ఇన్శాట్-1B ఉపగ్రహం

ఇన్శాట్-1B (INSAT-1B) భారతదేశపు సమాచార ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని ఇండియన్ నేషనల్ శాటలైట్ సిస్టం ద్వారా జరుపుతున్న జరుపుతున్న ఉపగ్రహల ప్రయోగంలో భాగంగా అంతరిక్షములో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని 30ఆగస్టు 1983న 06:32:00 ( UTCసమయం) కు భూస్థిరకక్ష్యలో,74 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టారు.[3] ఈ ఉపగ్రహం ముందుగా నిర్ణయించిన విధంగా 7 సంవత్సరాలు సేవలు అందించిన తరువాత, దీని స్థానంలో INSAT-D ఉపగ్రహాన్ని ప్రయోగించి, దీనిని పక్కనిరర్ధక కక్ష్యలో పెట్టారు.ఈ ఉపగ్రహాన్ని తిరిగి 1992లో 92 డిగ్రీల అక్షాంశంలో గుర్తించారు.దీనిని ఆగస్టు 1993లో నిరర్ధకం చేసారు.[3]

ఇన్శాట్-1B
INSAT-1B before launch
మిషన్ రకంCommunications
ఆపరేటర్ఇస్రో
COSPAR ID1983-089B Edit this at Wikidata
SATCAT no.14318
మిషన్ వ్యవధి7 years
అంతరిక్ష నౌక లక్షణాలు
అంతరిక్ష నౌక రకంINSAT-1
తయారీదారుడుFord Aerospace
లాంచ్ ద్రవ్యరాశి1,152 కిలోగ్రాములు (2,540 పౌ.)
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ30 August 1983, 06:32:00 UTC[1]
రాకెట్Space Shuttle Challenger
STS-8 / PAM-D
లాంచ్ సైట్Kennedy LC-39A
కాంట్రాక్టర్NASA
మోహరించిన తేదీ31 August 1983, 07:48 (1983-08-31UTC07:48Z) UTC
మిషన్ ముగింపు
పారవేయడంDecommissioned
డియాక్టివేట్ చేయబడిందిAugust 1993 (1993-09)
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° east (1983-92)
93° east (1992-93)
సెమీ మేజర్ ఆక్సిస్42,164.88 కిలోమీటర్లు (26,200.04 మై.)
విపరీతత్వం0.0012393
Perigee altitude35,741 కిలోమీటర్లు (22,208 మై.)
Apogee altitude35,846 కిలోమీటర్లు (22,274 మై.)
వాలు14.69 degrees
వ్యవధి23.93 hours
ఎపోచ్14 November 2013, 15:52:38 UTC[2]
 

ఉపగ్రహ వివరాలు

మార్చు

ఈ ఉపగ్రహాన్నిఫోర్డ్ ఏరోస్పేస్‌వారు నిర్మించారు. ఈ ఉపగ్రహనిర్వహణ బాధ్యత ఇస్రోవారిది.INSAT-1శ్రేణి వరుస ఉపగ్రహాలనిర్మాణంలో భాగంగా INSAT-1B ఉపగ్రహం నిర్మింపబడి, ప్రయోగింప బడింది.ప్రయోగ సమయంలో ఉపగ్రహం బరువు 152 కిలోగ్రాములు (2,540 పౌండ్లు) ఉపగ్రహ జీవితకాలం 7 సంవత్సరాలు.INSAT-1B ఉపగ్రహంలో పండ్రెండు C-band ట్రాన్స్‌పాండరులను, మూడు S-band ట్రాన్స్‌పాండరులను అమర్చారు.విద్యుతు ఉత్పత్తికై ఒక సౌరఫలకను అమర్చారు. ఉపగ్రహం యొక్క అసౌష్టవనిర్మాణం వలన ఏర్పడు రేడియేసన్ టార్క్యును కౌంటరు బాలెన్సు చెయ్యుటకు ఇక స్థిరీకరణ బూమ్‌ను ఏర్పాటు చేసారు.[4] ఉపగ్రహ చోదకానికై ఒక R-4D-11 అపోజీ మోటరును అమర్చారు. ఈ ఉపగ్రహన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన తరువాత, భూస్థిరకక్ష్యలో, నిర్దిష్ట కక్ష్యలోకి వెళ్ళుటకు స్వంతచోదక వ్యవస్థను (own propulsion system) కలిగిఉన్నది.

ఉపగ్రహ ప్రయోగం

మార్చు

ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌షటిల్ చాలెంజరు (STS మిసను ప్రయోగసందర్భంగా) ద్వారా అంతరిక్షముకి పంపారు.సెటిల్ చాలెంజరు 30 ఆగస్టు 1983, 07:48 (UTC) గంటలకు కెన్నడి అంతరిక్షకేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్39A నుండి అంతరిక్షములోకి పంపబడినది[5].31ఆగస్టు,1983, 07:48 (UTC) గంటలకు కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించింది. ఈ ఉపగ్రహం భూస్థిరకక్ష్యలో, నిర్దిష్ట కక్ష్యలోకి వెళ్ళుటకు స్వంతచోదక వ్యవస్థను (own propulsion system) కలిగిఉన్నది.ఉపగ్రహం యొక్క అంతర్జాతీయడేసిగ్నటరు సంఖ్య1983-089B, జాబితా సంఖ్య14318.[6]

ప్రయోగానంతర పరిణామాలు

మార్చు

ప్రయోగానంతరం సౌరపలకాలను విచ్చుకొనేలా చెయ్యడంలో సమస్య ఎదురైనప్పటికి1983, సెప్టెంబరునెల మద్యకాలంలో సౌరపలకను తెరచుకొనేలా చెయ్యగలిగారు.[5] 1992లో 93°రేఖాంశం లోకి ఉపగ్రహాన్ని పంపేవరకు, ఈ ఉపగ్రహం అత్యధిక జీవితకాలం 74° డిగ్రీల రేఖాంశంమీద ప్రదక్షిణచేసింది.ఆగస్టు 1993లో ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించడం నిలిపివేసి, భూసమస్థితి కక్ష్యకు పైనున్న నిరర్ధకకక్ష్య (graveyard orbit) లో ఈ ఉపగ్రహాన్ని ఉంచారు. అంతరిక్షములో14 నవంబరు 2013నాటికి, ఈ ఉపగ్రహం నిరర్ధకకక్ష్యలో 35,741 కిలోమీటర్ల పెరిజీ,35,846కిలోమీటర్లఅపోజీతో 14.69డిగ్రీల ఏటవాలుతో23.93 గంటల ప్రదక్షిణకాలంతో తిరుగుచుఉండినది.

మూలాలు

మార్చు
  1. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 16 November 2013.
  2. "INSAT 1B Satellite details 1983-089B NORAD 14318". N2YO. 14 November 2013. Retrieved 16 November 2013.
  3. 3.0 3.1 Krebs, Gunter. "Insat 1A, 1B, 1C, 1D". Gunter's Space Page. Retrieved 16 November 2013.
  4. Harland, David M; Lorenz, Ralph D. (2005). Space Systems Failures (2006 ed.). Chichester: Springer-Praxis. pp. 302–3. ISBN 0-387-21519-0.
  5. 5.0 5.1 "INSAT-1B". isro.gov.in. Archived from the original on 2022-09-28. Retrieved 2015-09-07.
  6. McDowell, Jonathan. "Satellite Catalog". Jonathan's Space Page. Retrieved 16 November 2013.