ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ లిమిటెడ్ భారతదేశానికి చెందిన ఒక బహుళజాతి సాంకేతిక సంస్థ. ఇది బిజినెస్ కన్సల్టింగ్, సమాచార సాంకేతికత, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో సేవలు అందిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం, కర్ణాటకలోని బెంగుళూరులో ఉంది.[6] 2020 ఆర్థిక ఫలితాల ప్రకారం ఇన్ఫోసిస్ భారత దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత రెండవ అతిపెద్ద సాంకేతిక సంస్థ. ఫోర్బ్స్ గ్లోబల్ 200 ర్యాంకుల ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీల్లో 602 వ స్థానంలో ఉంది.[7] డిసెంబరు 31, 2020 నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ 71.91 బిలియన్ డాలర్లు.[8]
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | INE009A01021 |
పరిశ్రమ | ఐటి సేవలు, ఐటి కన్సల్టింగ్ |
స్థాపన | 7 July 1981 |
స్థాపకుడు |
|
ప్రధాన కార్యాలయం | బెంగళూరు, కర్ణాటక , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తం |
కీలక వ్యక్తులు | నందన్ నిలేకని (ఛైర్మన్) సలీల్ పరేఖ్ (మేనేజింగ్ డైరెక్టర్) & సి ఇ ఓ)[1] |
సేవలు |
|
రెవెన్యూ | ₹93,594 crore (US$12 billion)[2] (2020) |
₹22,007 crore (US$2.8 billion)[2] (2020) | |
₹16,649 crore (US$2.1 billion)[2] (2020) | |
Total assets | ₹92,768 crore (US$12 billion)[3] (2020) |
Total equity | ₹65,450 crore (US$8.2 billion)[3] (2020) |
ఉద్యోగుల సంఖ్య | 242,371 (మార్చి 2020)[4][5] |
విభాగాలు |
|
వెబ్‌సైట్ | www |
Footnotes / references [4] |
చరిత్ర
మార్చుఇన్ఫోసిస్ సంస్థను ఏడు మంది ఇంజనీర్లు కలిసి, మహారాష్ట్ర లోని పూణే లో 250 డాలర్ల పెట్టుబడితో 1981లో ప్రారంభించారు. ఇది మొదట్లో ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో 1981 జులై 2న నమోదయింది. [9] 1983 లో ఈ సంస్థ కర్ణాటకలోని బెంగుళూరుకు మారింది. 1992 ఏప్రిల్ లో ఈ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుని అదే సంవత్సరంలో పబ్లిక్ కు వెళ్ళి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మారింది. 2011 జూన్ నాటికి ఇన్ఫోసిస్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది.[10]
ఉత్పత్తులు, సేవలు
మార్చుఇన్ఫోసిస్ ఆర్థిక, బీమా, తయారీ రంగాల్లో ఉన్న సంస్థలకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, నిర్వహణ సేవలను అందిస్తుంది.[11]
ఇన్ఫోసిస్ వారి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో చెప్పుకోదగ్గది ఫినకిల్. ఇది ఒక సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్. ఇందులో రీటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్ కి అవసరమైన మాడ్యూళ్ళు ఉన్నాయి.[12]
ఉద్యోగులు
మార్చు2019 డిసెంబరు నాటికి ఇన్ఫోసిస్ లో మొత్తం 2,43,454 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 37.8 శాతం మహిళలున్నారు.[13] మొత్తం ఉద్యోగుల్లో 2,29, 658 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులున్నారు.[13] మిగతా 13,796 మంది సపోర్ట్, సేవల రంగంలో ఉన్నారు. 2016 లో ఈ సంస్థ ఉద్యోగుల్లో 89% మంది భారతదేశంలోనే ఉన్నారు.[14]
మూలాలు
మార్చు- ↑ "Infosys appoints Salil S. Parekh as CEO and Managing Director". Archived from the original on 2 December 2017. Retrieved 2 December 2017.
- ↑ 2.0 2.1 2.2 "Infosys Consolidated Profit & Loss account, Infosys Financial Statement & Accounts". moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 14 July 2020.
- ↑ 3.0 3.1 "Infosys Consolidated Balance Sheet, Infosys Financial Statement & Accounts". moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 14 July 2020.
- ↑ 4.0 4.1 "Results for the Fourth Quarter and Year ended March 31, 2020" (PDF). Infosys Ltd. Archived (PDF) from the original on 13 April 2019. Retrieved 13 April 2018.
- ↑ Mandavia, Megha (12 June 2020). "Infosys shrinks top management, grows number of lower-level positions". The Economic Times.
- ↑ "Infosys Overview". Infosys. Retrieved 28 February 2021.
- ↑ "Forbes 2020 Global 2000". Forbes. Retrieved 28 February 2021.
- ↑ "Infosys Market Cap (INFY) – YCharts". Ycharts.com. Retrieved 28 February 2021.
- ↑ "Company History of Infosys". Moneycontrol.com. Archived from the original on 7 October 2017. Retrieved 7 October 2017.
- ↑ "About Infosys". Infosys. Archived from the original on 27 September 2013. Retrieved 23 September 2013.
- ↑ "Infosys realigns organisation structure". The Financial Express. 16 February 2015. Archived from the original on 19 February 2015. Retrieved 4 March 2015.
- ↑ "Core Banking Systems – Gartner Says The Debate Has Shifted". Gartner. 26 November 2014. Archived from the original on 29 July 2017. Retrieved 1 September 2017.
- ↑ 13.0 13.1 "Investor Sheet". infosys.com. Archived from the original on 5 August 2019. Retrieved 5 August 2019.
- ↑ "Infosys Annual Report 2018-19" (PDF). Infosys.com. Archived (PDF) from the original on 5 August 2019. Retrieved 5 August 2019.