ఝాన్సీ 2018లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2018లో నాచియార్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో డబ్బింగ్ చేసి ఆగస్టు 17న విడుదల చేశారు. కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్‌లపై కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు బాల దర్శకత్వం వహించగా జ్యోతిక, జీవి ప్రకాష్‌ కుమార్‌, ఇవానా, రాక్‌లైన్‌ వెంకటేష్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.[2]

ఝాన్సీ
దర్శకత్వంబాలా
నిర్మాతకోనేరు కల్పన
తారాగణంజ్యోతిక, జీవి ప్రకాష్‌ కుమార్‌, ఇవానా, రాక్‌లైన్‌ వెంకటేష్‌
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
సంగీతంఇళయరాజా
విడుదల తేదీ
17 ఆగష్టు 2018 [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సిన్సియర్‌ పోలీస్ ఆఫీసర్ అయిన ఝాన్సీ (జ్యోతిక) ఓ మైనర్ అయిన రాశి (ఇవానా) రేప్ కేసును టెక్ అప్ చేస్తుంది. ఆ కేసులో రాశి ప్రియుడు గాలి రాజు (జీ వి ప్రకాష్) ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతుంది. ఝాన్సీ మైనర్ రేప్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఝాన్సీకి ఎన్నో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చివరికీ ఈ కేసు మిస్టరీని ఝాన్సీ ఎలా ఛేదించి నిందుతుడికి ఎలాంటి శిక్ష వేసింది అనేది మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

  • జ్యోతిక [4]
  • జీవి ప్రకాష్‌ కుమార్‌
  • ఇవానా
  • రాక్‌లైన్‌ వెంకటేష్‌
  • డా. గురుశంకర్
  • తంగమణి ప్రభు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్
  • నిర్మాత: కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాలా
  • సంగీతం: ఇళయరాజా
  • సినిమాటోగ్రఫీ:తేని ఈశ్వర్
  • కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి

మూలాలు మార్చు

  1. Sakshi (12 August 2018). "ఆగష్టు 17న వస్తున్న జ్యోతిక 'ఝాన్సీ'". Sakshi. Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.
  2. "Jyothika in Bala's film". Deccanchronicle.com. Retrieved 2017-04-22.
  3. Sakshi (17 August 2018). "'ఝాన్సీ‌' మూవీ రివ్యూ". Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 28 August 2021.
  4. Sakshi (14 July 2018). "ఝాన్సీగా జ్యోతిక". Archived from the original on 14 జూలై 2018. Retrieved 28 August 2021.