ఉందా..లేదా..? (2017 తెలుగు సినిమా)
ఉందా లేదా 2017లో తెలుగు విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై ఎస్.కమల్ నిర్మించిన ఈ సినిమాకు అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వం వహించాడు.[2] రామకృష్ణ, అంకిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేసి,[3] సినిమాను డిసెంబర్ 15న విడుదల చేశారు.
ఉందా..లేదా..? | |
---|---|
దర్శకత్వం | అమనిగంటి వెంకట శివప్రసాద్ |
రచన | అమనిగంటి వెంకట శివప్రసాద్ |
నిర్మాత | ఎస్.కమల్ |
తారాగణం | రామకృష్ణ, అంకిత, ఝూన్సీ, జీవా |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ కె బంగారి |
కూర్పు | మణికాంత్ తెల్లగూటి |
సంగీతం | శ్రీమురళీ కార్తికేయ |
నిర్మాణ సంస్థ | జయకమల్ ఆర్ట్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురాజ్ (రామకృష్ణ) ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్ మేకర్. విజయవాడలోని రాజా హరిశ్చంద్ర ప్రసాద్ ప్రభుత్వ లేడీస్ హాస్టల్‌లో రుబీనా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఆత్మహత్య వెనక కారణం కనిపెట్టేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కూడా రుబీనా మాదిరిగానే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ హాస్టల్ లో దెయ్యం ఉందని, ఈ ఆత్మహత్యలకు కారణం అదే అని ప్రచారం మొదలవుతుంది. రుబీనా ఆత్మహత్య తర్వాత ఈ హాస్టల్‌లో నందిని(అంకిత) అనే మెడికల్ స్టూడెంట్ చేరుతుంది. నందిని కూడా రుబీనా మాదిరిగానే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. తన ప్రియురాలు నందిని కాపాడేందుకు (రామకృష్ణ) రంగంలోకి దిగుతాడు. మరి అతడు ఏం చేశాడు? నిజంగానే ఈ హాస్టల్‌లో దెయ్యం ‘ఉందా... లేదా?' అనేది మిగతా కథ.
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: జయకమల్ ఆర్ట్
- నిర్మాత: ఎస్.కమల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్
- సంగీతం: శ్రీమురళీ కార్తికేయ
- సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె బంగారి
- ఎడిటర్: మణికాంత్ తెల్లగూటి
- కొరియోగ్రఫీ: నందు జెన్నా
- పాటలు:నాగరాజు కువ్వారపు ,శేషు మోహన్
- పాటలు:సింహ ,హేమచంద్ర ,స్వీకర్ అగస్సీ
- సహానిర్మాతలు: అల్లం సుబ్రమణ్యం ,అల్లం నాగిశెట్టి
మూలాలు
మార్చు- ↑ Sakshi (14 February 2017). "సస్పెన్స్ థ్రిల్లర్". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
- ↑ Sakshi (16 May 2016). "వినూత్నమైన స్క్రిప్ట్". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Sakshi (17 November 2017). "సౌండ్ పొల్యూషన్..." Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.