ఈశ్వర్ సాహు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సజా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఈశ్వర్ సాహు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2023 - ప్రస్తుతం
ముందు రవీంద్ర చౌబే
నియోజకవర్గం సజా శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
బీరాన్‌పూర్ గ్రామం, బెమెతరా జిల్లా,ఛత్తీస్‌గఢ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనత పార్టీ
సంతానం భువనేశ్వర్ సాహు

రాజకీయ జీవితం మార్చు

2023 ఏప్రిల్‌ 08న ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా, సాజా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరాన్‌పూర్ గ్రామంలో హిందు, ముస్లింల మధ్య మత ఘర్షణగా మారిన పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవలో ఈశ్వర్ సాహు కొడుకు భువనేశ్వర్ సాహు హత్యకు గురయ్యాడు. ఈశ్వర్ సాహు న్యాయం కోసం రోజు కూలీ అయిన పోరాటం చేయగా తనకు న్యాయం దొరక్కపోవడంతో ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకోగా, 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన సజా శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన రవీంద్ర చౌబేపై 5,196 ఓట్ల మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3][4]

ఈ ఎన్నికల్లో సాహుకు 1,01,789 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌబేకు 96,593 ఓట్లు వచ్చాయి.

మూలాలు మార్చు

  1. Namaste Telangana (5 December 2023). "ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఓడించిన కూలీ". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  2. DNA India (4 December 2023). "Chhattisgarh Elections: Meet Ishwar Sahu, man who lost his son in mob lynching, dethroned 7-time Congress MLA" (in ఇంగ్లీష్). Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Sakshi (5 December 2023). "ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం!". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. TV5 (5 December 2023). "Chhattisgarh: ఓ సామాన్యుడి విజయ గాధ". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)