ఇల్లెందు మండలం

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం
(ఇల్లందు మండలం నుండి దారిమార్పు చెందింది)


ఇల్లెందు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 7  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం ఇల్లెందు.

ఇల్లెందు
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, ఇల్లెందు స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, ఇల్లెందు స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, ఇల్లెందు స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం ఇల్లెందు
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 445 km² (171.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 95,394
 - పురుషులు 46,626
 - స్త్రీలు 48,768
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.93%%
 - పురుషులు 68.97%%
 - స్త్రీలు 55.86%%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం ఇల్లెందు మండలం మొత్తం జనాభా 95,394. ఇందులో పురుషులు 46,626 కాగా, స్త్రీలు 48,768. 2011లో ఇల్లెందు మండలంలో మొత్తం 24,563 కుటుంబాలు ఉన్నాయి. మండల సగటు లింగ నిష్పత్తి 1,046. మండల మొత్తం జనాభాలో 36.7% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 63.3% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 79% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 63%. అలాగే మండలంలో పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,060 కాగా గ్రామీణ ప్రాంతాల లింగనిష్పత్తి 1,038. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 9227, ఇది మొత్తం జనాభాలో 10%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 4683 మంది మగ పిల్లలు, 4544 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలం బాలల లింగ నిష్పత్తి 970, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (1,046) కంటే తక్కువ.మొత్తం అక్షరాస్యత రేటు 68.93%. పురుషుల అక్షరాస్యత రేటు 68.97% స్త్రీల అక్షరాస్యత రేటు 55.86%.

పునర్వ్యవస్థీకరణ తరువాత

మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 446 చ.కి.మీ. కాగా, జనాభా 95,394. జనాభాలో పురుషులు 46,626 కాగా, స్త్రీల సంఖ్య 48,768. మండలంలో 24,563 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

మార్చు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లందు (యల్లెందు/Yellandu) మండలాన్ని (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఇల్లెందు
  2. మామిడిగుండాల
  3. చల్ల సముద్రం
  4. రొంపేడ్
  5. కొమరారం
  6. సుదిమల్ల
  7. రఘబొయినగూడెం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 237, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు