ఇద్దరు దొంగలు 1984, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ సమర్పణలో కె. నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె.రాఘవేంద్రరావు దర్శతక్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, రాధ, జయసుధ, శారద తదితరులు నటించగా కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

ఇద్దరు దొంగలు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం కె. నాగేశ్వరరావు
కథ పి. సత్యానంద్
తారాగణం శోభన్ బాబు,
కృష్ణ,
రాధ,
జయసుధ,
శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ రమా ఫిల్మ్స్
విడుదల తేదీ జనవరి 14, 1984
నిడివి 153 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

అనుకోని కారణాల వల్ల దొంగలుగా ముద్రపడి శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు యువకులు శోభన్ బాబు, కృష్ణ. వారిలో మానవతాకోణం ఉందని ఓ పోలీస్‌ ఆఫీసర్‌ (సత్యనారాయణ) గమనించి, ప్రత్యేక అనుమతి తీసుకొని వారిద్దరినీ తన ఇంటికి తీసుకువస్తాడు. అలా వారిలో మంచి మార్పు తీసుకురావడానికి పోలీస్‌ అధికారి చేసే ప్రయత్నమే ఈ సినిమా.[1]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

నిర్మాణం మార్చు

రచయిత సత్యానంద్‌కు దో ఆంఖే బారా హాత్‌ హిందీ సినిమా అంటే చాలా ఇష్టంవుండడంతో దాని ప్రేరణతో కొత్త కథ తయారు చేశాడు. దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు, హీరోలు కృష్ణ, శోభన్‌బాబులకు ఈ కథ బాగా నచ్చడంతో కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మాతగా 1983 జూన్‌ 1న వాహినీ స్టుడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది.[1]

పాటలు మార్చు

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు.[2]

  • పూటకొక్క పులకరింత - జయసుధ, శోభన్ బాబు
  • చిటుక్కు చిటుక్కు చినుకంటా, చురుక్కు చురుక్కు మందంట - కృష్ణ, రాధ
  • ఆ నవ్వుకు ఒక ఆమని హహహా - జయసుధ, శోభన్ బాబు
  • జిగినక జిగిజిగినక అంబ పలుకు జగదంబ పలుకు - కృష్ణ, రాధ
  • పంచదార చిలక పెట్టనా కంచి పట్టుచీర పెట్టనా - కృష్ణ, రాధ
  • ఆ చూపులో ఒక ఆమని
  • గంగాళమ్మ చెబుతోంది

విడుదల మార్చు

ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబరులో దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కావలసివుంది. రాఘవేంద్రరావుకి అనారోగ్యం కారణంగా ఆపరేషన్‌ చేయాల్సిరావడంతో నిర్మాణం అలస్యమై 1984 జనవరి 14న విడుదలైయింది. ఇదేరోజు దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటించిన యుద్ధం సినిమా కూడా విడుదలయింది. ఒక హీరో నటించిన రెండు మల్టీస్టారర్లు ఒకేరోజున విడుదలకావడమన్నది తెలుగు సినీ చరిత్రలో అదే ప్రథమం. ఈ రెండింటిలో ఇద్దరు దొంగలు సినిమా విజయం సాధించింది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
  2. Moviebuff, Movie Songs. "Iddaru Dongalu". www.moviebuff.com. Retrieved 14 August 2020.

ఇతర లంకెలు మార్చు