రాజా చెయ్యివేస్తే

రాజా చెయ్యివేస్తే 2016 తెలుగు సినిమా.[1] [2][3][4]

రాజా చెయ్యివేస్తే
Theatrical release poster
దర్శకత్వంప్రదీప్ చిలుకూరి
స్క్రీన్ ప్లేప్రదీప్ చిలుకూరి
కథప్రదీప్ చిలుకూరి
నిర్మాతసాయి కొర్రపాటి
తారాగణంనారా రోహిత్
తారకరత్న
ఇషా తల్వార్
ఛాయాగ్రహణంసామల భాస్కర్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
29 ఏప్రిల్ 2016 (2016-04-29)
దేశంభారతదేశం
భాషతెలుగు

విన్సెంట్ మాణిక్ అలియాస్ మాణిక్ (తారకత్న) కరుడుగట్టిన నేరస్థుడు. అతడు చేసిన హత్యలకు ఎలాంటి ఆధారాలు ఉండకుండా చేయడం అతడి ప్రత్యేకత. చూసినవారు కూడా ప్రాణ భయంతో నోరు విప్పరు. దీనికితోడు రాజకీయ అండ ఉండటంతో పోలీసులు కూడా ఇతడ్ని ఏమీ చేయలేకపోతారు. అయితే ఇతడి వల్ల నష్టపోయిన వారు మాత్రం లోలోపలే పగతో రగిలిపోతుంటారు. మరోవైపు ఇంజనీరింగ్ చదివిన రాజారామ్ (రోహిత్) సినిమా దర్శకుడు కావాలని సహాయ దర్శకుడిగా పనిచేస్తూ తన ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రేయసి (ఇషా తల్వార్), ముగ్గురు స్నేహితులతో సరదాగా కాలం గడిపేస్తున్న ఇతడికి మాణిక్‌ని చంపాల్సిందిగా బెదిరిస్తూ ఓ కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ పంపిందెవరు.. రాజారామ్‌కి అతడికి సంబంధమేంటి.. చివరికి రాజారామ్ ఏం చేశాడు..? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా చూడాలి.

రాజారామ్‌గా రోహిత్ ఆకట్టకుంటాడు. స్టైలిష్‌ విలన్‌గా కనపడిన తారకరత్న ఆ పాత్రని అంతగా పండించలేకపోయాడు. సినిమాలో హీరోయిన్ పాత్రే కీలకం. అయితే ఇషా ‘తల్వార్’ పదును రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితమైంది. ఆమె అన్నగా నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఓ పాత్రలో తళుక్కుమన్నారు. సినిమా మొత్తానికి కామెడీ ఏదైనా ఉంది అంటే కారుమంచి రఘు చేసిన ఒకటి రెండు సన్నివేశాలే. శివాజీరాజా, శశాంక్, రవివర్మ తదితర నటులు ఉన్నంతలో తమ పాత్రలను పండించే ప్రయత్నం చేశారు.

నటులు

మార్చు

లింక్యులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nara Rohit's Next Is Raja Cheyyi Vesthe". mirchihub.com. 28 October 2015. Archived from the original on 4 జూన్ 2016. Retrieved 10 November 2015.
  2. "Isha Talwar Romancing Nara Rohit In Their Next". thecourierdaily.com. 9 December 2015. Retrieved 12 December 2015.
  3. "Nandamuri vs Nara on cards". indiaglitz.com. 10 November 2015. Retrieved 11 November 2015.
  4. "Nara Rohit's next gets a title". 123telugu.com. Retrieved 29 October 2015.