వెదురు (Bamboo) లేదా గడ అనే మొక్కలు మానవ గృహ అవసరాలు, నిర్మాణాలకు అత్యధికంగా వినియోగించు వృక్షజాతి. వెదురు ఆసియా దేశాలలో ఉష్ణ ప్రదేశాలలో నిటారుగా పెరిగే గడ్డి జాతికి చెందినది. దీనికాండము గుల్లబారి ఒక్కొక్కప్పుడు కర్రను పోలి ఉంటుంది. వెదురులో 75 జాతులు, వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి. పెద్ద రాకాసిరకం వెదురు ముప్పై ఐదు మీటర్ల నుండి పద్దెనిమిది సెంటీమీటర్ల వరకూ లావుగా పెరుగుతుంది. శీతల ప్రదేశములలో పెరిగే వెదురు త్వరగా దట్టమై చిక్కటి అడవిలా మారుతాయి. వెద్రుకు భూమిలో తేమ అవసరం. నీరు లేని చోట్ల వెదురు పెరగదు.

వెదురు
Bamboo forest in Kyoto, Japan
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Supertribe:
Tribe:
Bambuseae

Subtribes

See the full Taxonomy of the Bambuseae.

Diversity
[[Taxonomy of the Bambuseae|Around 91 genera and 1,000 species]]
దిగువమెట్టలో వెదురు ఈనెల బుట్టలు అల్లుచున్న స్త్రీ

భాషా విశేషాలు మార్చు

వెదురు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] వెదురు [ veduru ] veduru. [Tel.] n. The bamboo. పోతు వెదురు the male bamboo. పెంటి వెదురు the female bamboo. కాకి వెదురు a kind of reed. బొంగు వెదురు bongu-veduru. n. The Spring Bamboo of Central, South, and West India. Bambusu arundinacea. (Watts.) వెదరుకంపజిట్ట veduru-kampa-jiṭṭa. n. The bird called the Grass Warbler, or Meadow Wren Warbler, Cisticola cursitans. వెదురు పిచ్చిక veduru-pichchika. n. The bird called the Rose Finch, Loxia totta. వెదరుప్పు, or వెదరు పాలు vedur-uppu. n. A medicinal salt exuded from the bamboo called Bamboo manna (watts.) Tabaschir. (Ainslie.) వెదురు బియ్యము veduru-biyyamu. n. The bamboo seed, freed from the husk. వెదురు బియ్యము. వెదురు మిడుత veduru-miḍuta. n. A sort of insect said to bore the bamboo. క్రిమి విశేషము. వెదురు విల్లు veduru-villu. n. A bow made of the bamboo.

ఉపయోగాలు మార్చు

వెదురు మానవులకు అనేకరకాలుగా ఉపయోగపడుతుంది. ఇళ్ళు కట్టుకొనడానికి, నిచ్చెనలు-బల్లలు-కుర్చీలు-బుట్టలు-తట్టలు-చేటలు మొదలగు ఉపకరణాలకు విశేషంగా వినియోగిస్తున్నారు. కాగితము తయారీలో గుజ్జును తయారు చేయడానికి వెదురు వాడతారు. కొన్ని అడవి జాతులు వెదురు చిగుళ్ళను ఊరగాయ పెట్టుకొంటారు. అటవీ తెగలు వెదురు గింజలతో కల్లు, సారాయిలను తయారు చేస్తారు. ఒక్క రంగు మినహా గోదుమలను పోలిఉండే వెదురు గింజలను దంచి పై పొట్టు తీసి రొట్టెలు తయారు చేస్తారు.

వైద్యాలలో వెదురు.

వైద్య సంభంద కార్యక్రమాలకు వెదురు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెదురు చిగుళ్ళ కషాయం చలువ చేస్తుంది. కఫం, రక్తదోషం, మూలవ్యాధి, మదుమేహం లాంటి వ్యాదులకు పనికి వస్తుంది. స్త్రీలకు గర్భకోశమును శుభ్రము చేయుటకు, ఆకలి పుట్టుటకు దీని కషాయాన్ని ఇస్తారు.

ఆయుర్వేదంలో వెదురు

వెదురు పురాణకాలం నుంచీ మానవునికి అత్యంత చేరువలో ఉండి ఎన్నో విధాలుగా ఉపయోగంలో ఉంది. వైద్యపరంగా వెదురు చాలా ఉపయోగపడు తుంది. దీని లేత చిగుళ్ళతో తయా రు చేసిన కషాయం సేవిస్తూ వుంటే శరీరానికి మంచి చలువ చేస్తుంది. మధు మేహానికీ, కఫం, మూల వ్యాధి నివార ణకి, ఆయు ర్వేదపరంగా ఎంతో ఉప శమనా న్ని ఇస్తుంది. రక్త శుద్ధిని కలిగిస్తుంది. మహిళ లకు గర్భశుద్ధిని కలిగించి గర్భ కోశ వ్యాధులు రాకుండా అరి కడుతుంది. చైనీయులు ఈ వెదురుని అంటువ్యాధులు నిర్మూలించే ఔషధంగా వినియో గిస్తారు. దీనిలో పొటాషియం అత్యంత అల్పంగా ఉంటుంది. వెదురు తీపిదనం కలిగి ప్రొటీనులు, ఆయుర్వేద గుణాలు కలిగివుందంటే చాలామందికి నమ్మసఖ్యంగా ఉండదు. భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో వెదురుని బాన్‌సులోచన్‌ అంటారు. దీనినే తబషిర్‌ అని, తవషిర్‌ అని యునానీ వైద్య విధానాల్లో వినియోగిస్తూవుంటారు. దీనినే ఆంగ్లంలో బాంబూ మన్నా అని వ్యవహరిస్తూ, ఊపిరితిత్తులవ్యాధికి టానికగాే ఉపయోగిస్తున్నారు.

