ఇనుకొండ రామా రెడ్డి
ఇనుకొండ రామా రెడ్డి (ERR) ఒక విశ్వవిద్యాలయ గ్రంథాలయాధికారి, తాను పని చేస్తున్న విశ్వవిద్యాలయ గ్రంథాలయం లో యాంత్రీకరణ (ఆటోమేషన్), డిజిటైజషన్ వంటి అధునాతన ప్రక్రియలకు శ్రీ కారం చుట్టి, భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశ గ్రంథాలయ విధులు, వనరులు, సేవల దృక్కోణాన్ని మార్చారు.
రామా రెడ్డి 1943 మే 5న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మల్లాపూర్ గ్రామం లో జన్మించారు. 1966 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్రంలో డిప్లొమా, ఎం.ఏ. తరువాత ధార్వాడ్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎల్.ఎస్.సి ఇంకా పి.హెచ్.డి చేశారు. రామా రెడ్డి కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతూ తన 81వ ఏట 30.1.2024 న మరణించారు. అతని భార్య ఊర్మిళా రెడ్డి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం లో ఉన్నత పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసారు. ఇద్దరు కుమారులు ఉన్నారు.[1]
గ్రంథాలయ వృత్తి
మార్చుప్రారంభంలో 1966 నుంచి 1970 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో గ్రంథపాలకుడిగా, 1970 నుంచి 1978 వరకు 9 సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం లో సహాయకులు (లైబ్రరీ అసిస్టెంట్)గా పనిచేశారు. 1978 జనవరి నుంచి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయం లో సహాయ గ్రంథాలయాధికారి గా చేరి, ఉపగ్రంధాలయాధికారిగా గ్రంధాలయాధికారి గా పదవోన్నతులు పొంది 2006 జనవరిలో పదవీ విరమణ చేసారు.[2]
2007 నుంచి 2012 వరకు మహాశాఖరం విశ్వవిద్యాలయం, ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, థాయిలాండ్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసారు. 2012 నుంచి 2015 వరకు సెంటర్ ఫర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ముంబై సంస్థకి విజిటింగ్ ఫ్యాకల్టీ గా ఉన్నారు. 2014 - 2016 మధ్య సెంట్రల్ లైబ్రరీ, శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్ కు సలహాదారుగా వ్యవహరించారు. పలు కమిటీలలో సభ్యులు గా ఉన్నాడు.
- 1998 RAC DRDO, న్యూఢిల్లీ - ఎక్స్పర్ట్ సభ్యుడు
- 1999 UGC IX ప్లాన్ విజిటింగ్ కమిటీ -సభ్యుడు
- 2000 UGC CDC లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ -సభ్యుడు
- 2001 సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీల సమీక్ష - సభ్యుడు, నిపుణుల కమిటీ
- 2002 నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ - సభ్యుడు, వర్కింగ్ గ్రూప్, నేషనల్ వర్చువల్ గ్రంధాలయం
- 2005 లో నేషనల్ నాలెడ్జ్ కమిషన్ - లైబ్రరీలపై సబ్-గ్రూప్ సభ్యుడు
రామా రెడ్డి కి, తెలంగాణ గ్రంథాలయ సంఘం (TSLA ); థాయ్ లైబ్రరీ అసోసియేషన్; సొసైటీ ఫర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (SIS) ; అకాడమీ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ డాక్యుమెంటేషన్ (ALSD) ; ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ (ILA ) వంటి గ్రంథాలయ సంఘాలలో సభ్యత్వం ఉంది.[3]
ముంబైలోని ఎస్.ఎన్.డి.టి మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ హిల్ విశ్వవిద్యాలయం, కర్ణాటక విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల గ్రంథాలయ శాస్త్ర విభాగాల పాఠ్యప్రణాళికా మండలుల సభ్యుడిగా కొనసాగారు. డా. బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి డిజిటల్ గ్రంథాలయాల పాఠ్యగ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. మహాశాఖరం విశ్వవిద్యాలయం (థాయ్‌లాండ్) ఇన్ఫర్మాటిక్ శాఖతో, ఉస్మానియా గ్రంథాలయ శాఖ అవగాహన పత్రాలపై సంతకాలు చేయడంలో ఆయన కీలక పాత్ర నిర్వహించారు.[1]
గ్రంథాలయాల ఆధునీకరణ
మార్చు1989 లో విశ్వవిద్యాలయం లోనే మొదటి కంప్యూటర్ ను ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయానికి ఏర్పాటు చేసి ఆటోమేషన్ మొదలు పెట్టారు. క్రమంగా గ్రంథాలయ సాఫ్ట్వేర్ లనుపయోగించి పుస్తకాల డేటాబేస్ ను రూపొందించి, వివిధ కార్యక్రమాలను యాంత్రీకరించారు. ఇతర గ్రంథాలయాలకు టర్న్ కీ ప్రాజెక్ట్ లను నిర్వహించారు,
OCLC (USA ) వారి కౌన్సిల్ భారతదేశ విశ్వవిద్యాలయాల తరపున ఎంపిక అయి, సభ్యత్వం తీసుకొని తెలుగు, ఉర్దూ ప్రచురణల సమాచారాన్ని (మెటాడేటా) ను వరల్డ్ కాట్ (Worldcat) లోకి అప్లోడ్ చేసి OCLC సభ్యత్వ భారం విశ్వవిద్యాలయం మీద .లేకుండా చేసారు.
గ్రంథాలయ సిబ్బంది కి ఆటోమేషన్ నెట్వర్కింగ్ లో శిక్షణ ఇవ్వడం కొరకు ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం తరపున PGDLAN అను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ అను అధ్యయనాలను , హైదరాబాద్ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం సహకారం తో ఆరంభించారు.
'యూనివర్సల్ డిజిటల్ లైబ్రరీ (UDL)', 'డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా' వారి సౌజన్యంతో డిజిటైజషన్ కార్యక్రమాలు చేసారు. [1]
పురస్కారాలు
మార్చు- 2003 ఉత్తమ లైబ్రేరియన్ - ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్
- 2004 నేషనల్ లైబ్రేరియన్ - సత్కల్ ట్రస్ట్, చండీగఢ్
- 2004 ప్రొ. గంగాధర్ రావు స్మారక పురస్కారం. పి.ఎస్. తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్
- 2015 అయ్యెంకి వెంకట రమణయ్య స్మారక పురస్కారం - P.S.తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి, [3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 భారతి, కందిమళ్ల (20 February 2024). "గ్రంథాలయ డిజిటలీకరణ వైతాళికుడు". ఆంధ్ర జ్యోతి.
- ↑ "Dr. E Rama Reddy passes away". UoH Herald. University of Hyderabad. 2 February 2024. Retrieved 20 February 2024.
- ↑ 3.0 3.1 "Vidwan | Profile Page". vidwan.inflibnet.ac.in. Retrieved 2024-02-20.