ఇల్ఫోర్డ్ ఫోటో
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఇల్ఫోర్డ్ ఫోటో (ఆంగ్లం: Ilford Photo) యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందిన ఫోటోగ్రఫిక్ పరికరాలను తయారు చేసే సంస్థ. నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ ఫిలిం, ఫోటోగ్రఫిక్ కాగితం వంటి వాటికి ఇల్ఫోర్డ్ పెట్టింది పేరు. ఫోటోగ్రఫీకి సంబంధించిన సమగ్ర సూచికను పూర్వం ఇల్ఫోర్డ్ సంస్థ ప్రచురించింది. ఈ సూచికలో వివిధ రకాల కటకాలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన భౌతిక/రసాయన శాస్త్రాల గురించి చర్చించటంతో పాటు, ఫోటోగ్రఫర్లకు పలు చిట్కాలు/సూచనలు ప్రచురించటం జరిగింది.
పరిశ్రమ | ఫోటోగ్రఫీ |
---|---|
స్థాపన | 1879 |
ప్రధాన కార్యాలయం | నూట్స్ఫోర్డ్, చెషైర్ |
ఉత్పత్తులు | ఫిలిం, ఫోటోగ్రఫిక్ కాగితం, రసాయనాలు |
వెబ్‌సైట్ | www.ilfordphoto.com |
చరిత్ర
మార్చుప్రారంభం
మార్చు1879 లో ఆల్ఫ్రెడ్ హగ్ హర్మాన్ చే బ్రిటానియా వర్క్స్ కంపెనీ గా సంస్థ నెలకొల్పబడింది. మొదట ఫోటోగ్రఫిక్ ప్లేట్లను తయారు చేయటం ప్రారంభించిన సంస్థ, ఇల్ఫోర్డ్ నగరంలో ఒక సువిశాల స్థలం లోకి మార్చబడింది. 1902 లో ఇల్ఫోర్డ్ నగరం పేరునే సంస్థ పేరుగా మార్చబడింది. దీనిపై స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురైననూ అదే పేరుతో కొనసాగింది. 1912 నుండి ఫిలిం చుట్టల తయారీ మొదలైంది. 1928 లో మాబర్లీ రాజర్ ఫ్యాక్టరీని ఇల్ఫోర్డ్ సొంతం చేసుకొంది.