అలీనా షాజీ (జననం 2000 ఫిబ్రవరి 25) ఇవానాగా ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ భాషా చిత్రాలలో పని చేస్తుంది.[1] అయితే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించిన తమిళ సినిమా లవ్ టుడే 2022 నవంబరు 25న తెలుగులోను విడుదల కానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గర కానుంది.[2] 2018లోనే తమిళ డబ్బింగ్ చిత్రం ఝాన్సీతో తెలుగులో పరిచయం అయింది.

ఇవానా
జననం
అలీనా షాజీ

(2000-02-25) 2000 ఫిబ్రవరి 25 (వయసు 24)
కేరళ, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

కెరీర్

మార్చు

అలీనా షాజీ మాస్టర్స్ (2012)లో మలయాళ చిత్ర పరిశ్రమలో బాలనటిగా తన వృత్తిని ప్రారంభించింది. సహాయ నటిగా రాణి పద్మిని (2015)లో ఆలరించింది. అనురాగ కరికిన్ వెల్లం (2016)లో ప్రధాన పాత్రకు కుమార్తెగా కీలక పాత్ర పోషించింది.[3]

దీంతో దర్శకుడు బాలా తన తమిళ చిత్రం నాచియార్ (2018)లో జ్యోతిక, జి. వి. ప్రకాష్ కుమార్‌లతో కీలక పాత్రల్లో నటించేందుకు అలీనా షాజీని ఎంచుకున్నాడు. ఈ చిత్రం ఝాన్సీగా తెలుగులో డబ్ చేసారు కూడా.

అలీనా షాజీ తమిళ ప్రేక్షకులకు ఉచ్చరించడానికి సులువుగా తన పేరును ఇవానాగా మార్చుకుంది.[4]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర విషయాలు
2012 మాస్టర్స్ మలయాళం గుర్తింపు లేని పాత్రలు
2015 రాణి పద్మిని మలయాళం
2016 అనురాగ కరికిన్ వెల్లం అను రఘు మలయాళం
2018 నాచియార్ అరసి తమిళం
2019 హీరో మతి తమిళం
2022 లవ్ టుడే నికిత తమిళం
2023 ఎల్‌జీఎం
2023 సెల్ఫిష్ చైత్ర తెలుగు తెలుగులో మొదటి సినిమా[5]

అవార్డులు, నామినేషన్లు

మార్చు
Year Award Category Film Result Ref(s)
2019 8వ SIIMA అవార్డులు ఉత్తమ అరంగేట్రం నాచియార్ నామినేట్ చేయబడింది [6]
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి నామినేట్ చేయబడింది [7]

మూలాలు

మార్చు
  1. "Ivana aka Aleena Shaji Latest News & Updates". Mokka Postu.com. Retrieved 2020-05-20.
  2. "ఈ సినిమాకి ప్రేక్షకులే హీరోలు." web.archive.org. 2022-11-20. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Anuraga Karikkin Vellam review". Reelistic Views (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-18. Archived from the original on 2018-02-23. Retrieved 2018-02-22.
  4. Tamil The Hindu (2018-02-21), 'Jyothika helped me to cry' : 'Nachiyaar' Ivana Interview | Tamil The Hindu, retrieved 2018-02-22
  5. A. B. P. Desam (22 April 2023). "తెలుగులో బుజ్జి కన్నా - నిర్మాత తనయుడితో 'లవ్ టుడే' హీరోయిన్". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
  6. "SIIMA AWARDS | 2018 | winners | |". SIIMA. Archived from the original on 2020-06-04. Retrieved 2022-11-20.
  7. "SIIMA AWARDS | 2018 | winners | |". SIIMA. Archived from the original on 2020-06-04. Retrieved 2022-11-20.