు- బోస్ బాబు
- జయలలిత
- బ్రహ్మానందం
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత:వై.శ్రీదేవి
- దర్శకత్వం: గిరిబాబు
- స్టుడియో: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1990 సెప్టెంబరు 28
పాటల జాబితా
మార్చు1.చక్కని చిన్నోడా నచ్చిన బుల్లోడా పెళ్లికి ఊ అంటే , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకోరస్, కె ఎస్ చిత్ర
2.కన్నెఈడు ఖజానా సంతకాడ, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.మనో , చిత్ర
3.కస్సుమన్న ఈడు నాది కాగుతున్న చూపు నీది, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి శైలజ, మనో
4.బూచి బూచి దోర బూచి దొంగ బూచి , రచన: వేటూరి, గానం.ఎస్ పి శైలజ, మనో కోరస్.
మూలాలు
మార్చు- ↑ "Indrajith (1990)". Indiancine.ma. Retrieved 2020-08-17.
- ↑ "గిరిబాబు... సినిమా సిరిబాబు". సితార. Retrieved 2020-08-17.[permanent dead link]
3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.