<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30 31
2020


ఆగష్టు (August), సంవత్సరములో ఎనిమిదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి. భూమి దక్షిణార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిభ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి.

మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలిస్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగములో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో మార్చి సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. మొత్తం నెలలు పదే ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౭౦౦ నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౪౫వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు ౩౧ రోజులు వచ్చాయి. క్రీస్తు పూర్వం ౮వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు&oldid=2951025" నుండి వెలికితీశారు