ఇబ్రహీం జద్రాన్

జద్రాన్ (జననం 2001 డిసెంబరు 12) ఆఫ్ఘన్ క్రికెటరు. అతను 2019 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం టెస్టుల్లో అడుగుపెట్టాడు.[2]

ఇబ్రహీం జద్రాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2001-12-12) 2001 డిసెంబరు 12 (వయసు 22)
ఖోస్త్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 15)2019 సెప్టెంబరు 5 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2023 జూన్ 14 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 48)2019 నవంబరు 11 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 5 September 2023 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 41)2019 నవంబరు 14 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 మార్చి 27 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–presentMis Ainak నైట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 5 18 24 19
చేసిన పరుగులు 362 904 530 1162
బ్యాటింగు సగటు 36.20 56.5 26.50 38.73
100లు/50లు 0/3 4/4 0/2 2/7
అత్యుత్తమ స్కోరు 87 162 64* 105
వేసిన బంతులు 12 150
వికెట్లు 1 3
బౌలింగు సగటు 13.00 24.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/13 1/13
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 3/– 6/– 25/–
మూలం: Cricinfo, 7 June 2023

దేశీయ కెరీర్

మార్చు

అతను 2017 ఆగస్టు 11న 2017 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో మిస్ ఐనాక్ రీజియన్ కోసం లిస్టు ఎ క్రికెట్‌లో ప్రవేశించాడు. [3] 2017 సెప్టెంబరు 12న 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో మిస్ ఐనాక్ నైట్స్ కోసం ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు [4]

2018 సెప్టెంబరులో, అతను ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నంగర్హర్ జట్టులో ఎంపికయ్యాడు. [5]

2021లో ఇబ్రహీం, బెర్క్‌షైర్‌లోని బోయిన్ హిల్ తరపున ఆడాడు. ఓపెనర్‌గా ఆడుతూ, 15 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేశాడు. [6]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

డిసెంబరు 2018లో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క అండర్-23 జట్టులో ఎంపికయ్యాడు. [7]

డిసెంబరు 2017లో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [8] అతను 186 పరుగులతో టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [9]

2019 ఆగష్టులో ఇబ్రహీం, బంగ్లాదేశ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [10] [11] 2019 సెప్టెంబరు 5న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన రంగప్రవేశం చేశాడు [12] మరుసటి నెలలో, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [13] అతను 2019 నవంబరు 11న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) ఆడాడు.[14] 2019 నవంబరు 14న వెస్టిండీస్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున T20I ల్లో రంగప్రవేశం చేసాడు. [15]

2019 డిసెంబరులో, అతను 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [16] అతను ఐదు మ్యాచ్‌ల్లో 240 పరుగులతో టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [17] 2022 జూన్‌లో, జింబాబ్వేతో జరిగిన రెండవ మ్యాచ్‌లో జద్రాన్, 120 పరుగులతో అజేయంగా వన్‌డే క్రికెట్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు. [18] 2022 నవంబరులో, అతను తన రెండవ వన్‌డే సెంచరీ (106), శ్రీలంకపై పల్లెకెల్లెలో చేశాడు. [19] ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అదే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో, 162 పరుగులు చేసి, ఈ ఫార్మాట్‌లో తన దేశానికి చెందిన ఆటగాడి అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. [20] అతను 92.66 సగటుతో 278 పరుగులతో సిరీస్‌ను ముగించి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. [21]

ఆరు నెలల తర్వాత, 2023 జూన్‌లో ఇబ్రహీం, 2023 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై 98 పరుగులు చేసి, హంబన్‌తోటలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. [22] శ్రీలంకలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను 106, 10, 162, 98 పరుగులు చేశాడు.

మూలాలు

మార్చు
  1. "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
  2. "Ibrahim Zadran". ESPN Cricinfo. Retrieved 11 August 2017.
  3. "4th Match, Ghazi Amanullah Khan Regional One Day Tournament at Khost, Aug 11, 2017". ESPN Cricinfo. Retrieved 11 August 2017.
  4. "3rd Match, Shpageeza Cricket League at Kabul, Sep 12 2017". ESPN Cricinfo. Retrieved 12 September 2017.
  5. "Gayle, Afridi, Russell: icons in Afghanistan Premier League". ESPN Cricinfo. Retrieved 11 September 2018.
  6. "Thames Valley Cricket League - Player History". www.tvlcricket.com. Retrieved 2022-11-30.
  7. "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
  8. "Afghanistan Under-19s Squad / Players". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
  9. "ICC Under-19 World Cup, 2017/18 - Afghanistan Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 February 2018.
  10. "Afghanistan squads announced for Bangladesh Test and Triangular Series in September". Afghan Cricket Board. Archived from the original on 20 August 2019. Retrieved 20 August 2019.
  11. "Rashid Khan to lead new-look Afghanistan in Bangladesh Test". ESPN Cricinfo. Retrieved 20 August 2019.
  12. "Only Test, Afghanistan tour of Bangladesh at Chattogram, Sep 5-9 2019". ESPN Cricinfo. Retrieved 5 September 2019.
  13. "Focus on youth as Afghanistan revamp squads for West Indies series". ESPN Cricinfo. Retrieved 25 October 2019.
  14. "3rd ODI (D/N), West Indies tour of India at Lucknow, Nov 11 2019". ESPN Cricinfo. Retrieved 11 November 2019.
  15. "1st T20I (N), West Indies tour of India at Lucknow, Nov 14 2019". ESPN Cricinfo. Retrieved 14 November 2019.
  16. "Afghanistan U19 squad announced for ICC U19 World Cup". Afghanistan Cricket Board. Retrieved 8 December 2019.
  17. "ICC Under-19 World Cup, 2019/20 - Afghanistan Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 February 2020.
  18. "Bowlers, Ibrahim Zadran, Rahmat Shash help Afghanistan seal ODI series". ESPN Cricinfo. Retrieved 6 June 2022.
  19. "Ibrahim, Farooqi, Naib lead Afghanistan to comfortable win". ESPNcricinfo. Retrieved 26 November 2022.
  20. "Ibrahim Zadran breaks record during epic hundred against Sri Lanka". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2022-11-30.
  21. "Afghanistan tour of Sri Lanka 2022/23 Stats". ESPNcricinfo. Retrieved 3 June 2023.
  22. "Ibrahim Zadran, seamers help Afghanistan stroll to a comfortable win". ESPNcricinfo. Retrieved 3 June 2023.