ఇషా తల్వార్ (జననం 22 డిసెంబరు 1987) ప్రముఖ భారతీయ నటి. ఎక్కువగా మళయాళ భాషా చిత్రాల్లో నటించారు ఆమె. ఎన్నో యాడ్ లలో మోడల్  గా కెరీర్ ప్రారంభించిన ఇషా 2012లో మళయాళ చిత్రం  తట్టతిన్ మరయతుతో తెరంగేట్రం చేశారు.

ఇషా తల్వార్
Isha Talwar 60th Filmfare Awards South (cropped).jpg
60 వ ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది పురస్కార ఉత్సవంలో ఇషా, 2013
జననం (1987-12-22) 1987 డిసెంబరు 22 (వయసు 35)[1]
ముంబై
విద్యాసంస్థసెయింట్ జేవియర్ కాలేజి, ముంబై
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012 నుండి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మీర్జాపూర్ (టీవీ సీరియల్)
తల్లిదండ్రులువినోద్ తల్వార్ (తండ్రి)
సిమన్ తల్వార్ (తల్లి)

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసంసవరించు

దర్శక, నిర్మాత వినోద్ తల్వార్ కుమార్తె ఇషా. ఆయన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వద్ద పనిచేస్తారు.[2][3] ముంబైలో జన్మించిన ఆమె 2008లో సెయింట్.గ్జావియర్స్ కళాశాలలో చదువుకున్నారు.[4] 2004లో నృత్య దర్శకుడు తెరెన్స్ లెవిస్ నృత్య పాఠశాలలో చేరి, సాల్సా, హిప్ హాప్, బాలెట్, జాజ్ వంటి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆ తరువాత అదే డ్యాన్స్ అకాడమీలో టీచర్ గా కూడా చేరారు.[5]

Referencesసవరించు

  1. "Meet Tubelight Actress Isha Talwar: Age, biography, best HD, hot and HQ photos, Instagram, ads and more". The Indian Express. 28 June 2017. Retrieved 12 December 2017.
  2. Sebastian, Shevlin. "Isha Talwar, about her dream debut in Malayalam". The New Indian Express. Retrieved 2013-04-22.
  3. Zachariah, Ammu. "My dad is a proud man: Isha Talwar". Times of India. Archived from the original on 2014-02-04. Retrieved 22 April 2013.
  4. "St. Xavier's College, Mumbai alumni". The Times of India.
  5. Ammu Zachariah, TNN (2012-09-06). "Terrance changed me completely: Isha Talwar - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2014-02-04. Retrieved 2013-04-22.