ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు సోదరులు, రాక్షసులు. వీరి వృత్తాంతం రామాయణంలోని అరణ్యకాండలో చెప్పబడింది. శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తూ సుతీష్ణుడు అనే ఋషి సాయంతో అగస్త్య మహర్షి ఉండే ఆశ్రమం జాడ కనుగొంటాడు. సీతారామ లక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని వెదుక్కుంటూ వెళితే ఒక పెద్ద బూడిద గుట్ట, ఎముకల గుట్ట కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీత లక్ష్మణులను చూసి అక్కడ పూర్వం జరిగిన వృత్తాంతాన్ని చెబుతాడు.

ఇల్వలుడు వాతాపి నరమాంస భక్షణ మార్చు

ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు. ఇల్వలుడికి మృతసంజీవిని విద్య వచ్చు, వాతాపికి కామరూప విద్య వచ్చు. వీరు నరమాంసం భుజించడం కోసం ఒక ప్రణాళిక వేసుకొనేవారు. వాతాపి కామారూప విద్యతో మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు మార్గమధ్యంలో కనిపించే బ్రాహ్మణులను తన తండ్రి శ్రాద్ధ కర్మకు భోక్తగా రమ్మని వేడుకొనేవాడు. త్రేతా యుగ ఆచారాల ప్రకారం శ్రాద్ధంలో మాంసం పెట్టాలి కాబట్టి మేకగా మారిన వాతాపిని మాంసం కూర చేసి వడ్డించేవాడు. భోజనం అంతా పూర్తి అయ్యేసరికి ఇల్వలుడు తన మృత సంజీవిని విద్య నుపయోగించి వాతాపి పిలిచేవాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చేవాడు. అప్పుడు ఇల్వలుడు వాతాపి కలసి ఆ బ్రాహ్మణుడిని భుజించేవారు.

అగస్త్యుడు భోక్తగా రావడం మార్చు

ఇలా ఉండగా ఒకరోజు అగస్త్యుడు ఆ మార్గంలో వెళ్తుండడం చూసి ఇల్వలుడు తన తండ్రి ఆబ్ధికం ఉందని, అగస్త్యుడిని భోక్తగా రమ్మంటాడు. త్రికాల వేది అయిన అగస్త్యుడు విషయాన్ని పసి గట్టి సరే అని ఒప్పు కొంటాడు. యధాప్రకారం వాతాపిని మాంసం కూరగా చేసి వడ్డిస్తాడు, అగస్త్యుడి ఉత్తరోపాసన అయ్యాక ఇల్వలుడూ తన మృతసంజీవిని విద్య ఉపయోగించి వాతాపి రా అంటాడు. అప్పటికే అగస్త్యుడు తన తపోశక్తి నుపయోగించి జీర్ణం, వాతాపి జీర్ణం అని వాతాపిని పూర్తిగా జీర్ణం చేసేసుకొంటాడు. అప్పుడు ఇల్వలుడితో వాతాపి జీర్ణం అయ్యి పోయాడు అని చెప్పగా ఇల్వవుడు కోపంతో క్రూరమైన రాక్షస రూపాన్ని పొంది అగస్త్యుడి మీదకు వస్తుంటే అగస్త్యుడు ఒక హూంకారంతో అలా మీదకు వస్తున్న ఇల్వలుడిని తపో శక్తితో ఉగ్రంగా చూస్తే ఇల్వలుడు భస్మం అయిపోతాడు.

ప్రాచుర్యంలో వాతాపి మార్చు

ఆవిధంగా వాతాపిని జీర్ణం చేసుకోవడానికి అగస్త్యుడు వాడిన పదాన్ని చంటి పిల్లలు జీర్ణం కావడానికి కష్టం ఉన్న పదార్థం తిన్నప్పుడు పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. (వాతాపి లాంటి వాడే జీర్ణం అయ్యి నప్పుడు ఈ పదార్థం జీర్ణం అవ్వడం ఏమంత కష్టం కాదు అని అర్థం)

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇల్వలుడు&oldid=3875742" నుండి వెలికితీశారు