ఇన్నర్ రింగు రోడ్డు (గుంటూరు)
(ఇన్నర్ రింగు రోడ్డు, గుంటూరు నుండి దారిమార్పు చెందింది)
అంతర వలయ రోడ్డు, (అధికారికంగా: మహాత్మా మహాత్మా గాంధీ అంతర వలయ రోడ్డు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరానికి చెందిన ఒక అంతర్గత రహదారి. ఈ రహదారి విస్తరించి ఉన్నపొడవు 6.34 కి.మీ. (3.94 మై.), నిర్మాణ వ్యయం 29.08 కోట్లు. అప్పటి విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ) వారు ఈ ప్రాజెక్టుని రెండు దశల్లో మొదలుపెట్టారు.[1]
అంతర వలయ రహదారి | |
---|---|
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ గుంటూరు నగర పాలక సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ | |
పొడవు | 6.34 కి.మీ. (3.94 మై.) |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రహదారి వ్యవస్థ | |
State Highways in |
మార్గం
మార్చుఈ రింగ్ రోడ్డు మార్గం, నగరములోని ఆటోనగర్ ప్రాంతం వద్ద జాతీయ రహదారి 5 నుండి ప్రారంభమై నగరాన్ని చుట్టి అంకిరెడ్డిపాలెం వద్ద అదే జాతీయ రహదారి వద్ద ముగుస్తుంది. నగరంలోని అగతవరప్పాడు, గోరంట్ల, జె.కె.సి కళాశాల రోడ్, పెదపలకలూరు, తురకపాలెం, నల్లపాడు ప్రాంతాల్లో నుండి వెళ్తుంది.[2][3]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "AP CM inaugurates phase I & II of Guntur inner ring road". Business Standard. Hyderabad. 16 February 2014. Retrieved 3 March 2016.
- ↑ "Guntur Inner Ring Road Inaugurated by Kiran". The New Indian Express. 17 February 2014. Retrieved 3 March 2016.[permanent dead link]
- ↑ "VUDA gives nod for phase 3, 4 of IRR". The Hindu (in Indian English). 2013-11-10. ISSN 0971-751X. Retrieved 2016-05-17.