ఇనుకొండ తిరుమలి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన చరిత్రకారుడు, విశ్రాంత ఆచార్యుడు

ఇనుకొండ తిరుమలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చరిత్రకారుడు,[1][2] ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమకారుడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆచార్యుడు పనిచేసిన తిరుమలి,[3] తెలంగాణ ప్రజా సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[4]

ఇనుకొండ తిరుమలి
జననం
వృత్తివిద్యావేత్త, రచయిత
సుపరిచితుడుతెలంగాణ ఉద్యమం

జననం, విద్యసవరించు

తిరుమలి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పెద్దగోపతి గ్రామంలో జన్మించాడు. తిరుమలి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని చరిత్ర విభాగంలో ఎంఏ పూర్తిచేశాడు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని హిస్టారికల్ స్టడీస్ సెంటర్ నుండి తెలంగాణ వ్యవసాయ సంబంధాలపై ఎంఫిల్, తెలంగాణ రైతాంగ ఉద్యమంపై పిహెచ్‌డి చేశాడు.[5]

వృత్తిరంగంసవరించు

తిరుమలి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల చరిత్ర విభాగంలో 1980 నుండి 30 సంవత్సరాలపాటు ఆచార్యుడిగా పనిచేశాడు.[1] 1984-86, 2001-2003, 2006-2008 మధ్యకాలాల్లో శ్రీ వెంకటేశ్వర కళాశాలలోని చరిత్ర విభాగంలో టీచర్-ఇన్-చార్జ్ గా ఉన్నాడు. తెలంగాణ, తెలంగాణలో భూస్వామ్య విధానంపై పలు పుస్తకాలు రాశాడు.[6]

రాసిన పుస్తకాలుసవరించు

 • తిరగబడ్డ తెలంగాణ (దొరలకు దించాం - నిజాంలను కూల్చాం): తెలంగాణలో ప్రజా ఉద్యమం 1939-1948[7]
 • వివాహం, ప్రేమ, కులం: వలస పాలనాకాలంలో తెలుగు మహిళలపై అవగాహన
 • దక్షిణ భారత ప్రాంతాలు, సంస్కృతులు, సాగాలు
 • అణచివేయబడిన ఉపన్యాసాలు: ప్రొఫెసర్ సభ్యసాచి భట్టాచార్య గౌరవార్థం వ్యాసాలు

పరిశోధన పత్రాలుసవరించు

 • దొర-గడి: తెలంగాణలో భూస్వామ్య ఆధిపత్య అభివ్యక్తి
 • తెలంగాణాలోని నల్గొండ, వరంగల్ జిల్లాలలో రైతువర్గ వాదనలు, 1930-1946 - ఇండియన్ ఎకనామిక్ అండ్ సోషల్ హిస్టరీ రివ్యూ, 31, నం 2 (1994)

పరిశోధన ఫెలోసవరించు

 • జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, 1976-1980)
 • టీచర్ ఫెలో (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ, 1988-1991)
 • ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్‌లో సీనియర్ ఫెలో (న్యూఢిల్లీ, 1997 మే నుండి 1998 ఏప్రిల్ వరకు)

నిర్వర్తించిన పదవులుసవరించు

 • ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జీవితకాల సభ్యుడు
 • అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ స్కూల్ పాఠ్య రచయిత, హైదరాబాద్, 1994-97
 • ఢిల్లీ విశ్వవిద్యాలయం బి.ఏ (ఆనర్స్) చరిత్ర కోర్సు కమిటీ 1997
 • పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ సభ్యుడు, హైదరాబాద్
 • తెలంగాణ మేధావుల ఫోరం వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Gadar to release book on Telangana - ANDHRA PRADESH". The Hindu. 2008-01-09. Retrieved 2022-02-28.
 2. "'Aristocrats part of the Freedom Struggle'". Deccan Chronicle. 18 July 2020.
 3. "సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర్య పోరాటం కాదు!". lit.andhrajyothy.com. Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.
 4. "India News, Latest Sports, Bollywood, World, Business & Politics News". The Times of India. Archived from the original on 2012-11-05. Retrieved 2022-02-28.
 5. "Archived copy". svc.ac.in. Archived from the original on 22 May 2011. Retrieved 2022-02-28.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 6. (February 29, 1992). "Dora and Gadi: Manifestation of Landlord Domination in Telengana".
 7. "Tiragabadda Telangana - తిరగబడ్డ తెలంగాణ by Inukonda Tirumali - Tiragabadda Telangana". http://www.anandbooks.com/ (in ఇంగ్లీష్). Retrieved 2022-02-28. {{cite web}}: External link in |website= (help)

బయటి లింకులుసవరించు