ఉగ్గుపాలు
ఉగ్గుపాలు ఎం. భూపాల్ రెడ్డి వ్రాసిన బాలసాహిత్యానికి చెందిన కథల పుస్తకం. దీనికి 2011 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[1][2][3]
ఉగ్గుపాలు | |
కృతికర్త: | భూపాల్ |
---|---|
బొమ్మలు: | కె.బాబు |
ముద్రణల సంఖ్య: | 3 |
ముఖచిత్ర కళాకారుడు: | లక్ష్మణ్ ఏలె |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పిల్లల కథలు |
ప్రచురణ: | స్పృహ సాహితి (మొదటి రెండు ముద్రణలు), వెన్నెల ప్రచురణలు(మూడవముద్రణ) |
విడుదల: | 2005,2008, 2012 |
పేజీలు: | IX+190 |
పుస్తక నేపథ్యం
మార్చుఆయన రాసిన పాటలు చాలావరకు ఏదో ఒక సంఘటనను చూసి అప్పటికప్పుడు రాసినవే. పాటలు ఎలా రాయగలరో కథలూ అట్లాగే రాయగలరాయన. ఈ పుస్తకంలో 86 కథలున్నాయి. అవన్నీ దాదాపు ఏదో ఒక సంఘటనను చూసి అప్పటికప్పుడు ఏది కనపడితే దానిపై చిన్న కథగా రాసినవే. ఇలా కాగితాలపై, సిగరెట్ పెట్టెల అట్టలపై వ్రాసిన కథలన్నింటినీ కలిపి ఆయన ఒక తగరం సంచిలో పడేశారు. అయితే ఆయన దగ్గర ఏవో చిన్నపిల్లల కథలున్నాయని తెలిసిన జయధీర్ తిరుమలరావు ఒకసారి జూలూరి గౌరీశంకర్‌తో అన్నాడంట. గౌరీశంకర్ వాటిని పుస్తకంగా తీసుకురావడానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అందులో ఏం పనికొస్తాయో ఏం పనికిరావో ఆయనకు తెలియదని గౌరీశంకర్ కు నచ్చినవి వేసుకోమని ఆయన దగ్గర ఉన్న కాగితాల సంచి ఇచ్చేశారు. వాటిని ఇంటికి తీసుకువెళ్ళి మొత్తం బాగున్నాయి అని మొత్తం 86 కథలతో 'ఉగ్గుపాలు' పుస్తకం వచ్చింది. ఏడేళ్ళకు (2011) ఈ పుస్తకానికే 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉత్తమ బాలసాహిత్యం కేటగిరిలో అవార్డు ఇచ్చారు.[4]
విషయసూచిక
మార్చుఈ పుస్తకంలోని కథలపేర్లు ఈ విధంగా ఉన్నాయి:
- లేట్ కమర్
- అమ్మమ్మ మాట
- సహాయం
- ఓదార్పు
- భయం
- పిల్లలు సినిమాలు
- నీళ్ళు
- రాయి విసిరితే
- కొత్త బ్యాగ్
- ఏం కావాలి?
- నిద్ర
- గల్ల గురిగి
- క్రికెట్ మోజు
- తమ్ముడు
- కిమి జవాబు
- ఆపద
- కోడి
- లీడర్
- మీసం
- సన్నీ పాట
- పిన్ని పెళ్ళి
- దాచితే
- గారాబం
- డాక్టర్ - గుడ్డు మిత్రులు
- అన్నం తింటే
- బలం
- అది చూడు
- క్లాసు మానీటర్స్
- దొంగలు
- ముఖం చూసినవేళ
- వ్రతం
- చిన్ను చూసింది
- లేత భయం
- ముద్దుల నిశిత
- ఒకరి ప్రాణం!?
