ఈము పక్షులు గుడ్లను పొదుగుట

గది ఉష్ణోగ్రతకు అలవాటైన తరువాత, ఫలవంతమైన ఈము గుడ్లను పొదగడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక ట్రేలో సమాంతరంగా గాని ఏటవాలుగా గాని, వరుసలుగా గుడ్లను పెట్టాలి. గుడ్లు పొదిగే స్థలాన్ని (incubator) పూర్తిగా శుభ్రపరిచి, శుద్ధిచేసి సిద్ధంగా ఉంచాలి. మెషీన్ (యంత్రాన్ని) మీట నొక్కి, పొదగడానికి కావలిసిన ఉష్ణోగ్రత సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే డ్రై బల్బే (వేడి బల్బు) ఉష్ణోగ్రత సూమారు 96 - 970 f , వెట్ బల్బ్ (తేమ బల్బు) ఉష్ణోగ్రత సుమారు 78 - 800 f (సుమారు 30 - 40% RH ) లుగా ఉండాలి. గుడ్లను ఉంచిన ట్రేను జాగ్రత్తగా ఒక సెట్టర్ (పొదిగే ప్రాంతం) లో ఉంచాలి. ఒకేసారి, ఇన్ క్యూబేటర్ సరైన ఉష్ణగ్రతతో, తేమతో సిద్ధంగా ఉన్నట్లైతే, గుడ్లను పొదగడానికి ఏర్పాటు చేసుకున్న సమయాన్ని, అవసరమైతే దాని జాతి చరిత్రను తెలిపే చీటిని అందులో పెట్టాలి. ఇన్ క్యూబేటర్ లోని ప్రతి 100 క్యూబిక్ అడుగుల స్థలానికి, 20 గ్రాముల పొటాషియం పెర్మాంగవేట్ (Potassium permananganate) + 40 మిల్లీ లీటర్ల ఫార్మలిన్ (Formaline) ను ఉపయోగించి రోగక్రిములను నాశనం చేయాలి. ప్రతిగంటకు, ఒకసారి గుడ్లను తిప్పుతూ, 48వ రోజు వచ్చే దాకా అలా చేస్తూ ఉండాలి. 49వ రోజు తరువాత గుడ్లను అటూ, యిటూ తిప్పడం మానివేసి, కదలికల కోసం గమనిస్తూ ఉండాలి. 52వ రోజుకు పొదగబడే సమయం అయిపోతుంది. ఎమూ పక్షి పిల్లలు పొడిగా ఉండేటట్లు చూడాలి. గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చినప్పుడు, కనీసం 24 గంటల నుండి 72 గంటల దాకా పొదగబడిన గది (hatcher compartment) లోనే ఉంచాలి. అందువలన వాటిలోని నూగు తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి యిది అవసరం. సాధారణంగా, పొదగడంలో 70% కాని అంతకు మించి కాని ఫలితం ఉంటుంది. తక్కువగా పొదగబడడానికి చాల కారణాలు ఉంటాయి. సంతానోత్పత్తి దశలో, సక్రమమైన పోషకాహారం అంద చేయడం వలన, తరువాతి కాలంలో ఆరోగ్యకరమైన పిల్లలు పొందడానికి కారణమౌతుంది.[1]

ఈము పక్షి
ఈము పక్షి గుడ్లు
శబ్దం చేస్తూ తిరుగుతున్నా ఈము పక్షులు

ఇవి కూడా చూడండి మార్చు

వనరులు మార్చు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]