బల్లెము

(ఈటె నుండి దారిమార్పు చెందింది)

బల్లెము లేదా ఈటె ఒక విధమైన ఆయుధము. ఇది పొడవుగా ఉండే దండానికి అమర్చి ఉండి చివర మొనదేలి ఉంటుంది. వెదురు ఈటెలలో మొనదేలిన భాగం కూడా వెదురు కర్రనే సూదిగా చేసి ఉంటుంది. ఇది వేట కోసం, యుద్ధాలలో ప్ర్రాచీనకాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. ఇతర కలపతో చేసిన ఈటెలలో చివర భాగం త్రికోణాకారం లేదా పత్రాకారంలో లోహంతో చేయబడి దండానికి బిగించి ఉంటుంది.

మేస వెర్దె జాతీయవనంలోని వేట బల్లెము, ఖడ్గము.
ఓక మొఘల్ సైనికుడు

బల్లెము రాతి యుగం నుండి ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తిగత ఆయుధము. ఇది మానవులు తయారుచేసిన మొట్టమొదటి ఆయుధం. ఇది ఇప్పుడు కూడా వేట కోసం, చేపల్ని పట్టడం కోసం కొన్ని ప్రాంతాలలో ఉపయోగంలో ఉన్నాయి. వేటలో దూరం నుండే జంతువులను చంపి ఆహారంగా ఉపయొగించుకొనేవారు - ప్రాచీన మానవులు. తరువాతి కాలంలో వీటిని యంత్రాల సాయంతో దూరంగా ఉండే శత్రువులను చంపడానికి యుద్ధంలో ఉపయోగించేవారు.

ఆధునిక క్రీడలలో ఒకటైన జావెలిన్ లేదా బల్లెకోల కూడా బల్లెము ఆకారంలోనే ఉండి తేలికగా ఉంటుంది.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బల్లెము&oldid=4270852" నుండి వెలికితీశారు