- బూట్లు
- దున్నపోతు
- వర్షం
- దిగులు
- గొప్పలు
- సిగరెట్
- చదువు చదవాలి
- ఫిష్ ఫ్రై
- కోతి చేష్టలు
- వెధవ గోల
- పి.సి.నారయ్య
- కొత్త లాగు
- వాళ్ల అమ్మ
- రథం పోకడ
- మూటలు
- ఆమె భయం
- ఇంటి నంబరు
- చిన్న తమ్ముడు
- కపటం లేదు
- చిన్నారి శైలూ
- స్కూలు
- ముద్దులయ్య
- ఏడుపు
- వేడి
- వడ్రంగి హుస్సేన్
- స్నేహం
- సలీం
- తన ఇష్టం
- నచ్చిన పని
- హాలిడే
- బాధ
- పుస్తకాల బ్యాగ్
- అదీ ఆటే
- బెస్ట్ ఫ్రెండ్
- ఉగ్గుపాలతో
- అతిగా వెళితే
- నాలుగు మెతుకులు
- మొదటి రోజు
- ఆనందస్వామి
- చెవి కమ్మ
- రైలు బొమ్మ
- ఓహో బలం
- కొత్త స్కూలు
- ఆశ
- పెద్దవాడు
- విజయం
- సంటోని ఏడుపు
- పాత కత
- ఇదో యుక్తి
- ఎవరీయన?
- ప్రశ్నల పాప
అభిప్రాయం
మార్చుఈ కథలు చదువుతున్నప్పుడు పిల్లల ప్రపంచాన్ని మళ్లీ కొత్తగా దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. మనం చాలాసార్లు చూస్తూ కూడా పట్టించుకోని అనేక సూక్ష్మ విషయాల్లోని గాఢత ఈ కథలు చదివినప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఇది రచయిత కథన నైపుణ్యం వల్ల సాధ్యమైంది. చిన్న చిన్న అంశాల్ని చిన్ని చిన్ని పదాలతో చెప్పే ప్రయత్నం సఫలీకృతమైంది. ఈ కథలు చెప్పడంలో రచయిత ఒక సృజనకారుడిగానే కాకుండా ఒక సైకాలజిస్టుగా కూడా దర్శనమిస్తాడు. పెద్దల మనస్తత్వంలో రావాల్సిన మార్పుల్ని చెప్పకనే చెబుతాడు. ఈ కథలు ఏ ప్రాంతంలోని పిల్లలయినా, పెద్దలయినా చదివి అనుభవించి పలవరించడం సాధ్యమే.[5] - గుడిపాటి వెంకటేశ్వర్లు
సాహిత్య అకాడమీ పురస్కార తిరస్కరణ
మార్చుప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత అయిన ఎం.ఎం.కల్బుర్గి హత్య నేపథ్యంలో తనకు వచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును మొదటి తెలుగు వ్యక్తిగా భూపాల్ సాహిత్య అకాడమీకి తిరిగి యిచ్చారు.[6][7]
మూలాలు
మార్చు- ↑ "Sahitya Akademi awardees dissent October 25, 2015". Archived from the original on 2015-10-04. Retrieved 2016-02-08.
- ↑ CLIMATE OF INTOLERANCE AND ROLE OF WRITERS AND POETS[permanent dead link]
- ↑ "Bhoopal, First Telugu Writer to Return Akademi Award". The New Indian Express. Archived from the original on 29 అక్టోబరు 2015. Retrieved 3 November 2015.
- ↑ మూసినది మురికినీటిలో ఓ నాయనో... 29 Dec 2015
- ↑ "పసి హృదయాలను వెలిగించే కథలు" - ఉగ్గుపాలు మూడవ ముద్రణకు వ్రాసిన ముందుమాట నుండి
- ↑ "Telugu writer decides to return Sahitya Akademi Award". G. VENKATARAMANA RAO. The Hindu. 16 October 2015. Retrieved 9 February 2016.
- ↑ Bhoopal Reddy gives up Sahitya Akademi award