ఉంగరము
ఉంగరము (ఆంగ్లం Ring) చేతికి పెట్టుకొనే ఒక విధమైన ఆభరణం.
ఉంగరాలు సాధారణంగా చేతి వేళ్ళకు గాని కాలి వేళ్ళకు గాని పెట్టుకుంటారు. కాని ఇలాంటి కొన్ని ఆభరణాలను దండకు పెట్టుకుంటే వాటిని దండవంకీ అంటారు.
తయారీ
మార్చుఉంగరాలను గుండ్రంగా వేలు కొలత ప్రకారం తయారు చేస్తారు, వేలు పైభాగానికి వచ్చేలా రాళ్ళు పొదగడం, పేర్లు చెక్కడం, దేవుడి బొమ్మలు చేయడం లాంటివి చేస్తారు. ఇవి గాజుతో గాని, బంగారం, వెండి, రాగి వంటి లోహాలతో గాని తయారుచేస్తారు.
ఉంగరాలలో రకాలు
మార్చుఉంగరము స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. రాశుల, నక్షత్రాలను అనుసరించి కొన్ని రకాల ఉంగరాలను ధరించుట భారతీయుల అలవాటు. కొన్ని ఉంగరాలకు ముత్యాలు, వజ్రాలు, పగడాలు మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది. ఉంగరాలలో కొన్ని రకాలు
- పెళ్ళి ఉంగరం
- ప్రధానం ఉంగరం
- వజ్రపుటుంగరం
- నవరత్నాల ఉంగరం. రకాలు
వజ్రము పగడము గోమేధకము