సంగీత వాద్య తయారీలో

ఇక వెదురుతో ఉన్న ఇతర ఉపయోగాలు పరిశీలిస్తే, దీనితో ఎన్నో సంగీత వాద్య పరికరాలు తయారు చేస్తున్నారు. వాటిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది వేణువు. ఎండబెట్టన వెదురుకి రంధ్ర ములు ఏర్పరచడం ద్వారా సప్తస్వరాలు పలికించడానికి దీనిని ఉపయో గిస్తారు. ఈ వేణువుల తయారీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ప్రంపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వేణువుని అనేక పేర్లతో పిలవ డం కూడా ఉంటుంది. డిజి, క్సియో, శకువాచి, పలెన్‌డగ్‌, జింగు, అంక్లుంగ్‌, అనేవి ఇతర దేశీయులు పెట్టుకున్న పేర్లు. ఏదిఏమైన ప్పటికీ, వేణువుకి భారతదేశంలో అత్యంత గౌరవం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇలా వేణువే కాకుండా ఫిడేలు, ఏకతాేరా వంటి అనేక వాయిద్య పరికరాల్లో ఈ వెదురుని వినియోగిస్తూనే ఉంటారు.

ఇళ్ళ నిరాణంలో

వెదురు పురాణకాలం నుంచీ మానవునికి అత్యంత చేరువలో ఉండి ఎన్నో విధాలుగా ఉపయోగంలో ఉంది. దీనిని ఎక్కువగా ఇళ్ళ నిర్మాణాల్లో వినియోగించుకుంటారు. నేటికీ అనేక పల్లెల్లో, పట్టణా లలో వెదురుతో నిర్మించిన ఇళ్ళు మనం చూస్తూనే ఉంటాం. అంతే కాకుండా గృహ సామాగ్రిగా ఉపయోగించుకునే, నిచ్చెనలు, బల్లలు, బట్టలు ఆరవేసుకునే దండాలు, వీటి నారతో తయారు చేసిన బుట్టలు, చాటలు ఇత్యాది మనకి నిత్యావసరాలనే చెప్పవచ్చు.

అలంకరణ సామాగ్రిగా

ఈ రోజుల్లో వెదురుతో చేస్తున్న ఇంటీరియర్‌ ఆర్ట్‌ పీసులు అందరి ఇళ్ళలోనూ ఎంతో శోభని చేకూరుస్తున్నాయి. బెడ్‌ లాంప్‌లు, చేతి బ్యాగులు, అనేక రకాల ఫోటో ఫ్రేములు, పూల సజ్జలు, వాల్‌ హేంగ ర్లు మొదలైనవే కాక, పుస్తకాల రేకలుే, బట్టల బుట్టలు, వెదురు కుర్చీ లు, ఉయ్యాల బల్లలు, ఫెన్సింగులు లాంటివి ఎంతో డిమాండ్‌ కలిగి ఉన్నాయి. జపనీయులు, చైనీయులు, వెదురుతో చేసిన గృహాలకీ, వస్తువులకీ ఎంతో ప్రాధాన్యతనిస్తారు. వెదురులో అత్యంత విశేషం మరొకటి ఏమిటంటే, దీని పుష్పాలు 60 సంవత్సరాలకి ఒక్కమారు పూస్తాయి. అటువంటపðడు ఈ పుష్పాల నుంచి వచ్చే విత్తనాలు శాస్త్రజ్ఞులు సేకరించి జాగ్రత్త చేస్తారు. ఇక ఒక్క మాటలో వెదురు ప్రాశస్త్యం చెప్పాలంటే, పుట్టినపðడు ఉయ్యాల దగ్గరనుంచి, మరణానంతరం ఏడు కట్ల సవారీగా మనిషి జీవిత కాలం అంతా మనతోనే ఉంటుంది.

ఇతరములు

కాగితం తయారీలో వెదురు గుజ్జును వాడతారు. కొన్ని ప్రాంతాల్లో వీటి లేత చిగుళ్ళు ఊరగాయగా పెట్టుకుంటారు. అడవుల్లో నివసించే తెగలవారు. వెదురు బియ్యంగా పిలిచే ఈ వెదురు గింజల్ని మన గోధుమల్లాగే పిండి ఆడించుకుని రొట్టెలు తయారు చేసుకుంటారు.

విశేషాలు మార్చు

  • ప్రపంచంలో ఏమూలనయినా ఒకేరకానికి చెందిన వెదురు ఒకేసారి పూతకు వస్తుంది.
  • వెదురు పూత ఒకేసారి వెన్ను విరిసి ధాన్యం దిగుతుంది. దీని వలన ఎలకల వంటి జీవుల జననాలు విపరీతంగా పెరుగుతాయి.
  • గడ్డి జాతికి చెందిన కొన్ని రకాలు 90 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి.
  • మొలాకా అనే ఎదురు 24 గంటల కాలంలో రెండు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది.
  • ముళ్ళరకం బంబూసా అరుండానేషియా అనే రకం వెదురు 50 లేక 60 సంవత్సరాలకాలంలో ఒకే సారి పూస్తుంది. ఇలాంటి వెదురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల అడవులలో విస్తారంగా పెరుగుతుంది. 1935 నుండి 1938 ల మధ్య పూసిన ఈ వెదురు మళ్ళీ ఇప్పుడు పూస్తున్నది. ఈ విత్తనాలను శాస్త్రజ్ఞులు సేకరించి జాగ్రత్త పరచారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=వెదురు&oldid=3890508" నుండి వెలికితీశారు